పిల్లాడితో మతిమరుపు వ్యక్తి ప్రయాణం.. జీ5 ఓటీటీ ట్రెండింగ్ లో హార్ట్ టచింగ్ మూవీ.. 8.2 రేటింగ్.. టాప్-5 సినిమాలు ఇవే
జీ5 ఓటీటీలో హార్ట్ టచింగ్ మూవీ దూసుకెళ్తోంది. కాళీధర్ లాపాట మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ లో సత్తాచాటుతోంది. డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. జీ5లో ప్రస్తుతం టాప్-5లో ఉన్న మూవీస్ పై ఓ లుక్కేయండి.
జీ5 ఓటీటీలో హిందీ సినిమా కాళీధర్ లాపాట ట్రెండింగ్ లో కొనసాగుతోంది. డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజైన ఈ మూవీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. జూలై 4న ఈ ఫిల్మ్ ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. జీ5 స్పెషల్ సినిమాగా రూపొందిన ఈ హిందీ సినిమా ప్రస్తుతం ఈ ఓటీటీలో నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది.

కథ ఏమిటంటే?
మిడిల్ ఏజ్ లో ఉన్న కాళీధర్ కు మతిమరుపు. అతణ్ని కుటుంబ సభ్యులు వదిలేసుకుంటారు. అక్కడి నుంచి ఎనిమిదేళ్ల అనాథతో కలిసి అతను ప్రయాణం సాగిస్తాడు. కాళీధర్ కోరికలు తీర్చేందుకు ఈ జంట ఇండియా మొత్తం చుట్టేస్తుంది. అదే సమయంలో ఆస్తి కోసం కాళీధర్ తో సంతకాలు పెట్టించుకోవాలని కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తుంటారు. కాళీధర్ జర్నీ హార్ట్ టచింగ్ గా ఉంటుంది. ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ తో ఈ మూవీ సాగుతుంది. ఐఎండీబీలో ఈ మూవీకి 8.2 రేటింగ్ ఉంది.
ఫస్ట్ హిందీ మూవీ
కాళీధర్ లాపాటలో కాళీధర్ గా అభిషేక్ బచ్చన్ తన యాక్టింగ్ తో ఇరగదీశాడు. పిల్లాడిగా దైవిక్ భాగేలా కూడా అదరగొట్టాడు. ఈ సినిమాకు మధుమిత డైరెక్టర్. హిందీలో ఆమెకు ఇదే ఫస్ట్ సినిమా. 2019లో తమిళంలో తీసిన కేడీ సినిమాకు ఇది హిందీ రీమేక్. కేడీ మూవీకి మధుమితనే డైరెక్టర్. ఈ మూవీ ఇప్పుడు జీ5లో నంబర్ వన్ ట్రెండింగ్ లో ఉంది.
డిటెక్టివ్ స్టోరీ
జీ5లో ట్రెండింగ్ నంబర్ టూగా డిటెక్టివ్ షెర్దిల్ కొనసాగుతోంది. ఇది జీ5 ఒరిజినల్ హిందీ మిస్టరీ కామెడీ సినిమా. దిల్జిత్ దోసాంజ్ టైటిల్ రోల్ ప్లే చేశాడు. బుడాపెస్ట్ లో భారత సంతతికి చెందిన బిజినెస్ మ్యాన్ పంకజ్ భట్టి హత్యకు గురవుతాడు. ఈ కేసును సాల్వ్ చేయడానికి హీరో రంగంలోకి దిగుతాడు. ఈ మూవీకి రవి ఛబ్రియా డైరెక్టర్. జూన్ 20న ఈ మూవీ ఓటీటీలోకి వచ్చింది.
లిస్ట్ లో ఈ సినిమాలు
మలయాళ కామెడీ డ్రామా ఫిల్మ్ కూడా జీ5 ఓటీటీలో సత్తాచాటుతోంది. ట్రెండింగ్ లో మూడో స్థానంలో ఉంది. ఓ ఇంట్రోవర్ట్ అబ్బాయికి, ఎక్స్ ట్రోవర్ట్ అమ్మాయికి పెళ్లి జరిగితే ఎలా ఉంటుందన్నదే కథ. భార్యకు, కుటుంబానికి మధ్యలో హీరో నలిగిపోతాడు. మరాఠి సినిమా ఆట తంబీచ నాయి ట్రెండింగ్ నంబర్ ఫోర్ గా ఉంది. మున్సిపల్ కార్మికుల నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.
తమిళ్ హారర్ సినిమా డెవిల్స్ డబుల్ నెక్ట్స్ లెవల్ జీ5 ట్రెండింగ్ లో అయిదో ప్లేస్ లో ఉంది. సంతానం లీడ్ రోల్ ప్లే చేసిన ఈ మూవీలో హీరో ఓ దెయ్యాల చేతుల్లో ఇరుక్కుంటాడు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper



