ఓటీటీలోకి తమిళ్ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్.. 8.0 ఐఎండీబీ రేటింగ్.. ఎక్కడ చూడొచ్చంటే?
తమిళ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి దూసుకొచ్చింది. ఈ రోజు నుంచే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. భయపెట్టే సీన్స్ తో, ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ తో ఈ మూవీ థియేటర్లలో ఆడియన్స్ ను అలరించింది. ఇప్పుడు ఈ సినిమా ఏ ఓటీటీలోకి వచ్చేసిందో ఇక్కడ చూసేయండి.
వారం వారం ఓటీటీలోకి డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ క్యూ కడుతూనే ఉంటాయి. ఈ వారం కూడా విభిన్న చిత్రాలు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేశాయి. ఇందులో ఓ తమిళ్ మూవీ స్పెషల్ గా ఉంది. సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆ మూవీనే ‘జిన్: ది పెట్’. ఈ సినిమా ఈ రోజు (జూన్ 20) ఓటీటీలోకి వచ్చేసింది.

ఏ ఓటీటీలో అంటే
తమిళ్ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ జిన్: ది పెట్ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసింది. సన్ నెక్ట్స్ ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ప్రస్తుతానికైతే తమిళంలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ రోజు నుంచే ఓటీటీలోకి వచ్చిన ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ ఆడియన్స్ ను ఎంగేజ్ చేసే అవకాశముంది. జిన్ అంటే ఇస్లామిక్ లో ‘ఫ్రీ విల్ తో ఉన్న సూపర్ నేచురల్ జీవి’ అని అర్థం. మంచి, చెడు శక్తులను ఇది హ్యాండిల్ చేయగలదు.
థియేటర్లో రెస్పాన్స్
తమిళ్ సినిమా జిన్: ది పెట్ మూవీ మే 30న థియేటర్లలో రిలీజ్ అయింది. గ్రిప్పింగ్ స్టోరీ లైన్ తో వచ్చిన ఈ మూవీ అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. థియేటర్లలో టాక్ ఏమంత గొప్పగా రాలేదు. హారర్ సీన్స్ బాగానే ఉన్నా ఆడియన్స్ ను మాత్రం ఎంగేజ్ చేయలేకపోయింది. మరి ఓటీటీలో ఈ మూవీకి ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.
ముగెన్ రావు, భవ్య లీడ్ రోల్ ప్లే చేసిన జిన్: ది పెట్ మూవీకి టీఆర్ బాలా డైరెక్టర్. ఫైయిరీ టేల్ పిక్చర్స్, ఏఆర్ టూరింగ్ టాకీస్ బ్యానర్లపై టీఆర్ బాలా, అనిల్ కుమార్ రెడ్డి, రాఘవేంద్ర బెల్లంకొండ సినిమాను ప్రొడ్యూస్ చేశారు.
కథ ఏమిటంటే?
శక్తి (ముగెన్ రావు)కి జీవితంలో వరుసగా ఎదురు దెబ్బలు తగులుతుంటాయి. జాబ్, లవ్ ఇలా ఏదీ కలిసిరాలేదు. ఆ సమయంలో ఓ మాంత్రికుడు జిన్ తో కూడిన ఓ మ్యాజిక్ బాక్స్ ను ఇస్తాడు. అది ఇంట్లోకి రాగానే శక్తి లైఫ్ మారిపోతుంది. ప్రియ (భవ్య)తో పెళ్లి జరుగుతుంది. అంతా బాగానే ఉంది అనుకునే టైమ్ లో ఆ జిన్ విచిత్రంగా ప్రవర్తిస్తుంది. ఆ బాక్స్ కారణంగా ఇంట్లో సమస్యలు వస్తాయి. నెగెటివ్ ఎనర్జీతో జిన్ దుష్టశక్తిగా మారేలా కనిపిస్తుంది.
ఆ టైమ్ లో బాక్స్ నుంచి బయటకు వచ్చే జిన్ అందరినీ భయపెడుతుంది. మరి ఆ జిన్ నుంచి హీరో ఎలా బయటపడ్డాడు? తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? అసలు జిన్ కథ ఏమిటీ? అన్నదే స్టోరీ లైన్.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper



