జియోహాట్‌స్టార్‌లోని రకుల్ ప్రీత్ హారర్ థ్రిల్లర్ మూవీ చూశారా? తెలుగు, తమిళంలలో స్ట్రీమింగ్.. డిఫరెంట్ స్టోరీ

జియోహాట్‌స్టార్ ఓటీటీలో రకుల్ ప్రీత్ సింగ్ నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ చూశారా? తెలుగు, తమిళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా రెండేళ్ల కిందట వచ్చింది. తాజాగా మరోసారి ఆ ఓటీటీ ఈ మూవీని ప్రమోట్ చేస్తోంది.

Published on: Jul 14, 2025, 14:09:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హారర్ థ్రిల్లర్ జానర్ ఇష్టపడే ప్రేక్షకుల కోసం జియోహాట్‌స్టార్ ఓటీటీలో ఓ మూవీ ఉంది. ప్రముఖ టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్, విశ్వక్సేన్ లాంటి వాళ్లు నటించిన ఈ సినిమా రెండేళ్ల కిందట అప్పటి జియోసినిమా ఓటీటీలోనే నేరుగా స్ట్రీమింగ్ అయింది. అయితే ఇప్పుడు మరోసారి ఈ మూవీ తెరపైకి వచ్చింది.

జియోహాట్‌స్టార్‌లోని రకుల్ ప్రీత్ హారర్ థ్రిల్లర్ మూవీ చూశారా? తెలుగు, తమిళంలలో స్ట్రీమింగ్.. డిఫరెంట్ స్టోరీ
జియోహాట్‌స్టార్‌లోని రకుల్ ప్రీత్ హారర్ థ్రిల్లర్ మూవీ చూశారా? తెలుగు, తమిళంలలో స్ట్రీమింగ్.. డిఫరెంట్ స్టోరీ

బూ ఓటీటీ స్ట్రీమింగ్

హారర్ థ్రిల్లర్మూవీ బూ (Boo) ఎప్పుడో రెండేళ్ల కిందట అంటే మే, 2023లో అప్పటి జియోసినిమా ఓటీటీలో డిజిటల్ ప్రీమియర్ అయింది. థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకే స్ట్రీమింగ్ కు వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమాను జియోహాట్స్టార్ ఓటీటీ మరోసారి ప్రమోట్ చేస్తోంది.

వీకెండ్ సజెషన్ అంటూ తన ఎక్స్ అకౌంట్ లో ఈ సినిమా గురించి చెప్పింది. “బూ మూవీతో హాలోవీన్ స్టోరీల గురించి తెలుసుకునే టైమ్ ఇది. జియోహాట్‌స్టార్ ఓటీటీలో ఎక్స్‌క్లూజివ్ గా స్ట్రీమింగ్ అవుతోంది” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది.

బూ మూవీ గురించి..

బూ (Boo) మూవీని తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కించారు. ఈ హారర్ థ్రిల్లర్ సినిమాను మే 27, 2023న జియోసినిమా ప్రీమియర్ చేసింది. ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, విశ్వక్సేన్, రెబా మోనికా జాన్, నివేదా పేతురాజ్, మంజిమా మోహన్, మేఘా ఆకాశ్ లాంటి వాళ్లు నటించారు. ఇదో డిఫరెంట్ స్టోరీతో వచ్చిన హారర్ థ్రిల్లర్ సినిమా. హాలోవీన్ సెలబ్రేట్ చేసుకుందామనుకునే నలుగురు స్నేహితుల చుట్టూ తిరిగే స్టోరీ ఇది.

కియారా (రకుల్ ప్రీత్) ఇంట్లో హాలోవీన్ జరుపుకుంటుండగా వాళ్లకు హాలోవీన్ స్టోరీస్ పేరుతో ఓ బుక్ దొరుకుతుంది. అయితే అందులోని స్టోరీలన్నింటినీ ఒకేసారి చదవాలన్న వార్నింగ్ ఉంటుంది. అందులో మొత్తం 4 స్టోరీలు ఉంటాయి. వాటిని చదువుతున్న కొద్దీ ఆ నలుగురు స్నేహితులకు ఆసక్తి పెరుగుతుంది. అంతేకాదు ఆ స్టోరీల్లోని పాత్రలు వాళ్లకు నిజ జీవితంలోనూ ఎదురవుతుంటాయి. ఇది వాళ్లను ప్రమాదంలో పడేస్తాయి. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే ఈ బూ మూవీ కథ.

ఈ సినిమా నేరుగా ఓటీటీలోకి వచ్చినా ప్రేక్షకుల నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఐఎండీబీలోనూ 5 రేటింగ్ మాత్రమే వచ్చింది. చాలా వరకు నెగటివ్ రివ్యూలే వచ్చాయి. అయితే హారర్ థ్రిల్లర్ జానర్ చూడాలనుకుంటే మాత్రం ఈ బూ మూవీపై ఓ లుక్కేయొచ్చు. తెలుగు, తమిళం భాషల్లో జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More