ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన తెలుగు సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. 8.2 ఐఎమ్‌డీబీ రేటింగ్.. ఇక్కడ చూసేయండి!

ఓటీటీలోకి ఇవాళ తెలుగు, తమిళ బైలింగువల్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ కలియుగం 2064 డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. జెర్సీ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ మెయిన్ లీడ్ రోల్ చేసిన ఈ సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి 8.2 రేటింగ్ వచ్చింది. మరి కలియుగం 2064 ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ చూద్దాం.

Published on: Jun 20, 2025, 12:25:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీలోకి ఇవాళ ఎన్నో డిఫరెంట్ కంటెంట్ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అయితే, తెలుగు, తమిళం భాషల్లో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమాలు రావడం చాలా అరుదు. కానీ, 2025లో రీసెంట్‌గా ఓ బైలింగువల్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కింది. అదే కలియుగం 2064.

ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన తెలుగు సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. 8.2 ఐఎమ్‌డీబీ రేటింగ్.. ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన తెలుగు సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. 8.2 ఐఎమ్‌డీబీ రేటింగ్.. ఇక్కడ చూసేయండి!

ఆహారం, నీళ్ల కోసం

మూడో ప్రపంచ యుద్దం తర్వాత ఆహారం, నీళ్ల కోసం ప్రజలు కొట్టుకుంటారు. వీరిని కంట్రోల్ చేయడానికి ఒక గ్రూప్ ఉంటుంది. మనుషులను చంపి వారి వద్ద నుంచి ఆహారం లాక్కునే మరో గ్రూప్ కూడా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఒకచోట సేఫ్ హౌజ్ ఉందని తెలుస్తుంది. ఆ సేఫ్ హౌజ్‌ గురించి తెలిసిన శక్తి అక్కడే నివసిస్తుంటాడు.

సేఫ్ హౌజ్‌లోకి భూమి

అయితే, ఓ రోజు ఆ సేఫ్ హౌజ్‌లోకి భూమి అనే అమ్మాయి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? శక్తి, భూమి మధ్య నెలకొన్న పరిస్థితులు ఏంటీ? చివరికి ఏమైంది? అనే అంశాలతో కలియుగం 2064 సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు డెబ్యూ డైరెక్టర్ ప్రమోద్ సుందర్ కథ, దర్శకత్వం వహించారు.

శ్రద్ధా శ్రీనాథ్ సినిమాలు

తెలుగు, తమిళం రెండు భాషల్లో ఒకే కాలంలో తెరకెక్కిన కలియుగం 2064 సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, కిశోర్ ప్రధాన పాత్రలు పోషించగా.. ఇనియన్ సుబ్రమణి, ఆర్య లక్ష్మీ ఇతర కీలక రోల్స్‌లో నటించారు. శ్రద్ధా శ్రీనాథ్ ఇదివరకు తెలుగులో జెర్సీ, డాకు మహరాజ్, మెకానిక్ రాకీ వంటి పలు సినిమాల్లో అలరించింది.

కలియుగం రేటింగ్

ఈ ఏడాది మే 9న థియేటర్లలో విడుదలైన కలియుగం 2064 మూవీ పర్వాలేదనిపించుకుంది. అయితే, ఐఎమ్డీబీ సంస్థ నుంచి పదికి ఏకంగా 8.2 రేటింగ్‌ను సొంతం చేసుకుంది కలియుగం 2064. కాస్తా సైకలాజికల్ ఎలిమెంట్స్ ఉన్న కలియుగం 2064 ఓటీటీలోకి ఇవాళ (జూన్ 20) వచ్చేసింది.

కలియుగం ఓటీటీ

సింప్లీ సౌత్ ఓటీటీలో కలియుగం 2064 డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. తెలుగు, తమిళ భాషల్లో సింప్లీ సౌత్‌లో నేటి నుంచి కలియుగం 2064 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. మరి థియేటర్లలో మిస్ అయిన ఈ సినిమాను ఓటీటీలో ఎంచక్కా చూసేయండి.

జిన్ ది పెట్ ఓటీటీ

దీంతోపాటు ఇవాళ ఓటీటీలోకి తమిళ హారర్ థ్రిల్లర్ మూవీ జిన్ ది పెట్ కూడా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఈ సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి 8 రేటింగ్ ఉంది. అయితే, సన్ నెక్ట్స్‌లో జిన్ ది పెట్ ఓటీటీ రిలీజ్ అయింది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More