Jio Home Offers: జియో సూపర్ బంపర్ ఆఫర్.. రూ.400కే అన్‌లిమిటెడ్ వైఫై, 1000కిపైగా ఛానెల్స్, 12 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్
Jio Home Offers: జియో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల యూజర్లకు బంపర్ ఆఫర్ ఇస్తోంది. కేవలం రూ.400కే టీవీ, వైఫై, ఓటీటీ అంటూ సంచలనం సృష్టిస్తోంది. ఇందులో భాగంగా అందుబాటులో ఉన్న మూడు ప్లాన్స్ ఏవో ఇక్కడ తెలుసుకోండి.
Jio Home Offers: టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) తెలుగు రాష్ట్రాల ప్రజలకు మైండ్ బ్లాకింగ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న కుటుంబాల కోసం హై-స్పీడ్ వైఫై, 1,000కి పైగా లైవ్ టీవీ ఛానెళ్లు, పాపులర్ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లతో కూడిన 'జియో హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్స్'ను కేవలం నెలకు రూ. 400ల ప్రారంభ ధరకే అందుబాటులోకి తెచ్చింది. ఒకే ఒక్క కనెక్షన్, ఒకే నెలవారీ బిల్లుతో ఇంటర్నెట్, టీవీ, ఓటీటీ సేవలను సొంతం చేసుకునే వెసులుబాటును ఈ ఆల్-ఇన్-వన్ ప్యాకేజీ కల్పిస్తోంది.

వర్షం పడితే సిగ్నల్ పోయే బాధలు కట్.. జియో డైరెక్ట్ ఫైబర్ మ్యాజిక్
సాధారణంగా వర్షం పడినా, తుఫాను వచ్చినా కేబుల్ టీవీ లేదా DTH సిగ్నల్స్ కట్ అయి ఇబ్బంది పెడుతుంటాయి. అయితే జియో తన సొంత ఫైబర్ నెట్‌వర్క్ ద్వారా టీవీ సేవలను అందిస్తుండటంతో వాతావరణం బాగా లేకపోయినా కూడా ఎలాంటి అంతరాయం లేని క్వాలిటీ వ్యూయింగ్ అనుభవం లభిస్తుంది.
అంతేకాకుండా లైవ్ టీవీ ప్రోగ్రామ్‌లను పాజ్ చేయడం, రివైండ్ చేసి మళ్లీ చూడటం లాంటి వినూత్న ఫీచర్లను కూడా జియో పరిచయం చేసింది. దీనివల్ల మీకు ఇష్టమైన సీరియల్స్, సినిమాలు, స్పోర్ట్స్ లేదా న్యూస్ ప్రోగ్రామ్స్‌ను ఎప్పటికీ మిస్ అవ్వకుండా చూడవచ్చు.
జియో హోమ్ ప్లాన్ల కేటగిరీలు.. మీ ఇంటికి ఏది బెస్ట్?
యూజర్స్ విభిన్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని జియో ఈ ప్లాన్లను ప్రధానంగా మూడు విభాగాలుగా విభజించింది.
1. టీవీ ఓన్లీ ప్యాక్ రూ. 400/నెలకు
ఇప్పటికే వేరే ఇంటర్నెట్ వాడుతూ కేవలం టీవీ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకునే వారి కోసం ఇది డిజైన్ చేశారు.
ఆఫర్లు & బెనిఫిట్స్: 200 కంటే ఎక్కువ HD ఛానెళ్లతో కలిపి 1,000+ లైవ్ టీవీ ఛానెళ్లు లభిస్తాయి. ఆహా (aha), జియోహాట్‌స్టార్ (JioHotstar), జీ5 (ZEE5), సోనీ లివ్ (Sony LIV) తో కలిపి 12 ఓటీటీ యాప్స్ ఉచితంగా వస్తాయి.
ప్రీపెయిడ్ ఆప్షన్లు: 2 నెలలకు రూ. 1,000 లేదా 5 నెలలకు రూ. 2,000 చెల్లించి ఈ సేవలను పొందవచ్చు. వెల్‌కమ్ ఆఫర్ కింద 12 ఓటీటీ యాప్స్‌కు ఎలాంటి అదనపు ఛార్జీ లేదు.
2. వైఫై + టీవీ + ఓటీటీ ప్యాక్‌లు (WiFi + TV + OTT Combo)
ఇంటర్నెట్, టీవీ, ఓటీటీ అన్నీ ఒకే ప్యాక్‌లో కావాలనుకునే కుటుంబాలకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.
30 Mbps ప్యాక్ (రూ. 555/నెలకు): అన్‌లిమిటెడ్ 30 Mbps స్పీడ్ వైఫై, 1000+ టీవీ ఛానెళ్లు, 12 ఓటీటీ యాప్స్ వస్తాయి. రూ. 2,222 లకే 3 నెలల రీఛార్జ్ చేసుకుంటే 1 నెల ఉచితంగా లభిస్తుంది.
100 Mbps ప్యాక్ (రూ. 707/నెలకు): అన్‌లిమిటెడ్ 100 Mbps స్పీడ్ ఇంటర్నెట్‌తో పాటు అన్ని టీవీ, ఓటీటీ ఆఫర్లు లభిస్తాయి. రూ. 2,122 కే 2 నెలల రీఛార్జ్ చేసుకుంటే మరో 1 నెల అదనపు స్ట్రీమింగ్ పూర్తి ఉచితం.
3. వైఫై ఓన్లీ ప్యాక్స్ (WiFi Only Packs)
టీవీ ఛానెళ్లతో పనిలేకుండా కేవలం ఆఫీస్ వర్క్, ఆన్‌లైన్ క్లాసులు, హై-స్పీడ్ నెట్ కోరుకునే వారి కోసం ఇవి అందుబాటులో ఉన్నాయి.
30 Mbps ప్యాక్ (రూ. 450/నెలకు): 2 నెలలకు రూ. 1,100 లేదా 5 నెలలకు రూ. 2,200 ప్రీపెయిడ్ ఆప్షన్లు ఉన్నాయి.
100 Mbps ప్యాక్ (రూ. 600/నెలకు): బహుళ డివైజ్ కనెక్టివిటీ, గేమింగ్‌కు అనువైన ఈ ప్లాన్ 2 నెలలకు రూ. 1,500 లేదా 5 నెలలకు రూ. 3,000 ధరకు లభిస్తుంది.
ఉచిత ఇన్‌స్టాలేషన్.. మార్కెట్లో జియో సంచలనం
ఈ ఆఫర్‌ను ఎంచుకున్న కస్టమర్లకు జియో ప్రొఫెషనల్ ఇన్‌స్టాలేషన్ ఇంజనీర్ల ద్వారా ఎలాంటి అదనపు రుసుము లేకుండా ఉచిత ఇన్‌స్టాలేషన్, ఉచిత మెయింటెనెన్స్ సేవలను అందిస్తున్నారు. టీవీలోనే నేరుగా యూట్యూబ్ (YouTube) యాక్సెస్ చేసుకునే సదుపాయం కూడా ఉంది.
ప్రస్తుతం ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్, బిఎస్ఎన్ఎల్ ఫైబర్ నెట్‌వర్క్‌లతో పోలిస్తే తక్కువ ధరలోనే అత్యధిక ప్రయోజనాలను ఇస్తుండటంతో తెలుగు ఇళ్లలో జియో హోమ్ ప్లాన్ల హవా నడవనుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


