జూనియర్ రివ్యూ.. గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి హీరోగా శ్రీలీల మూవీ ఎలా ఉంది? జెనీలియా రీ ఎంట్రీ ఆకట్టుకుందా?

ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అయిన సినిమా జూనియర్. శ్రీలీల హీరోయిన్‌గా చేసిన ఈ సినిమా వైరల్ వయ్యారి సాంగ్‌తో ఫుల్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. సీనియర్ హీరోయిన్ జెనీలియా లాంగ్ టైమ్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన జూనియర్ రివ్యూ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Jul 18, 2025, 10:03:44 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టైటిల్: జూనియర్

జూనియర్ రివ్యూ.. గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి హీరోగా శ్రీలీల మూవీ ఎలా ఉంది? జెనీలియా రీ ఎంట్రీ ఆకట్టుకుందా?
జూనియర్ రివ్యూ.. గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి హీరోగా శ్రీలీల మూవీ ఎలా ఉంది? జెనీలియా రీ ఎంట్రీ ఆకట్టుకుందా?

నటీనటులు: కిరీటి రెడ్డి, శ్రీలీల, జెనీలియా, రవిచంద్రన్, రావు రమేష్, అచ్యుత్ కుమార్, సత్య, వైవా హర్ష, సుధారాణి తదితరులు

కథ, దర్శకత్వం: రాధా కృష్ణారెడ్డి

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫీ: కేకే సెంథిల్ కుమార్

ఎడిటింగ్: నిరంజన్ దేవరమానే

నిర్మాత: సాయి కొర్రపాటి

విడుదల తేది: జులై 18, 2025

ప్రముఖ రాజకీయ, వ్యాపారవేత్త గాలి జనార్ధన్ కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా అరంగేట్రం చేసిన సినిమా జూనియర్. ఇందులో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల హీరోయిన్‌గా చేయగా సీనియర్ హీరోయిన్ జెనీలియా చాలా కాలం గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చింది. వైరల్ వయ్యారి సాంగ్‌తో శ్రీలీల, కిరీటి ఇద్దరు అట్రాక్ట్ చేసిన ఈ సినిమా ఎలా ఉందో జూనియర్ రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

విజయనగరంలో కోదండపాణి (రవిచంద్రన్), శ్యామలకు 60 ఏళ్ల వయసులో కొడుకు పుడతాడు. దాంతో తండ్రి అతి గారాబంగా కొడుకును పెంచుతాడు. తండ్రి ప్రేమను తట్టుకోలేని అభి (కిరీటి రెడ్డి) దూరంగా వెళ్లి కాలేజ్‌లో జాయిన్ అవుతాడు. మనకంటూ మంచి జ్ఞాపకాలు ఉండాలంటూ స్నేహితులతో సరదాగా గడుపుతుంటాడు.

ఈ క్రమంలో స్ఫూర్తి (శ్రీలీల)తో ప్రేమలో పడిన అభి నాలుగేళ్ల తర్వాత ఆమె పని చేసే కంపెనీలో ఉద్యోగం తెచ్చుకుంటాడు. ఆ కంపెనీ సీఈఓ అయిన విజయ సౌజన్య (జెనీలియా)కు అభి అంటే పడదు.

జూనియర్ ట్విస్టులు

అభి అంటే విజయకు ఎందుకు పడదు? విజయ సౌజన్య ఎవరు? ఆమెకు విజయనగరం అన్న కూడా ఎందుకు నచ్చదు? అలాంటి ఊరికి అభితోనే కలిసి సౌజన్య ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? తండ్రి కోదండపాణి నేపథ్యం ఏంటీ? అసలు స్ఫూర్తి ప్రేమను అభి పొందాడా? అనేది తెలియాలంటే ఈ జూనియర్‌ను చూడాల్సిందే.

విశ్లేషణ:

జూనియర్ సినిమా ఒక పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీ. ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి హీరోను పరిచయం చేసే సినిమాకు ఉండాల్సిన అన్ని కమర్షియల్ హంగులు జూనియర్‌లో ఉన్నాయి. హీరోయిన్ నుంచి టెక్నీషియన్స్ వరకు అంతా టాప్‌లో ఉన్నవారే. అయితే, వారందరికి మ్యాచ్ అయ్యేలా ఆ డెబ్యూ హీరో ఆకట్టుకున్నాడా అనేది ప్రధానంగా వచ్చే ప్రశ్న.

ఆ ప్రశ్నకు చాలా సులువుగా సమాధానం ఇచ్చాడు కిరీటి రెడ్డి. జూనియర్ సినిమా టెంప్లెట్ అంతా రొటీన్ ఫార్మాట్‌లోనే సాగుతుంది. ఫస్టాఫ్ అంతా ఒక డెబ్యూ హీరోతో చేయించాల్సిన కామెడీ, ఫైట్స్, డ్యాన్స్ అన్ని చేయించారు. వాటన్నింటిలో కిరీటి రెడ్డి ఇరగదీశాడు. ఇంటర్వెల్ ట్విస్ట్‌తో సినిమా డ్రామా స్టార్ట్ అవుతుంది. సెకండాఫ్ అంతా ఎమోషనల్‌గానే సాగుతుంది.

కామెడీ-ఎమోషన్

అది బాగానే వర్కౌట్ అయింది. సినిమా కథ రొటీన్‌గా ఉన్న కామెడీ, ఎమోషన్, యాక్షన్, లవ్ ట్రాక్ వర్కౌట్ అవుతునే సక్సెస్ అవుతుంది. దాంట్లో జూనియర్ చాలా వరకు సక్సెస్ అయిందనే చెప్పుకోవచ్చు. ఫస్టాఫ్‌లో కామెడీ, సెకండాఫ్‌లో ఎమోషన్స్ బాగానే పండాయి. ఇక నిర్మాణ విలువలు, దేవి శ్రీ సంగీతం, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ బాగా కుదిరాయి.

వైరల్ వయ్యారి సాంగ్‌లో శ్రీలీలకు తగ్గాఫర్ పోటీ ఇచ్చిన కిరీటి రెడ్డి అన్నింట్లో మెప్పించాడు. తొలి సినిమా అయిన చాలా కాన్ఫిడెంట్ స్క్రీన్ ప్రజెన్స్‌తో ఆకట్టుకున్నాడు. చుట్టూ అంతమంది సీనియర్ యాక్టర్స్ ఉన్నా ఎలాంటి బెరుకులేకుండా అలరించాడు. ఇక శ్రీలీల డ్యాన్స్‌తో ఇరగదీసింది. పాత్రకు పెద్దగా స్కోప్ లేదనిపించింది.

కిరీటి వన్ మ్యాన్ షో

జెనీలియా సీరియస్ టోన్‌లో బాగా చేసింది. హా హా హాసిని అంటూ జోవియల్‌గా గుర్తుండిపోయిన జెనిలీయా సీరియస్ రోల్‌లో కూడా ఆకట్టుకుంది. ఇక మిగతా పాత్రలు సైతం మెప్పించాయి. డైరెక్టర్ రాధా కృష్ణారెడ్డి టేకింగ్ బాగుంది. ఫైనల్‌గా చెప్పాలంటే కిరీటి వన్ మ్యాన్ షోతో నిండిపోయిన జూనియర్.

రేటింగ్: 3/5

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More