గాంధీ జయంతి నాడు కోడి కూర తినాలనిపిస్తే.. ఓటీటీలోకి వచ్చేసిన కన్నడ కామెడీ డ్రామా.. ఐఎండీబీలో 8.5 రేటింగ్
ఓటీటీలోకి తాజాగా ఓ కన్నడ కామెడీ డ్రామా స్ట్రీమింగ్ కు వచ్చింది. గాంధీ జయంతి నాడు కోడి కూర కోసం తిరిగే ఓ 11 ఏళ్ల అమ్మాయి చుట్టూ తిరిగే కథతో నవ్వించే సినిమా ఇది. ఐఎండీబీలో 8.5 రేటింగ్ సొంతం చేసుకుంది.
కన్నడ కామెడీ డ్రామా నాలె రజా కోలి మజా (Naale Rajaa Koli Majaa) నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చింది. డైరెక్టర్ అభిలాష్ శెట్టి కోలి ట్రైలజీలో భాగంగా రూపొందించిన రెండో సినిమా ఇది. గత నెల 9న థియేటర్లలో రిలీజై పాజిటివ్ రివ్యూలు సొంతం చేసుకుంది. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చింది.

నాలె రజా కోలి మజా ఓటీటీ స్ట్రీమింగ్
కన్నడ కామెడీ డ్రామా నాలె రజా కోలి మజా మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి శుక్రవారం (జూన్ 13) అడుగుపెట్టింది. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా ఇది. మే 9న థియేటర్లలో రిలీజై మంచి రెస్పాన్స్ సంపాదించింది.
కన్నడలో కోలి అంటే కోడి అని అర్థం. కోడి ఫ్రాంఛైజీలో మొత్తం మూడు సినిమాలు తీయాలని డైరెక్టర్ అభిలాష్ శెట్టి నిర్ణయించాడు. తొలి సినిమా కోలి తాలి ఇప్పటికే రాగా.. ఇప్పుడు నాలె రజా కోలి మజా రెండో మూవీగా వచ్చింది.
నాలె రజా కోలి మజా స్టోరీ ఏంటంటే?
కన్నడ కామెడీ డ్రామా నాలె రజా కోలి మజా మూవీ స్టోరీ చాలా భిన్నంగా ఉంటుంది. గాంధీ జయంతి రోజు కోడి కూర తినాలనుకునే 11 ఏళ్ల అమ్మాయి చుట్టూ తిరిగే కథ ఇది. ఆమె ఇంట్లో ప్రతి ఆదివారం నాన్ వెజ్ కచ్చితంగా వండుతారు. అలా ఆ ఆదివారం కూడా కోడి కూర ఉంటుందని ఆమె ఎంతగానో ఆశిస్తుంది.
కానీ ఆ రోజు గాంధీ జయంతి రావడంతో చికెన్, మటన్ షాపులు అన్నీ మూతపడతాయి. కానీ ఆమె మాత్రం చికెన్ కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఊరంతా తిరుగుతుంది. చివరికి తన అమ్మమ్మ వాళ్ల ఇంటికి కూడా వెళ్తుంది. చివరికి కోడి కూర తినాలన్న ఆమె కోరిక నెరవేరుతుందా లేదా అన్నది ఈ సినిమాలో చూడొచ్చు.
నాలె రజా కోలి మజా మూవీకి థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం పెద్దగా వసూళ్లు సాధించలేకపోయింది. అయితే ఐఎండీబీలో మాత్రం 8.5 రేటింగ్ సాధించింది. ఇప్పుడీ మూవీ ప్రైమ్ వీడియోలోకి అందుబాటులోకి వచ్చింది. కన్నడ ఆడియో, ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో ఈ మూవీని చూడొచ్చు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper



