Gen Z: వాళ్లు జెన్ జీ కాదు.. జంతర్ మంతర్ నిరసనకారులందరూ ఆమె టైపే: కంగనా రనౌత్ సంచలన కామెంట్స్
Gen Z: కంగనా రనౌత్ మరోసారి సంచనల కామెంట్స్ చేశారు. జంతర్ మంతర్ దగ్గర నిరసన చేసింది జెన్ జీ కాదని, అందులో చాలా వరకు బాలీవుడ్ సీనియర్ నటి షబానా అజ్మీ టైప్ వాళ్లే అని ఆమె అనడం గమనార్హం.
Gen Z: బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మరోసారి సంచలన వ్యాఖ్యలతో జాతీయ రాజకీయాల్లో రచ్చ లేపారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన జెన్ జీ (Gen Z) నిరసనలపై ఆమె చేసిన 'జనరేషన్ గట్టర్' కామెంట్స్ తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై స్పందించిన కంగనా.. అక్కడ నిరసన తెలిపింది అసలైన జెన్ జీ యూత్ కాదని, 'షబానా అజ్మీ టైప్ జనాలు' అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

జంతర్ మంతర్‌లో జరిగింది జెన్ జీ ప్రొటెస్ట్ కాదా?
ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక స్పెషల్ వీడియో షేర్ చేసిన కంగనా రనౌత్.. తన వ్యాఖ్యలను గట్టిగా సమర్థించుకున్నారు. "మన దేశంలో దాదాపు 30 నుంచి 35 కోట్ల మంది జెన్ జీ జనాభా ఉన్నారు. కానీ జంతర్ మంతర్ దగ్గర కేవలం 10 వేల మంది మాత్రమే పోగయ్యారు. అందులో సగానికి పైగా షబానా అజ్మీ టైప్ వయస్సు ఉన్నవాళ్లే కనిపించారు" అని కంగనా వ్యంగ్యంగా మాట్లాడారు.
అక్కడ ఉన్న 10 వేల మందిలో కేవలం 2000 మంది మాత్రమే నిజమైన జెన్ జీ యూత్ అని, అలాంటప్పుడు దానిని దేశవ్యాప్త జెన్ జీ నిరసన అని ఎలా పిలుస్తారని ఆమె ప్రశ్నించారు. "నేను యూత్ కి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఎందుకంటే నేను కూడా యువతలోనే భాగమే. నా మాటలను తప్పుడు ఏజెండాతో తిరస్కరిస్తున్నారు" అని కంగనా ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.
షబానా అజ్మీ ప్రొటెస్ట్ – అసలు వివాదం ఏంటి?
గత నెల 20న పార్లమెంట్ వైపు సాగిన నీట్-యుజి (NEET-UG) పేపర్ లీక్ నిరసన ర్యాలీలో బాలీవుడ్ దిగ్గజ నటి, 75 ఏళ్ల షబానా అజ్మీ పాల్గొన్నారు. జంతర్ మంతర్ వద్ద జరిగిన ఈ మార్చ్ లో ఆమె ఒక ట్రక్కుపై ప్రయాణిస్తూ, బారికేడ్లు దాటుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆమెతో పాటు వర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ కూడా ఈ ప్రొటెస్ట్ లో పాల్గొన్నారు.
ఈ నిరసనల టైమ్‌లో కొంతమంది ప్రవర్తనను ఉద్దేశించి కంగనా 'జనరేషన్ గట్టర్' అని సంబోధించారు. "చదువు సంధ్య లేకుండా, క్రమశిక్షణ లేకుండా ప్రవర్తించే కొద్దిమందిని మాత్రమే నేను అలా అన్నాను. తమను తాము కాక్రోచ్ అని పిలుచుకునే వాళ్లు డ్రైనేజీలోనే ఉంటారు తప్ప వేరే ఎక్కడ ఉంటారు?" అంటూ ఏఎన్ఐ (ANI) ఇంటర్వ్యూలో తన కామెంట్స్ ను డిఫెండ్ చేసుకున్నారు.
కంగనా సినిమా, పొలిటికల్ కెరీర్ ఇలా..
హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా గెలిచినప్పటి నుంచి కంగనా రనౌత్ చేసే ప్రతి వ్యాఖ్య జాతీయ స్థాయిలో హాట్ టాపిక్‌గా మారుతోంది. ఒకవైపు రాజకీయంలో యాక్టివ్‌గా ఉంటూనే, మరోవైపు సినిమాల్లోనూ బిజీగా ఉన్నారు. అయితే తన సినిమాల కంటే తరచూ ఇలాంటి వివాదాస్పద కామెంట్స్ తోనే ఆమె వార్తల్లో నిలుస్తున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


