Sam Neill: క్యాన్సర్‌తో పోరాడి కన్నుమూసిన జురాసిక్ పార్క్ మూవీ నటుడు.. సుమారు 50 ఏళ్ల కెరీర్

Sam Neill: జురాసిక్ పార్క్ మూవీతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటుడు సామ్ నీల్ కన్నుమూశాడు. ఐదేళ్లుగా క్యాన్సర్ తో పోరాడుతూ 78 ఏళ్ల వయసులో అతడు చనిపోయాడు. ఈ విషయాన్ని అతని కుటుంబం కన్ఫమ్ చేసింది.

Published on: Jul 13, 2026, 12:22:47 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Sam Neill: 'జురాసిక్ పార్క్' సినిమాలో డాక్టర్ అలన్ గ్రాంట్ క్యారెక్టర్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న న్యూజిలాండ్ లెజెండరీ యాక్టర్ సామ్ నీల్ సోమవారం (జులై 13) కన్నుమూశారు. 78 ఏళ్ల వయసున్న ఆయన ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్న తన నివాసంలో చివరి శ్వాస విడిచారు. ఈ విషాద వార్తను సామ్ నీల్ ఫ్యామిలీ మెంబర్స్ ఆయన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా కన్ఫర్మ్ చేశారు.

Sam Neill: క్యాన్సర్‌తో పోరాడి కన్నుమూసిన జురాసిక్ పార్క్ మూవీ నటుడు.. సుమారు 50 ఏళ్ల కెరీర్
Sam Neill: క్యాన్సర్‌తో పోరాడి కన్నుమూసిన జురాసిక్ పార్క్ మూవీ నటుడు.. సుమారు 50 ఏళ్ల కెరీర్

క్యాన్సర్‌పై ఐదేళ్ల సుదీర్ఘ పోరాటం

ఆయన మరణం చాలా అకస్మాత్తుగా జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. సిడ్నీలోని సెయింట్ విన్సెంట్స్ ప్రైవేట్ హాస్పిటల్ స్టాఫ్ ఆయనకు అందించిన సేవలకు థాంక్స్ చెప్పారు. ఈ కష్ట సమయంలో తమ ప్రైవసీని గౌరవించాలని ఫ్యామిలీ కోరింది.

హాలీవుడ్ సీనియర్ నటుడు అయిన సామ్ నీల్ గత ఐదేళ్లుగా నాన్-హాడ్జ్కిన్ లింఫోమా అనే ప్రాణాంతక బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. ఒకానొక దశలో ఆయనకు కీమోథెరపీ కూడా పనిచేయడం మానేసింది. అయితే ఇమ్యూన్ సిస్టమ్‌ను మార్చే ఒక జెనెటిక్ థెరపీ వల్ల ఆయన క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నారు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆస్ట్రేలియా ఛానెల్ సెవెన్ న్యూస్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకొని బాగానే ఉన్నానని సామ్ నీల్ స్వయంగా ప్రకటించారు. వైరస్ సాయంతో టీ-సెల్స్‌ను రీప్రోగ్రామ్ చేసే 'CAR T-సెల్ థెరపీ' వల్ల తన బాడీలో క్యాన్సర్ కణాలు పూర్తిగా నశించాయని, స్కాన్ రిపోర్ట్స్‌లో అంతా నార్మల్‌గా వచ్చిందని చెప్పారు. కానీ ఇంతలోనే ఈ హఠాన్మరణం ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేసింది.

'అలన్ గ్రాంట్' క్యారెక్టర్‌తో గ్లోబల్ స్టార్‌డమ్

1977లో వచ్చిన 'స్లీపింగ్ డాగ్స్' సినిమాతో సామ్ నీల్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఎటాక్ ఫోర్స్ Z (1982), డెడ్ కామ్ (1989), ద పియానో (1993) లాంటి క్లాసిక్ సినిమాల్లో లీడ్ రోల్స్ ప్లే చేశారు. అయితే 1993లో లెజెండరీ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్‌బర్గ్ విజువల్ వండర్ 'జురాసిక్ పార్క్' సినిమాలో డాక్టర్ అలన్ గ్రాంట్ క్యారెక్టర్‌తో ఆయన గ్లోబల్ స్టార్ అయిపోయారు.

డైనోసార్ల ప్రపంచాన్ని స్క్రీన్ మీద చూపిస్తూ స్పీల్‌బర్గ్ క్రియేట్ చేసిన ఆ వండర్‌లో సామ్ నీల్ యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. ఆ తర్వాత జురాసిక్ పార్క్ III (2001), జురాసిక్ వరల్డ్ డొమినియన్ (2022) సినిమాల్లోనూ అదే క్యారెక్టర్‌ను కొనసాగించి మెప్పించారు. ఆయన మరణంతో హాలీవుడ్ ఒక గొప్ప వర్సటైల్ యాక్టర్‌ను కోల్పోయింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More