Thriller Web Series: జియోహాట్‌స్టార్‌లో 7 ఎపిసోడ్ల మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్ సిరీస్.. కొత్త పెళ్లి కూతురికి వింత అనుభవం
Thriller Web Series: జియోహాట్‌స్టార్ లో ఉన్న తెలుగు థ్రిల్లర్ వెబ్ సిరీస్ వధువు చూశారా? చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ అవికా గోర్ లీడ్ రోల్లో నటించిన ఈ సిరీస్ ఆమె అత్తారింటి డార్క్ సీక్రెట్స్ చుట్టూ తిరుగుతూ మంచి థ్రిల్ పంచుతుంది.
Thriller Web Series: 'చిన్నారి పెళ్లికూతురు' ఫేమ్ అవికా గోర్ లీడ్ రోల్లో నటించిన ఇన్వెస్టిగేటివ్ సస్పెన్స్ థ్రిల్లర్ 'వధువు' (Vadhuvu) జియోహాట్‌స్టార్‌లో సైలెంట్‌గా ట్రెండ్ అవుతూ మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఏడు ఎపిసోడ్ల పాటు సాగే ఈ థ్రిల్లర్ సిరీస్ లో ప్రతి నిమిషం ఊహించని ట్విస్టులతో డిజిటల్ ఆడియన్స్ కు మంచి థ్రిల్ పంచుతోంది.

అత్తారింట్లో అడుగుపెట్టగానే మొదలైన సీక్రెట్స్!
'ఉయ్యాల జంపాల', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' లాంటి హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న అవికా గోర్ ఇందులో 'ఇందు' అనే పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించింది. పెళ్లి చేసుకుని కొత్తగా అత్తారింట్లో అడుగుపెట్టిన ఇందుకి.. ఆ ఇంట్లోని మనుషుల వింత ప్రవర్తన తీవ్రమైన అనుమానాలు రేకెత్తిస్తుంది.
గతంలో ఒక పెళ్లి రద్దవ్వడంతో తన పాత జీవితం ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో సతమతమయ్యే ఇందుకి అత్తవారింటి నుంచి వచ్చిన ఒక వింత బహుమతి నిద్ర లేకుండా చేస్తుంది. ఆ కుటుంబ సభ్యుల వెనుక దాగి ఉన్న డార్క్ సీక్రెట్స్‌ను కనుగొనడానికి ఆమె చేసే రిస్కీ రీసెర్చే ఈ వెబ్ సిరీస్ మెయిన్ ప్లాట్.
ఎపిసోడ్ బై ఎపిసోడ్.. ఊహించని ట్విస్ట్‌ల జాతర!
డైరెక్టర్ పోలూరు కృష్ణ ఈ వెబ్ సిరీస్‌ను ప్రతీ ఎపిసోడ్‌లో ఒక సీక్రెట్ రివీల్ అయ్యేలా ఎంతో ఇంట్రెస్టింగ్‌గా డిజైన్ చేశారు. మొత్తంగా 7 ఎపిసోడ్లు ఉన్న ఈ థ్రిల్లర్ రైడ్‌లో ప్రతీ ఎపిసోడ్‌కి ప్రత్యేకమైన టైటిల్, ఐఎండీబీ (IMDb) రేటింగ్ ఉండటం విశేషం.
'వధువు' సిరీస్ ఎపిసోడ్ల కథలివే..
ది లీఫ్ (ఎపిసోడ్ 1 - IMDb: 7.0): ఇందు పెళ్లి ఫిక్స్ అవ్వడం, అత్తారింటి నుంచి వచ్చిన ఒక షాకింగ్ గిఫ్ట్ కుటుంబంలో ఆందోళన కలిగించడంతో కథ మొదలవుతుంది.
ది షాడో (ఎపిసోడ్ 2 - IMDb: 7.6): పెళ్లి పీటల మీద ఉన్న ఇందు తన పాత పెళ్లి రద్దయిన విషయం ఎక్కడ బయటపడుతుందో అని తీవ్రమైన భయానికి గురవుతుంది.
షెర్లాక్ హోమ్స్ (ఎపిసోడ్ 3 - IMDb: 7.0): కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన ఇందు అక్కడ జరుగుతున్న వింత సంఘటనల వెనుక ఉన్న నిజాలను వెతికే పని మొదలు పెడుతుంది.
ది సీక్రెట్ (ఎపిసోడ్ 4 - IMDb: 6.5): ఇందు భర్తకి ఒక అనామక లేఖ రావడం, దానితో పాటు భర్త గురించి ఒక షాకింగ్ సీక్రెట్ తెలుసుకుని ఇందు షాక్ అవ్వడంతో కథ మలుపు తిరుగుతుంది.
ది స్ట్రేంజర్ (ఎపిసోడ్ 5 - IMDb: 7.4): నిజాలు తెలుసుకోవాలని ట్రై చేస్తున్న ఇందుపై అత్త కోపడటం, ఈ టైమ్‌లో ఒక కొత్త అపరిచిత వ్యక్తి ఎంట్రీ ఇవ్వడంతో సస్పెన్స్ పీక్స్‌కి చేరుతుంది.
ది బుక్‌స్టోర్ (ఎపిసోడ్ 6 - IMDb: 6.2): ఒక పాత బుక్‌స్టోర్‌లో ఇందుకి దొరికిన ఆధారాలు పెళ్లి నాటి వింత గిఫ్ట్‌కి ఉన్న లింక్‌ను బయటపెడతాయి.
ది ఇన్వెస్టిగేషన్ (ఎపిసోడ్ 7 - IMDb: 6.9): చివరికి ఆ కుటుంబం దాచిన అసలు నిజం రివీల్ అవ్వడంతో కథ ఊహించని సంచలన ముగింపునకు చేరుకుంటుంది.
నందు, అలీ రెజా పర్ఫార్మెన్స్.. 8 భాషల్లో అందుబాటులో
ఇందు భర్తగా నందు విజయ్ కృష్ణ తన పరిణతి చెందిన నటనతో ఆకట్టుకోగా, అలీ రెజా, సౌజస్ రేణుకుంటల, రూపా లక్ష్మి, అమ్మ రమేష్ తమ సీరియస్ పర్ఫార్మెన్స్‌తో కథకి బాగా ప్లస్ అయ్యారు. ఆకట్టుకునే సినిమాటోగ్రఫీ, సీన్స్ ఎలివేట్ చేసే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులకు భయానకమైన వాతావరణం అందిస్తాయి.
ఇది బెంగాలీ సూపర్ హిట్ వెబ్ సిరీస్ 'ఇందు' కి అఫీషియల్ రీమేక్‌గా వచ్చిన ‘వధువు’.. కేవలం తెలుగులోనే కాకుండా హాట్‌స్టార్‌లో హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, బెంగాలీతో సహా మొత్తం 8 భాషల్లో అందుబాటులో ఉంది. క్లైమాక్స్ కొంతమందికి అయోమయంగా అనిపించినా, పక్కా సస్పెన్స్ థ్రిల్లర్ లవర్స్‌కి ఇది పర్ఫెక్ట్ వీకెండ్ ఛాయిస్.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


