ఓటీటీలో ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది.. గుండెల్ని పిండేస్తుంది.. అభిషేక్ నటనకు హ్యాట్సాఫ్.. ఐఎండీబీలో 8 రేటింగ్..

ఓటీటీలోకి నేరుగా వచ్చిన ఈ ఎమోషనల్ డ్రామా ఓ మస్ట్ వాచ్. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. అభిషేక్ బచ్చన్ మనసుకు హత్తుకునే నటనతో ఆకట్టుకున్న ఈ మూవీ.. ఐఎండీబీలో 8 రేటింగ్ సాధించింది. ఈనాటి మానవ సంబంధాలను కళ్లకు కట్టినట్లు చూపించింది.

Published on: Jul 17, 2025, 16:12:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి కొన్ని చిన్న సినిమాలు నేరుగా వస్తున్నాయి. కానీ ఇవి మన మనసుపై చెరగని ముద్ర వేస్తున్నాయి. అలాంటి సినిమానే జీ5 ఓటీటీలో వచ్చి కాళీధర్ లాపతా (Kaalidhar Laapata). 2019లో వచ్చిన తమిళ సినిమా కే.డీ సినిమాకు ఇది రీమేక్. రోజురోజుకీ పతనమవుతున్న కుటుంబ బంధాలు, మానవ సంబంధాల చుట్టూ తిరిగే ఈ సినిమా ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురి చేస్తుంది.

ఓటీటీలో ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది.. గుండెల్ని పిండేస్తుంది.. అభిషేక్ నటనకు హ్యాట్సాఫ్.. ఐఎండీబీలో 8 రేటింగ్..
ఓటీటీలో ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది.. గుండెల్ని పిండేస్తుంది.. అభిషేక్ నటనకు హ్యాట్సాఫ్.. ఐఎండీబీలో 8 రేటింగ్..

కాళిధర్ లాపతా మూవీ స్టోరీ ఏంటంటే?

జీ5 ఓటీటీలోకి జులై 4న నేరుగా స్ట్రీమింగ్ కు వచ్చిన సినిమా కాళీధర్ లాపతా. అంటే కాళీధర్ అనే వ్యక్తి కనిపించకుండా పోయాడని అర్థం. ఈ సినిమాలో కాళిధర్ పాత్రలో అభిషేక్ బచ్చన్ నటించాడు. మతిమరుపుతో బాధపడుతున్న 40 ఏళ్ల వ్యక్తి ఈ కాళిధర్. అతని పేరు మీద ఉన్న ఆస్తులను హాస్పిటల్ బెడ్ పై అచేతనంగా ఉన్న సమయంలో వేలి ముద్ర తీసుకొని తమ పేరిట రాయించుకునే సొంత తమ్ముళ్లు.. తర్వాత కాళిధర్ ను వదిలించుకోవాలని చూస్తారు.

దీనికోసం అతన్ని కుంభమేళాకు తీసుకెళ్లి వదిలేస్తారు. వాళ్లను వెతుక్కుంటూ వెళ్లే కాళీధర్ కు అతని మరదలి మాటలు విని మళ్లీ ఇంటికి వెళ్లకూడదనుకుంటాడు. కనిపించిన బస్ ఎక్కేసి వెళ్లిపోతాడు. ఓ ఊరికి వెళ్లిన అతడికి అక్కడ ఓ అనాథ పిల్లాడైన భల్లు కలుస్తాడు. ఒకరి జీవితంలోకి మరొకరు వచ్చిన తర్వాత వీళ్లిద్దరి జీవితాలు ఎలా మారిపోయాయి? ఒకరిని వదిలి మరొకరు ఉండలేని స్థాయికి వీళ్ల స్నేహం ఎలా ఎదిగింది అన్నదే ఈ కాళిధర్ లాపతా మూవీ స్టోరీ.

కాళిధర్ లాపతా మూవీ ఎలా ఉందంటే?

కాళీధర్ లాపతా ఓ గుండెల్ని పిండేసే ఎమోషనల్ స్టోరీ. దానిని తెరపైన కూడా అంతే హృద్యంగా చూపించారు డైరెక్టర్ మధుమిత. ప్రతి హ్యూమన్ ఎమోషన్ ను టచ్ చేస్తూ సాగిపోతుంది. ఇంట్లో వాళ్లే తనను వద్దని వదిలించుకున్న దుస్థితిలో ఓ అనాథ పిల్లాడు.. కాళీధర్ జీవితాన్ని ఎలా మార్చేస్తాడన్నది తెరపై చూపించిన విధానం అద్భుతం.

అందరూ ఉన్నా అనాథలా మిగిలిపోయిన వ్యక్తి, నాలుగు రోజుల వయసులోనే తల్లిదండ్రులు వదిలేయడంతో అనాథగా మారిన పిల్లాడి మధ్య బంధం మన మనసుల్ని తాకుతుంది. యంత్రాల్లాంటి జీవితాలు గడుపుతున్నా ఇప్పటికీ ఎక్కడో మన గుండె లోతుల్లో మిగిలిపోయిన తడిని తట్టి లేపేలా సాగిపోతుందీ సినిమా. 40 ఏళ్ల వయసులో ఇక జీవితమంతా అయిపోయిందనుకున్న పరిస్థితుల్లో ఆ వ్యక్తి తీరని కోరికలేంటో తెలుసుకొని ఆ అనాథ పిల్లాలు తీర్చే సీన్లు మనల్ని కంటతడి పెట్టిస్తాయి.

హ్యాట్సాఫ్ అభిషేక్..

ఈ కాళీధర్ లాపతా మూవీ చూసిన తర్వాత హ్యాట్సాఫ్ అభిషేక్ బచ్చన్ అనకుండా ఉండలేము. తన కెరీర్లోనే బెస్ట్ పాత్రల్లో ఒకటని చెప్పొచ్చు. కాళిధర్ పాత్రలో అతడు జీవించేశాడు. ఈ సినిమాకు అతని నటనే సగం బలం. ఇక భల్లు అనే అనాథ పిల్లాడి పాత్ర పోషించిన దైవిక్ భగేలా నటన మరో లెవెల్. సినిమాలో ఎన్నో పాత్రలు ఉన్నా.. ప్రధానంగా ఈ ఇద్దరి చుట్టే తిరుగుతుంది.

వీళ్లిదరూ కలిసి కనిపించే ప్రతి సీన్ మన మనసును హత్తుకుంటుంది. ఇక సినిమా క్లైమ్యాక్స్ కూడా అంతే. ఎవరూ ఊహించనిదే. ఓ విషాదకర ముగింపు వస్తుందనుకునే వేళ.. డైరెక్టర్ ఇచ్చే ట్విస్ట్ ప్రేక్షకుల పెదాలపై ఓ చిరునవ్వును తీసుకొస్తుంది. జీవిత సారాంశాన్ని గంటా 50 నిమిషాల నిడివిలోనే అందించిన ఈ కాళిధర్ లాపతా సినిమా ఓ మస్ట్ వాచ్. జీ5 ఓటీటీలో ఉన్న ఈ మూవీని వెంటనే చూసేయండి.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More