I'm Game Trailer: దుల్కర్ సల్మాన్ విశ్వరూపం.. ఎన్టీఆర్ లాంచ్ చేసిన ‘ఐ యామ్ గేమ్’ ట్రైలర్.. క్రికెట్ బెట్టింగ్‌తో రచ్చ
I'm Game Trailer: దుల్కర్ సల్మాన్ విశ్వరూపం చూపించాడు. అతడు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఐ యామ్ గేమ్ మూవీ ట్రైలర్ ను గురువారం (జులై 30) జూనియర్ ఎన్టీఆర్ లాంచ్ చేయడం విశేషం. కాసినో, క్రికెట్ బెట్టింగ్ బ్యాక్‌డ్రాప్ లో సాగిన ఈ ట్రైలర్ హాలీవుడ్ రేంజ్ యాక్షన్ తో అదరగొట్టింది.
I'm Game Trailer: మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఐ యామ్ గేమ్' (I Am Game) ట్రైలర్ మైండ్ బ్లాకింగ్ విజువల్స్‌తో డిజిటల్ స్పేస్‌ను ఊపేస్తోంది. మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) కథానాయకుడిగా నటిస్తున్న ఈ బిగ్ బడ్జెట్ డ్రామా తెలుగు ట్రైలర్‌ను మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ట్రైలర్ చూసిన వెంటనే "ఫైరీ వైబ్ అద్భుతంగా ఉంది బావా" అంటూ ఎన్టీఆర్ కాంప్లిమెంట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

స్టైలిష్ అవతార్‌లో దుల్కర్ సల్మాన్
'ఆర్డీఎక్స్' (RDX) లాంటి ఇండస్ట్రీ హిట్ అందించిన యంగ్ డైరెక్టర్ నహాస్ హిదాయత్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటివరకు చూడని అల్ట్రా స్టైలిష్ యాక్షన్ అవతార్‌లో దుల్కర్ సల్మాన్ గ్యాంబ్లర్‌గా, గ్యాంగ్‌స్టర్ షేడ్స్ ఉన్న పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో దుమ్మురేపారు. సౌత్ ఇండియాలోని 100కి పైగా ప్రసిద్ధ ప్రదేశాలలో భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
మలయాళంలో 'కింగ్ ఆఫ్ కొత్త' తర్వాత దుల్కర్ సల్మాన్ నుంచి వస్తున్న పూర్తి స్థాయి మాస్ యాక్షన్ ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. ఇటీవల తెలుగులో 'లక్కీ భాస్కర్' సినిమాతో భారీ బ్లాక్‌బస్టర్ కొట్టిన దుల్కర్, ఈ 'ఐ యామ్ గేమ్' చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమయ్యారు.
హాలీవుడ్ లెవెల్ యాక్షన్ సీక్వెన్సెస్ - విజువల్స్ పీక్స్
ఈ ట్రైలర్‌లో కనిపించిన కార్ ఛేజింగ్స్, గన్ ఫైట్స్, హై-వోల్టేజ్ ఫైట్ సీన్స్ హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్లను తలపిస్తున్నాయి. పాన్-ఇండియా యాక్షన్ మాస్టర్స్ అన్బరివ్ (Anbariv) కొరియోగ్రఫీ చేసిన స్టంట్ సీన్స్ థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది.
జింషీ ఖాలిద్ అందించిన విజువల్స్, కలర్ గ్రేడింగ్ సినిమా రేంజ్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాయి. దీనికి తోడు సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ రీ-రికార్డింగ్, పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌లోని ప్రతీ ఫ్రేమ్‌ను ఎలివేట్ చేశాయి.
భారీ తారాగణం - ఆకట్టుకుంటున్న నయా కాంబినేషన్
దుల్కర్ సల్మాన్ సొంత బ్యానర్ వేఫేరర్ ఫిల్మ్స్ (Wayfarer Films) నిర్మిస్తున్న ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌లో సెంటిమెంట్, ఎమోషన్, క్రైమ్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇందులో దుల్కర్ సరసన కయాదు లోహర్ హీరోయిన్ గా నటిస్తుండగా, తమిళ స్టార్ డైరెక్టర్-యాక్టర్ మిస్కిన్, ఆంటోనీ వర్గీస్ (పేపే), విలక్షణ నటుడు కథిర్, సంయుక్త విశ్వనాథన్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.
ఓనం కానుకగా ఆగస్టు 20న తెలుగు, మలయాళం, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


