జిన్ రివ్యూ- కాలేజీ కింద మరో కాలేజ్- నవ్విస్తూనే భయపెట్టే తెలుగు కామెడీ హారర్ థ్రిల్లర్- ఎలా ఉందంటే?

తెలుగులో లేటెస్ట్‌గా తెరకెక్కిన హారర్ కామెడీ థ్రిల్లర్ సినిమా జిన్. అమ్మిత్ రావ్, పర్వేజ్ సింబా, ప్రకాష్ తుమినాద్, సంగీత అనిల్, రవి భట్ వంటి తదితరులు నటించిన జిన్ మూవీ ఇవాళ (డిసెంబర్ 19) థియేటర్లలోకి వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి జిన్ రివ్యూలో తెలుసుకుందాం.

Published on: Dec 19, 2025, 12:10:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టైటిల్: జిన్

జిన్ రివ్యూ- కాలేజీ కింద మరో కాలేజ్- నవ్విస్తూనే భయపెట్టే తెలుగు కామెడీ హారర్ థ్రిల్లర్- ఎలా ఉందంటే?
జిన్ రివ్యూ- కాలేజీ కింద మరో కాలేజ్- నవ్విస్తూనే భయపెట్టే తెలుగు కామెడీ హారర్ థ్రిల్లర్- ఎలా ఉందంటే?

నటీనటులు: అమ్మిత్ రావ్, పర్వేజ్ సింబా, రవి భట్, సంగీత అనిల్, బాలా రాజ్వాడీ, ప్రకాష్ తుమినాద్, భార్గవ్ రామ్ తదితరులు

సంగీతం: అలెక్స్

దర్శకత్వం: చిన్మయి రామ్

సినిమాటోగ్రఫీ: సునీల్ హొన్నాలి

ఎడిటింగ్: కీర్తి రాజ్ డి

నిర్మాత: నిఖిల్ ఎమ్ గౌడ

విడుదల తేది: డిసెంబర్ 19

హారర్ థ్రిల్లర్స్ అంటే ఆడియెన్స్‌కు అమితమైన ఇంట్రెస్ట్ ఉంటుంది. అందుకే ఎలాంటి భాషలో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్స్ తెలుగులోనూ విడుదల అవుతుంటాయి. అలా ఇవాళ (డిసెంబర్ 19) థియేటర్లలో తెలుగులో విడుదలైన కామెడీ హారర్ థ్రిల్లర్ సినిమా జిన్.

సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్స్‌పై నిఖిల్ ఎం. గౌడ నిర్మాతగా రూపొందించిన చిత్రమే జిన్. ఈ సినిమాకు చిన్మయ్ రామ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజ్ అయిన జిన్ టీజర్, ట్రైలర్‌లు అందరినీ ఆకట్టుకున్నాయి. మరి ఈ మూవీ ఎలా ఉందో నేటి జిన్ రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

నలుగురు ఫ్రెండ్స్ ఎగ్జామ్ రాసేందుకు భూతనాల చెరువు సమీపంలోని జ్ఞాన వికాస్ కాలేజ్‌కు వెళ్తారు. కానీ, అనుకోకుండా ఆ కాలేజ్‌లోనే ఆ నలుగురు చిక్కుకుపోతారు. రాత్రి అయితే కాలేజ్‌లోని లైబ్రరీ నుంచి వింత శబ్ధాలు వస్తూ వింత సంఘటనలు కనిపిస్తాయి.

అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండగా ఆ కాలేజీ కింద మరో కాలేజ్ ఉండేదని, వారు జిన్ ట్రాప్‌లో పడ్డారని తెలుసుకుంటారు. ఆ తర్వాత ఏమైంది? జిన్ నుంచి నలుగురు స్నేహితులు బయటపడ్డారా? జిన్‌ను పట్టుకునేందుకు వచ్చిన వ్యక్తి ఎవరు? అండర్‌గ్రౌండ్‌లో ఉన్న కాలేజీలో ఏం జరిగింది? అక్కడి స్టూడెంట్స్ ఏమయ్యారు? అనే విషయాలు తెలియాలంటే జిన్ మూవీ చూడాల్సిందే.

