...
...
Next Story

కన్నప్ప ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే.. హీరో మంచు విష్ణు ఇంట్రెస్టింగ్ కామెంట్లు.. డిజిటల్ స్ట్రీమింగ్ పై బజ్

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా వచ్చిన కన్నప్ప మూవీ ఈ రోజే థియేటర్లలో రిలీజైంది. పాజిటివ్ టాక్ తో ఈ మూవీ దూసుకెళ్తోంది. ముఖ్యంగా క్లైమాక్స్ అదిరిపోయిందనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కన్నప్ప ఓటీటీ రిలీజ్ పై బజ్ నెలకొంది.

Published on: Jun 27, 2025, 10:47:56 IST
By ,
Prefer HTon Google
Advertisement

ఓ వైపు వివాదాలు.. మరోవైపు ట్రోల్స్.. ఇలాంటి పరిస్థితుల్లో భారీ అంచనాల నడుమ థియేటర్లకు వచ్చింది కన్నప్ప మూవీ. ఈ రోజు (జూన్ 27) థియేటర్లలో రిలీజైంది ఈ సినిమా. సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా క్లైమాక్స్ అదిరిపోయిందనే కామెంట్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కన్నప్ప మూవీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడా? అనే ప్రశ్న రేకెత్తుతోంది.

ఓటీటీలోకి ఎప్పుడంటే?

కన్నప్ప పోస్టర్ (x/kannappamovie)
కన్నప్ప పోస్టర్ (x/kannappamovie)

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప మూవీ ఓటీటీ రిలీజ్ పై బజ్ నెలకొంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ ను ఇంకా అమ్మలేదు. కన్నప్ప డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థలు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో కన్నప్ప రైట్స్ కోసం పోటీపడుతున్నాయని టాక్. దీంతో రైట్స్ కోసం భారీ డిమాండ్ నెలకొంది.

10 వారాల తర్వాతే

కన్నప్ప మూవీ ఓటీటీ రిలీజ్ పైనా బజ్ నెలకొంది. సాధారణంగా అయితే తెలుగు సినిమాలు థియేటర్లలో రిలీజైన మూడు లేదా నాలుగు వారాలకు ఓటీటీలోకి వస్తున్నాయి. కానీ కన్నప్ప మూవీని మాత్రం 10 వారాల కంటే ముందు ఓటీటీలో రిలీజ్ చేసే ఉద్దేశ్యమే లేదని మంచు విష్ణు తేల్చిచెప్పడం గమనార్హం.

‘‘నాకు చాలా స్వేచ్ఛ ఉంది. నా సినిమా 10 వారాల కంటే ముందు ఓటీటీలోకి రాదు. నేను అనుకున్న డీల్ అదే. దేవుని దయ వల్ల నాకు ఎలాంటి రిలీజ్ ప్రెషర్ లేదు. ఆడియన్స్ కు బెస్ట్ చూపించాలన్నదే నా ఉద్దేశ్యం’’ అని మంచు విష్ణు ఇటీవల అన్నారు.

ఎన్ని కోట్లో?

కన్నప్ప సినిమాకు ముకేష్ కుమార్ సింగ్ డైరెక్టర్. శివ భక్తుడు కన్నప్ప కథ ఆధారంగా ఈ సినిమా తీశారు. ఏవీఏ ఎంటర్ టైన్ మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీపై మోహన్ బాబు ఈ మూవీ నిర్మించారు. రూ.200 కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe