ఓటీటీలోకి నిన్న రిలీజైన జూనియర్.. గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడి తొలి సినిమాకు మిక్స్‌డ్ టాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీలోకి జూనియర్ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అయిన తొలి సినిమా జూనియర్ నిన్న థియేటర్లలో విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంటోంది. శ్రీలీల హీరోయిన్‌గా చేసిన జూనియర్ ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

Jul 19, 2025, 20:11:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి ఎలాంటి సమయాల్లో సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలియడం లేదు. ఇటీవల కాలంలో సూపర్, బ్లాక్ బస్టర్ హిట్, ఫ్లాప్, డిజాస్టర్ అంటూ తేడాలు లేకుండా ఇన్ని రోజుల సమయం అనే బేధం లేకుండా సినిమాలు ఓటీటీ రిలీజ్ అవుతున్నాయి.

ఓటీటీలోకి నిన్న రిలీజైన జూనియర్.. గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడి తొలి సినిమాకు మిక్స్‌డ్ టాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి నిన్న రిలీజైన జూనియర్.. గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడి తొలి సినిమాకు మిక్స్‌డ్ టాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

కర్ణాటక మాజీ మంత్రి కుమారుడు

అందుకే కొత్తగా థియేటర్లలో విడుదలైన ప్రతి సినిమా ఓటీటీస్ట్రీమింగ్‌పై ఆసక్తి నెలకొంటుంది. ఈ క్రమంలోనే ఓటీటీ రిలీజ్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న సినిమా జూనియర్. ప్రముఖ వ్యాపారవేత్త, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అయిన తొలి సినిమానే జూనియర్.

వైరల్ వయ్యారి సాంగ్‌తో

జూనియర్ సినిమాలో కిరీటి రెడ్డికి జోడీగా హీరోయిన్ శ్రీలీల చేసింది. అంతేకాకుండా కిరీటి, శ్రీలీల డ్యాన్స్‌తో ఇరగదీసిన వైరల్ వయ్యారి సాంగ్ సూపర్ హిట్ అయింది. దీంతో జూనియర్ మూవీపై అంచనాలు పెరిగాయి. భారీ అంచనాల నేపథ్యంలోనే నిన్న అంటే జులై 18న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది జూనియర్ మూవీ.

రొటీన్ కమర్షియల్ హంగులు

కానీ, జూనియర్ సినిమాకు ఆడియెన్స్ నుంచి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. రొటీన్ టెంప్లేట్‌లో తెరకెక్కిన పక్కా రెగ్యులర్ కమర్షియల్ మూవీ జూనియర్ అని ప్రేక్షకులు భావించారు. కామెడీ, యాక్షన్ సీన్స్, ఎమోషన్స్, సెంటిమెంట్, లవ్ వంటి పక్కా కమర్షియల్ హంగులతో జూనియర్‌ను డైరెక్టర్ రాధా కృష్ణ రెడ్డి తెరకెక్కించారని రివ్యూలు వచ్చాయి.

కిరీటి రెడ్డికి ప్రశంసలు

అయితే, హీరోగా కిరీటి రెడ్డి చాలా ఇంప్రెస్ చేశాడని ప్రశంసలు వచ్చాయి. డ్యాన్స్, యాక్టింగ్, యాక్షన్, ఎమోషనల్ సీన్స్‌లో చాలా వరకు మెప్పించాడని కామెంట్స్ వినిపించాయి. ఈ నేపథ్యంలో జూనియర్ ఓటీటీ స్ట్రీమింగ్పై క్యూరియాసిటీ నెలకొంది. ఓటీటీలోకి జూనియర్ రానుందని టాక్ నడుస్తోంది.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో

జూనియర్ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసిందని సమాచారం. అయితే, అది ఎంత మొత్తం అనే విషయం బయటకు రాలేదు. కానీ, జూనియర్ ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫామ్ మాత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో అని తెలుస్తోంది. థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత జూనియర్ ఓటీటీలోకి వచ్చేయనుంది.

కలెక్షన్స్ పరంగా

అంతేకాకుండా సినిమాకు వచ్చే కలెక్షన్స్, టాక్ పరంగా కూడా జూనియర్ ఓటీటీ రిలీజ్ డేట్‌లో మార్పులు జరిగే అవకాశం ఉంది. ట్రేడ్ అనిలిస్ట్‌ల అంచనా ప్రకారం ఆగస్ట్ నెలలోనే జూనియర్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని సమాచారం.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More