విశ్లేషణ:

హారర్ జోనర్‌కు కామెడీ యాడ్ చేసి తెరకెక్కించిన సినిమాలను ఎన్నో చూశాం. దెయ్యం చుట్టూ సాగే కథ, దానికి బలి అవుతూ కామెడీ చేసే మనుషులు. సుమారు ఇలాంటి ఫార్మాట్‌లో జిన్ మూవీని రూపొందించారు. కానీ, కాలేజ్ అండర్‌గ్రౌండ్‌లో మరో కాలేజ్ లాంటి కథలో వచ్చే కొన్ని ట్విస్టులు ఆకట్టుకుంటాయి.

ఎగ్జామ్ రాసేందుకు వెళ్లి ఇరుక్కోవడం అనేది కాస్తా కొత్త పాయింట్ అనే చెప్పొచ్చు. ఆ కాలేజ్ బిల్డింగ్‌లో నలుగురు ఫ్రెండ్స్‌తో చేసే భయానక సీన్స్, కామెడీ నవ్విస్తూనే భయపెడుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఆ నలుగురు కుర్రాళ్లు, వారి అల్లరి చేష్టలు, కాలేజ్‌లోకి వెళ్లడం వంటి సీన్లతోనే సాగుతుంది.

అయితే ఇంటర్వెల్ వరకు వారికి ఏర్పడిన ప్రమాదం గురించి తెలుసుకుంటారు. అలా వారు ఆ భవనం నుంచి ఎంతకీ బయటపడలేకపోతారు. అలాంటి టైంలో ఓ చిన్న ట్విస్ట్‌తో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. ఈ క్రమంలోనే వారి ముందు వచ్చే పాత్రలతో ఉండే ట్విస్ట్ ఆకట్టుకునేలా ఉంటుంది.

ఒక్కో ట్విస్ట్ రివీల్ చేస్తూ

ఇక సెకండాఫ్‌లో అప్పటివరకు భయపెట్టిన జిన్ ఎంట్రీ, పోలీసుల ఇన్వెస్టిగేషన్, ఆ కాలేజీ భవనం చరిత్ర, అందులో ఉన్న ఆత్మల గురించి ఒక్కొక్కటిగా రివీల్ చేస్తూ ఇంట్రెస్టింగ్‌గా మలిచారు డైరెక్టర్ చిన్మయి రామ్. అలా ప్రీ క్లైమాక్స్ వరకు కథ మంచి పట్టుతో సాగుతుంది. క్లైమాక్స్ అందరినీ మెప్పించేలా ఉంటుంది.

టెక్నికల్ వర్క్

అయితే, జిన్ 2 మూవీకి కూడా మంచి లీడ్ ఇచ్చేలా జిన్ సినిమాను ముగించారు. సినిమాటోగ్రఫీ బాగుంది. బీజీఎమ్ భయపెట్టేందుకు బాగా వర్కౌట్ అయింది. ఎడిటింగ్ ఓకే. విజువల్స్‌ బాగున్నాయి. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ వర్క్ మెచ్చుకోవచ్చు. కాస్తా యూనిక్ పాయింట్‌తో కొంచెం రెగ్యులర్ ఫార్మాట్‌లో దర్శకుడు చిన్మయి రామ్ జిన్‌ను బాగానే ఆవిష్కరించారు.

ఇక అమిత్ రావ్ అందరినీ ఆకట్టుకుంటాడు. సెకండాఫ్‌లో ఆయన ఎంట్రీ బాగుటుంది. చాలా చోట్ల కంటి చూపుతోనే నటించేశాడు. ఇక పర్వేజ్ సింబా తన నటనతో ప్రేక్షకుల్ని నవ్వించాడు. తెలుగు ప్రేక్షకులకు వీరు అంతా కొత్తగా అనిపిస్తారు, కనిపిస్తారు. కానీ, వారి నటన ఆకట్టుకునేలా ఉంటుంది.

ఫైనల్‌గా చెప్పాలంటే

హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్, పోలీస్ ఆఫీసర్ ఇలా అందరూ తమ తమ పాత్రల్లో బాగానే ఒదిగిపోయారు. నిర్మాతల ఖర్చు, కష్టం తెలుస్తోంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఫైనల్‌గా చెప్పాలంటే నవ్విస్తూ మంచి హారర్ మిస్టరీ థ్రిల్లర్ చూడాలనుకునేవారికి జిన్ నచ్చుతుంది.

రేటింగ్: 2.75/5

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More