అసలు నాకు కన్నప్ప గురించి ఏమీ తెలియదు.. ఆఫర్ అలా వచ్చింది: కన్నప్ప డైరెక్టర్ కామెంట్స్

కన్నప్ప మూవీ డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అసలు తనకు కన్నప్ప గురించి ఏమీ తెలిసేది కాదని, చాలా రీసెర్చ్ చేసిన తర్వాతే ఈ సినిమాను డైరెక్ట్ చేసినట్లు చెప్పాడు. ఈ నెల 27న మూవీ థియేటర్లలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.

Published on: Jun 24, 2025, 20:37:48 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మంచు విష్ణు లీడ్ రోల్లో నటిస్తూ నిర్మిస్తున్న మూవీ కన్నప్ప. ఈ సినిమా ఈ శుక్రవారం (జూన్ 27) థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో టీమ్ ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఇందులో భాగంగా డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అసలు తనకు కన్నప్ప గురించి మొదట ఏమీ తెలియదని చెప్పడం గమనార్హం.

అసలు నాకు కన్నప్ప గురించి ఏమీ తెలియదు.. ఆఫర్ అలా వచ్చింది: కన్నప్ప డైరెక్టర్ కామెంట్స్
అసలు నాకు కన్నప్ప గురించి ఏమీ తెలియదు.. ఆఫర్ అలా వచ్చింది: కన్నప్ప డైరెక్టర్ కామెంట్స్

కన్నప్ప గురించి ఏమీ తెలియదు

కన్నప్ప మూవీకి డైరెక్టర్ గా ఉన్నా కూడా ఇంతకుముందు తనకు ఆ శివుడి భక్తుడి గురించి ఏమీ తెలియదని డైరెక్టర్ ముకేశ్ చెప్పాడు. “లేదు, నాకు కన్నప్ప గురించి అస్సలు తెలియదు. నేను ఆంధ్రలో ఒక ఆధ్యాత్మిక ప్రయాణం చేసి చాలా సమాచారం సేకరించి విష్ణు వద్దకు తిరిగి వచ్చాను. అతను చాలా ఆకట్టుకున్నాడు. అలా ఈ ప్రాజెక్ట్ ఖరారైంది. నేను దర్శకుడిగా కన్ఫమ్ అయ్యాను” అని ముకేశ్ చెప్పాడు.

కన్నప్ప రీసెర్చ్ ఇలా..

ఇక తాను కన్నప్ప గురించి తెలుసుకోవడానికి చాలానే రీసెర్చ్ చేసినట్లు కూడా ఈ సందర్భంగా ముకేశ్ చెప్పాడు. “నేను తిరుపతి, శ్రీకాళహస్తిలోని చాలా దేవాలయాలను పదే పదే సందర్శించాను. చాలా మంది పూజారులతో మాట్లాడి కన్నప్ప ఎవరు, అతని చరిత్ర ఏమిటో అర్థం చేసుకున్నాను. విష్ణు కథ రాశాడు. అతనికి అప్పటికే చాలా సమాచారం ఉంది, అది సినిమాను డైరెక్ట్ చేయడానికి నాకు సహాయపడింది” అని ముకేశ్ తెలిపాడు.

ముకేశ్ కుమార్ సింగ్ గతంలో మహాభారత్ సిరీస్ ను డైరెక్ట్ చేశాడు. అది చూసే మంచు విష్ణు, మోహన్ బాబు అతనికి ఈ మూవీ డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చినట్లు ముకేశ్ చెప్పాడు.

పెద్ద స్టార్లతో పని చేయడంపై..

కన్నప్ప మూవీలో మంచు విష్ణుతోపాటు ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబులాంటి వాళ్లు ఎంతో మంది స్టార్లు నటించారు. అలాంటి వాళ్లను డైరెక్ట్ చేయడంపైనా ముకేశ్ స్పందించాడు. నిజానికి పెద్ద స్టార్స్ ను డైరెక్ట్ చేయడం సులభం అని అతడు అనడం విశేషం.

“వారు పూర్తిగా ప్రొఫెషనల్‌గా ఉన్నారు. స్పష్టమైన ఆలోచనతో వచ్చారు. అవసరమైనది చేశారు. ఈ పెద్ద స్టార్స్‌ను హ్యాండిల్ చేయడం టీవీ స్టార్స్‌ను హ్యాండిల్ చేయడం కంటే సులభం అని చెప్పగలను. మోహన్ బాబు నాకు పూర్తి సపోర్ట్ ఇచ్చారు. ప్రభాస్ చాలా మంచి వ్యక్తి.

ఈ పెద్ద స్టార్లు భారీ ప్రభావాన్ని సృష్టిస్తారు. వారి అతిథి పాత్రలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటాయి” అని ముకేశ్ చెప్పాడు. కన్నప్ప మూవీ శుక్రవారం (జూన్ 27) ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ఎంత మేర ఆకట్టుకుంటుందో చూడాలి.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More