...
...
Next Story

జియోహాట్‌స్టార్‌ ఓటీటీలోకి స్పెషల్ స్పై థ్రిల్లర్.. కమింగ్ సూన్ అంటూ వీడియో.. హాట్ బ్యూటీ మౌనీ రాయ్ యాక్షన్

జియోహాట్‌స్టార్‌ ఓటీటీ మరో స్పై థ్రిల్లర్ ఫిల్మ్ ను ఫ్యాన్స్ కోసం తీసుకొస్తుంది. ఆడియన్స్ కు థ్రిల్ పంచేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే ఓటీటీలో రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసింది. స్పెషల్ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది.

Published on: Jun 18, 2025, 12:57:48 IST
By ,
Prefer HTon Google
Advertisement

థియేటర్లలో రిలీజైన సినిమాలతో పాటు ఓటీటీ స్పెషల్ కంటెంట్ తోనూ ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తోంది జియోహాట్‌స్టార్‌. డిఫరెంట్ జోనర్లో ఆ ఓటీటీ స్పెషల్ సినిమా, సిరీస్ లు ఉన్నాయి. ఇప్పుడు ఆడియన్స్ ను మరింత ఎంటర్ టైన్ చేసేందుకు స్పై థ్రిల్లర్ ను తీసుకొస్తుంది జియోహాట్‌స్టార్‌. మునుపెన్నడూ లేని విధంగా డిఫరెంట్ స్టోరీ లైన్ తో ఈ స్పై ఫిల్మ్ ఉంటుందని జియోహాట్‌స్టార్‌ ఓటీటీ చెప్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో టైటిల్ రివీల్ చేస్తూ వీడియో రిలీజ్ చేసింది.

సలకార్ పేరుతో

జియోహాట్ స్టార్ ఓటీటీలో స్పై థ్రిల్లర్ (x/JioHotstar)
జియోహాట్ స్టార్ ఓటీటీలో స్పై థ్రిల్లర్ (x/JioHotstar)

సలకార్ పేరుతో స్పెషల్ ఫిల్మ్ ను తీసుకురాబోతోంది జియోహాట్స్టార్ ఓటీటీ. ఈ ప్రముఖ ఓటీటీ సంస్థ స్పై థ్రిల్లర్ గా దీన్ని రెడీ చేస్తోంది. బుధవారం (జూన్ 18) సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేసిన జియోహాట్‌స్టార్‌ ఈ స్పెషల్ ఫిల్మ్ టైటిల్ ను రివీల్ చేసింది. ‘‘దేశ భద్రత కోసం అత్యున్నత అంకితభావంతో పని చేసే అసాధారణ స్పై మాస్టర్ ను చూడండి. హాట్ స్టార్ స్పెషల్స్ సలకార్ త్వరలోనే జియో హాట్ స్టార్ లోకి వస్తుంది’’ అని వీడియోను పోస్టు చేసింది.

లెజెండ్

బాలీవుడ్ హాట్ బ్యూటీ మౌనీ రాయ్ ఈ సలకార్ ఫిల్మ్ లో యాక్ట్ చేసినట్లు సమాచారం. అందంతో పాటు యాక్షన్ సీన్స్ లోనూ ఆమె అదరగొట్టినట్లు తెలుస్తోంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు పోస్టు చేస్తూ మౌనీ రాయ్ ట్రెండింగ్ లోనే ఉండే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఇండియన్ ఏజెంట్ కబీర్ గా అయాన్ లాల్ నటించారని సమాచారం. ఈ జియోహాట్‌స్టార్‌ స్పెషల్ ఫిల్మ్ కు ఫారుక్ కబీర్ డైరెక్టర్. సురాగ్ బ్రహ్మభట్ ప్రొడ్యూసర్.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks