ఇల్లు అనేది ఒక గౌరవం.. నా రియల్ లైఫ్‌కు చాలా కనెక్ట్ అయ్యా.. కన్నప్ప నటుడు శరత్ కుమార్ కామెంట్స్

మంచు విష్ణు కన్నప్ప సినిమాలో నటించి మెప్పించిన నటుడు శరత్ కుమార్ కీలక పాత్రలతో అలరిస్తున్నారు. తాజాగా శరత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ 3 బీహెచ్‌కే. సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కిన 3 బీహెచ్‌కే మూవీ ట్రైలర్ రీసెంట్‌గా రిలీజ్ అయింది. 3 బీహెచ్‌కే ట్రైలర్ లాంచ్‌లో నటుడు శరత్ కుమార్ కామెంట్స్ చేశారు.

Published on: Jun 28, 2025, 13:20:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కీలక పాత్రలతో అలరిస్తున్నారు నటుడు ఆర్ శరత్ కుమార్. హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ తండ్రి అయిన శరత్ కుమార్ మంచు విష్ణు కన్నప్ప మూవీలో నటించి మెప్పించారు. ఇప్పుడు మరో సరికొత్త సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఆ సినిమానే 3 బీహెచ్‌కే.

ఇల్లు అనేది ఒక గౌరవం.. నా రియల్ లైఫ్‌కు చాలా కనెక్ట్ అయ్యా.. కన్నప్ప నటుడు శరత్ కుమార్ కామెంట్స్
ఇల్లు అనేది ఒక గౌరవం.. నా రియల్ లైఫ్‌కు చాలా కనెక్ట్ అయ్యా.. కన్నప్ప నటుడు శరత్ కుమార్ కామెంట్స్

శరత్ కుమార్‌తోపాటు

బొమ్మరిల్లు సిద్ధార్థ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీనే 3 బీహెచ్‌కే. ఈ సినిమాలో శరత్ కుమార్‌తోపాటు దేవయాని, మీతా రఘునాథ్, చైత్ర కీలక పాత్రలు పోషించారు. శాంతి టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ నిర్మించిన 3 బీహెచ్‌కే థియేట్రికల్ ట్రైలర్‌ను జూన్ 27న విడుదల చేశారు.

3 బీహెచ్‌కే ట్రైలర్ లాంచ్

శ్రీ గణేష్ దర్శకత్వం వహించిన 3 బీహెచ్‌కే మూవీ ట్రైలర్ లాంచ్‌ ఈవెంట్‌లో కన్నప్ప నటుడు ఆర్ శరత్ కుమార్ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పుకొచ్చారు. ఇల్లు అనేది ఒక గౌరవం లాంటిదని మాట్లాడారు.

అందరితో కలిసి

యాక్టర్ శరత్ కుమార్ మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. డైరెక్టర్ శ్రీ గణేష్, ప్రొడ్యూసర్ విశ్వ గారికి థాంక్యూ. ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న శశి గారికి థాంక్యూ. సిద్దు, దేవయాని, చైత్ర, మీతా అందరితో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది" అని అన్నారు.

మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి

"ఇది నా రియల్ లైఫ్‌కి చాలా కనెక్ట్ అయ్యే సినిమా. మనందరం కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాము. ఇల్లు అనేది అందరి కల. ఈ సినిమాతో చాలా రిలేట్ అవుతున్నాను. ఇల్లు కట్టాలని అందరికీ యాంబిషన్ ఉంటుంది. ఇల్లు అనేది ఒక గౌరవం" అని కన్నప్ప యాక్టర్ శరత్ కుమార్ అభిప్రాయపడ్డారు.

ఒకే దగ్గర కూర్చుని

"ఈ సినిమాని ఒక ఫ్యామిలీ లానే వర్క్ చేసాం. చాలా మంచి వర్క్ చేసాం. అది ఎలా ఉందో మీరే చెప్పాలి. ఫ్యామిలీ అంతా ఒకే దగ్గర కూర్చుని చూడదగ్గ సినిమా ఇది. ఈ సినిమాలో యాక్టర్లు కాదు క్యారెక్టర్లే కనిపిస్తాయి. తప్పకుండా ఈ సినిమా చూసి మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను" అని తన స్పీచ్ ముగించారు శరత్ కుమార్.

చాలా మంచి సందేశం

దేవయాని మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. ఇది చాలా అద్భుతమైన కథ. చాలా మంచి సందేశం ఉంది. ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్‌కి థాంక్యూ" అని చెప్పారు.

మా గృహ ప్రవేశానికి రావాలి

"తెలుగు ఆడియన్స్ మంచి కథల్ని ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు. ఇది చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. తప్పకుండా ఈ సినిమాని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఒక ఫ్యామిలీగా మీ అందరిని ఈ సినిమాకి ఇన్వైట్ చేస్తున్నాం. మా గృహ ప్రవేశానికి మీరందరూ రావాలి (నవ్వుతూ). అందరికీ థాంక్యు" నటి దేవయాని తెలిపారు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More