...
...
Next Story

శ్రీలీల గ్లామర్ పని చేసిందా? జూనియర్ మూవీకి మూడు రోజులు ఎన్ని కోట్లు వచ్చాయంటే? లాభాల్లోకి వెళ్లేనా?

గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటీ రెడ్డి హీరోగా లాంఛ్ అయిన మూవీ జూనియర్. జులై 18న ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. హీరోయిన్ గా శ్రీలీల గ్లామర్ తో అదరగొట్టింది. మరి ఈ సినిమా మూడు రోజుల్లో ఎన్ని కోట్లు రాబట్టిందో? ఇక్కడ చూద్దాం.

Published on: Jul 20, 2025, 20:23:05 IST
By ,
Prefer HTon Google
Advertisement

కొత్త హీరో సినిమా జూనియర్ థియేటర్లలో హల్ చల్ చేస్తోంది. జూలై 18న ఈ మూవీ రిలీజైంది. గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటీ హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. టాలీవుడ్ బేబీ డాల్ శ్రీలీల ఇందులో హీరోయిన్ గా నటించింది. 13 ఏళ్ల గ్యాప్ తర్వాత జెనీలియా తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో జూనియర్ మూవీపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. మరి ఆ మూవీ మూడు రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో చూద్దాం.

మిక్స్‌డ్ టాక్

జూనియర్ మూవీ పోస్టర్ (x/Vaaraahi Chalana Chitram)
జూనియర్ మూవీ పోస్టర్ (x/Vaaraahi Chalana Chitram)

జూనియర్ మూవీకి మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ గాలి కిరీటీ రెడ్డి సినిమాకు కలెక్షన్స్ డీసెంట్‌గా వస్తున్నాయని ట్రేండ్ పండితులు అంటున్నారు. ఈ రోజు ఆదివారం (జులై 20) కావడంతోజూనియర్ సినిమాకు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటకలో మంచి బుకింగ్స్ జరిగినట్లు సాక్‌నిల్క్ వెబ్ సైట్ చెబుతోంది. సాయంత్రం 4 గంటల వరకు తెలుగు వెర్షన్‌లో 25.50 శాతం, కన్నడ వెర్షన్‌లో 23.25 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైంది. రెండో రోజు బుకింగ్స్‌తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ.

మూడో రోజు

మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.1.80 కోట్లు, కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో 50 లక్షలు, ఓవర్సీస్‌లో 20 లక్షల రూపాయల చొప్పున జూనియర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.2.50 కోట్ల వసూళ్లు రాబడుతుందని చెబుతున్నారు. మూడు రోజుల్లో కలిపి జూనియర్ కలెక్షన్లు రూ.8 కోట్లకు చేరాయి. అయితే ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే ఇంకా రూ.12 కోట్లు వసూలు చేయాల్సి ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

జూనియర్ చిత్రాన్ని రూ.25 బడ్జెట్‌‌తో నిర్మించారు. ఈ సినిమా ప్రాఫిట్లోకి రావాలంటే రూ.10 కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్, రూ.20 కోట్ల గ్రాస్ వసూళ్లు రావాలని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా జూనియర్ మూవీని 1100 స్క్రీన్లలో గ్రాండ్‌గా విడుదల చేశారు.

ఫస్ట్ మూవీ

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks