Kangana Ranaut Net Worth: కంగనా రనౌత్ బర్త్ డే-ఆమె నెట్ వర్త్ తెలిస్తే షాక్ అవాల్సిందే-ఇంట్లో వజ్రాలు-8 క్రిమినల్ కేసులు
Kangana Ranaut Net Worth: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ బర్త్ డే ఈ రోజు. ఈ సందర్భంగా ఆమె నెట్ వర్త్, ఆస్తులు, క్రిమినల్ కేసులపై ఓ లుక్కేయండి.
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, మండి ఎంపీ కంగనా రనౌత్ బర్త్ డే ఈ రోజు (మార్చి 23, 2026). తన 40వ పుట్టినరోజును జరుపుకొంటున్న ఈ స్టార్ హీరోయిన్ నెట్ వర్త్ పై ఓ లుక్కేయండి. హీరోయిన్ నుంచి ఎంపీగా ఎదిగిన కంగనా.. నటిగా, నిర్మాతగా, రాజకీయ నాయకురాలిగా ఎంత సంపాదించారో ఇక్కడ చూద్దాం.

కంగనా రనౌత్ నెట్ వర్త్
ఎన్నికల అఫిడవిట్ ప్రకారం, కంగనా రనౌత్ వద్ద రూ.91 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి. అయితే ఆమెకు రూ.17 కోట్లకు పైగా అప్పులు కూడా ఉండటం గమనార్హం. అంటే ఆమె నెట్ వర్త్ సుమారుగా రూ.74 కోట్లుగా ఉంది. 12వ తరగతి వరకు చదివిన కంగనా, ఇండస్ట్రీలో తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది.
కోట్ల విలువైన కార్లు, నగలు
కంగనా వద్ద BMW 7 సిరీస్, మెర్సిడెస్-మేబాచ్ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి, వీటి విలువ రూ.5.48 కోట్లు. ఆమె వద్ద సుమారు 6.7 కిలోల బంగారం, 60 కిలోల వెండి, రూ.3 కోట్ల విలువైన వజ్రాలు ఉన్నాయి. కేవలం ఆమె ఆభరణాల విలువే రూ.8.5 కోట్లుగా ఉండటం విశేషం.
స్థిరాస్తులు, పెట్టుబడులు
ముంబైలోని బాంద్రాలో రూ.23 కోట్ల విలువైన రో హౌస్, మనాలిలో రూ.15 కోట్ల నివాసం ఆమె స్థిరాస్తుల్లో ముఖ్యమైనవి. వీటితో పాటు చండీగఢ్‌లో నాలుగు వాణిజ్య యూనిట్లు కూడా ఉన్నాయి. ఆమె మొత్తం స్థిరాస్తుల విలువ సుమారు రూ.62.92 కోట్లుగా ప్రకటించారు.
పెండింగ్ క్రిమినల్ కేసులు
కంగనా రనౌత్ పేరు మీద సుమారు ఎనిమిది పెండింగ్ క్రిమినల్ కేసులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. వీటిలో మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం, పరువు నష్టం, దేశద్రోహం వంటి ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు ఆమెపై ఎటువంటి శిక్షలు నమోదు కాలేదని సమాచారం.
కంగనా రనౌత్ సినిమాలు
ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్ ఎప్పుడూ వివాదాలతో సావాసం చేస్తూనే ఉంటారు. ఆమె గ్యాంగ్ స్టర్ అనే సినిమాతో డెబ్యూ చేసింది. 2006లో వచ్చిన ఈ సినిమాకు గాను కంగనా బెస్ట్ డెబ్యూ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా అందుకుంది.
కంగనా రనౌత్ తెలుగులోనూ సినిమాలు చేసింది. ప్రభాస్ హీరోగా వచ్చిన ఏక్ నిరంజన్ మూవీలో కంగనా హీరోయిన్ గా నటించింది. తమిళంలో ధామ్ ధూమ్ అనే సినిమా చేసింది. ఇది తెలుగులో కూడా రీమేక్ అయింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


