Jo Jo Glimpse: మనోభావాల బ్యాచ్ దూరంగా ఉండండి.. చాలా బోల్డ్‌గా జో జో గ్లింప్స్ వీడియో.. వర్షం పడితే వజ్రాలు.. బూతులు

Jo Jo Glimpse: తెలుగులో మరో బోల్డ్ మూవీ వస్తోంది. జో జో పేరుతో వస్తున్న ఈ సినిమా గ్లింప్స్ వీడియో తాజాగా రిలీజైంది. కిరణ్ జై కుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ జొన్నగిరి అనే ఊళ్లో వర్షాలు పడితే వజ్రాలు దొరుకుతాయన్న కాన్సెప్ట్ తోపాటు బూతు డైలాగులతో షాక్‌కు గురి చేస్తోంది.

Published on: Oct 12, 2026, 22:03:19 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Jo Jo Glimpse: మనోభావాల బ్యాచ్ దూరంగా ఉండండి అనే గమనికతో గ్లింప్స్ వీడియోతోనే సంచలనం రేపుతోంది జో జో మూవీ. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ దేవా కట్టా సమర్పణలో వస్తోన్న సరికొత్త రస్టిక్ రూరల్ కామెడీ డ్రామా 'జో జో' (Jo Jo). తాజాగా ఈ సినిమా నుంచి 'కాషన్ 1' (Caution 1) పేరుతో విడుదలైన టీజర్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

Jo Jo Glimpse: మనోభావాల బ్యాచ్ దూరంగా ఉండండి.. చాలా బోల్డ్‌గా జో జో గ్లింప్స్ వీడియో.. వర్షం పడితే వజ్రాలు.. బూతులు
Jo Jo Glimpse: మనోభావాల బ్యాచ్ దూరంగా ఉండండి.. చాలా బోల్డ్‌గా జో జో గ్లింప్స్ వీడియో.. వర్షం పడితే వజ్రాలు.. బూతులు

జొన్నగిరిలో వర్షం పడితే వజ్రాలు

రాయలసీమలోని ప్రసిద్ధ జొన్నగిరి ప్రాంతంలో వర్షాకాలం తర్వాత వజ్రాలు వెతికే విచిత్రమైన ఆచారం, అక్కడి స్థానిక వాతావరణం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

కిరణ్ జై కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌ను విజయం బ్యానర్‌పై విజయ్ కృష్ణ లింగమనేని నిర్మిస్తున్నారు. ఎలాంటి హంగులకు పోకుండా చాలా సహజమైన సంభాషణలు, ముతక హాస్యంతో కట్ చేసిన ఈ టీజర్ సినిమాపై విపరీతమైన అంచనాలను పెంచేసింది.

వజ్రాల వేటలో ఊహించని ట్విస్టులు.. ఫుల్ రన్ టీజర్

టీజర్ ప్రారంభంలోనే 'మనోభావాల బ్యాచ్ దూరంగా ఉండండి' అనే క్యాప్షన్‌తో రస్టిక్ టోన్‌ను సెట్ చేశారు. వర్షం కురిసిన తర్వాత పొలాల్లో వజ్రాల కోసం వెతుకులాడే యువకుల బృందం చుట్టూ కథ నడుస్తుంది. హీరో హీరోయిన్‌తో పాటు మరికొందరు పొలంలో రాళ్లను వజ్రాలంటూ వెతుకుతుంటారు. అయితే అక్కడ ఒక వ్యక్తి ఆ రాళ్లను పరిశీలిస్తూ అవన్నీ సాధారణ రాళ్లేనని తేల్చి చెబుతాడు.

అయినా సరే ఒక యువకుడు మాత్రం తమ అదృష్టం ఎప్పటికైనా మారుతుందని ధైర్యంగా చెబుతుంటాడు. ఆ సమయంలో హీరో.. హీరోయిన్ దగ్గరికి వెళ్లి రొమాంటిక్ డైలాగ్స్‌తో ఫ్లర్ట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. దానికి ఆమె నోటి వెంట వచ్చే బూతు షాక్ కు గురి చేస్తుంది. నీ గు.. నువ్వు కడుక్కో అనే డైలాగు సీమ యాసలో చెప్పే సీన్ మూవీ ఎలా ఉండనుందో ఓ హింట్ ఇచ్చేసింది. రా రస్టిక్ రొమాంటిక్ అంటూ వీడియో చివర్లో ఈ జో జో ఎండ్ కార్డ్ పడుతుంది. త్వరలోనే రిలీజ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

తరుణ్ భాస్కర్ ప్రశంసలు.. త్వరలోనే థియేటర్లలోకి..

ఈ టీజర్ చూసిన ప్రముఖ టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ టీమ్‌ను అభినందిస్తూ ఇది ఒక "ఎక్సలెంట్ టీజర్" అని కొనియాడారు. ఈ చిత్రంలో కృష్ణ కమల్ 'శీను' పాత్రలో నటిస్తుండగా, మాహి శ్రీ 'సుప్రజ' పాత్రలో కనిపించనున్నారు.

మహేష్ శంకర్ సంగీతం, రోహిత్ కుమార్ సినిమాటోగ్రఫీ ఈ టీజర్‌కు మరింత హైలైట్‌గా నిలిచాయి. వజ్రాలు కోసం జరిగే అన్వేషణ, రూరల్ బ్యాక్‌డ్రాప్, ఊహించని మలుపులతో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ కామెడీ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిన్న వీడియోతోనే రా అండ్ రస్టిక్ ఫీల్ కలిగించిన మేకర్స్.. రానున్న రోజుల్లో ప్రమోషనల్ వీడియోలతో ఇంకా ఏం చేస్తారో చూడాలి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More