జియోహాట్‌స్టార్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌.. క్లైమ్యాక్స్ ట్విస్ట్ ఊహించలేరు.. చివరి 15 నిమిషాలు అస్సలు మిస్ కావద్దు

జియోహాట్‌స్టార్ ఓటీటీలోకి ఈ మధ్యే వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ క్రిమినల్ జస్టిస్ సీజన్ 4 ఎ ఫ్యామిలీ మ్యాటర్ ట్విస్టులతో ప్రేక్షకులకు మంచి థ్రిల్ పంచుతోంది. ముఖ్యంగా చివరి ఎపిసోడ్, అందులోనూ చివరి 15 నిమిషాలు హైలైట్ అని చెప్పొచ్చు.

Published on: Jul 3, 2025, 22:40:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

క్రైమ్ థ్రిల్లర్‌కు లీగల్ డ్రామా తోడైతే అదే జియోహాట్‌స్టార్ కొన్నేళ్లుగా అందిస్తున్న క్రిమినల్ జస్టిస్ వెబ్ సిరీస్ అవుతుంది. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకొని తాజాగా నాలుగో సీజన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సిరీస్ అన్ని ఎపిసోడ్లు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ఈ గురువారం (జులై 3) వచ్చిన చివరి ఎపిసోడ్, క్లైమ్యాక్స్ ప్రేక్షకులను షాక్ కు గురి చేసేలా ఉంది.

జియోహాట్‌స్టార్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌.. ట్విస్టులే ట్విస్టులు.. చివరి 15 నిమిషాలు అస్సలు మిస్ కావద్దు
జియోహాట్‌స్టార్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌.. ట్విస్టులే ట్విస్టులు.. చివరి 15 నిమిషాలు అస్సలు మిస్ కావద్దు

క్రిమినల్ జస్టిస్ సీజన్ 4 స్టోరీ ఏంటంటే?

క్రిమినల్ జస్టిస్.. ఇండియన్ ఓటీటీ స్పేస్ లో వచ్చిన హిట్ క్రైమ్ థ్రిల్లర్, లీగల్ డ్రామా వెబ్ సిరీస్ లలో ఒకటి. ఇందులో మాధవ్ మిశ్రా అనే లాయర్ గా ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠీ నటిస్తున్నాడు. తాజాగా ఎ ఫ్యామిలీ మ్యాటర్ పేరుతో నాలుగో సీజన్ వచ్చింది. కొన్నాళ్లుగా ప్రతి గురువారం ఒక్కో ఎపిసోడ్ రిలీజ్ చేస్తూ వస్తున్నారు.

ఈ గురువారం (జులై 3) చివరి ఎపిసోడ్ వచ్చేసింది. ఈ కొత్త సీజన్ లో స్టోరీ ఓ డాక్టర్, మాజీ క్రిమినల్ లాయర్ భార్యాభర్తలుగా ఉన్న ఇంట్లో జరిగే ఓ హత్య చుట్టూ తిరుగుతుంది. ఆ హత్య ఎవరిదో కాదు.. డాక్టర్ రాజ్ నాగ్‌పాల్ (జీషాన్ ఆయుబ్) ప్రేయసి, అతని కూతురు ఇరా (ఖుషీ భరద్వాజ్)కు నర్స్‌గా ఉన్న రోషినీ సలూజా (ఆశా నేగి)ది. ఈ హత్యలో రాజ్ తోపాటు ఇప్పుడు అతనికి దూరంగా ఉంటున్న అతని భార్య అంజు నాగ్‌పాల్ (సుర్లీన్ చావ్లా) కూడా ప్రధాన అనుమానితులుగా ఉంటారు. ఈ హత్య కేసులో మొదట పోలీసులను రాజ్ ను అరెస్ట్ చేస్తారు.

ఆ తర్వాత ఈ కేసులో ముఖ్యమైన ఆధారం దొరికిన తర్వాత అంజు కూడా నిందితురాలిగా భావించి ఆమెను కూడా అరెస్ట్ చేస్తారు. రాజ్ తరఫున లాయర్ మాధవ్ మిశ్రా (పంకజ్ త్రిపాఠీ), అంజు తరఫున లాయర్ మందిర (మితా వశిస్ట్)తోపాటు ప్రాసిక్యూషన్ తరఫున లేఖ అగస్త్య (శ్వేతా బసు ప్రసాద్) రంగంలోకి దిగుతారు. ఈ ముగ్గురు లాయర్ల మధ్య కోర్టులో హోరాహోరీ సాగుతుంది. చివరికి విజయం ఎవరిది అన్నది ఈ సిరీస్ లో చూడొచ్చు.

క్రిమినల్ జస్టిస్ సీజన్ 4 రివ్యూ

క్రిమినల్ జస్టిస్ సీజన్ 4లో మొత్తం 8 ఎపిసోడ్లు ఉన్నాయి. ఓ క్రైమ్ థ్రిల్లర్, లీగల్ డ్రామాలో ఉండాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఇందులో ఉన్నాయని చెప్పొచ్చు. ఓ హత్య, దాని చుట్టూ కోర్టులో జరిగే వాదనలు ఎంతో ఆసక్తి రేపుతుంటాయి. ఒక్కో ఎపిసోడ్ ముగుస్తున్న కొద్దీ అసలు హత్య ఎవరు చేశారన్న ఉత్కంఠ ప్రేక్షకుల్లో పెరుగుతూ ఉంటుంది.

భార్యాభర్తలే ప్రధాన నిందితులు కావడంతో సహజంగానే ఈ ఆసక్తి మరింత పెరుగుతుంది. ఇక మాధవ్ మిశ్రా స్టైల్ వాదనలు ఈ సీజన్ 4కు కూడా అదనపు బలంగా నిలిచాయి. ఇక కథనంలో భాగంగా మధ్యమధ్యలో వచ్చే ట్విస్టులు కూడా థ్రిల్ పంచుతాయి. ముఖ్యంగా చివరి ఎపిసోడ్ చివరి 15 నిమిషాల్లో వచ్చే మలుపులు ఓ మంచి సిరీస్ చూశామన్న సంతృప్తి కలిగిస్తాయి.

మాధవ్ మిశ్రాగా ఈ సీజన్లోనూ పంకజ్ త్రిపాఠీ అదరగొట్టగా.. మిగిలిన పాత్రలన్నీ తమ పరిధి మేర సహకారం అందించాయి. మొత్తంగా జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ క్రిమినల్ జస్టిస్ సీజన్ 4 ఎ ఫ్యామిలీ మ్యాటర్.. ఈ వీకెండ్ ఓ మస్ట్ వాచ్ అని చెప్పాలి.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More