వాయు లింగం కోసం పోరాటం.. రుద్రగా ప్రభాస్.. తిన్నడిగా విష్ణు.. అదిరిపోయిన కన్నప్ప ట్రైలర్.. ఎలా ఉందంటే?
ఫ్యాన్స్ ను ఎంగేజ్ చేసేలా.. మూవీపై అంచనాలను మరింత పెంచేసేలా కన్నప్ప సినిమా ట్రైలర్ వచ్చేసింది. ఈ సినిమాలో రుద్రగా ప్రభాస్ స్పెషల్ క్యారెక్టర్ అదిరిపోయేలా ఉంటుందనిపిస్తోంది. ట్రైలర్ లో ఆ విషయం స్పష్టమైంది.
మూవీపై అంచనాలను మరింత పెంచేస్తూ.. విజువల్ గ్రాండ్ ఫీస్ట్ గా కన్నప్ప ట్రైలర్ వచ్చేసింది. శనివారం (జూన్ 14) కొచ్చిలో జరిగిన ఈవెంట్ లో మోహన్ లాల్ చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. శివ భక్తుడు కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా, తన డ్రీమ్ ప్రాజెక్టుగా మంచు విష్ణు ఈ సినిమాను నిర్మించారు. భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ మూవీని మంచు విష్ణు తిన్నడి క్యారెక్టర్ చేశాడు.

రాయి విసురుతూ
కన్నప్ప సినిమా ట్రైలర్ ఈ రోజు రిలీజైంది. ఇందులో విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఓ గూడెంలో ఉండే తిన్నడు (మంచు విష్ణు) చిన్నప్పటి నుంచి దేవుడంటే నమ్మడు. చిన్నతనంలో దేవుడి విగ్రహంపై తిన్నడు రాయి విసిరే సీన్ తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. దేవుడు లేడు, అది వట్టి రాయి అంటూ చిన్నప్పటి తిన్నడు చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా మొదలైంది.
వాయు లింగం
వాయు లింగం కోసం శత్రువు మూకలు సాగించే అరాచకంతో ట్రైలర్ స్పీడ్ అందుకుంది. అయితే ఆ వాయు లింగాన్ని చేరాలంటే తిన్నడిని దాటాల్సి ఉంటుంది. అతణ్ని దాటి వాయులింగం చేరడం అసాధ్యం అనే డైలాగ్ తిన్నడిగా మంచు విష్ణు హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తోంది. తన గూడెంలో ఏ బిడ్డకు ఆపద రానివ్వను అని తిన్నడు ఆన వేస్తాడు.
శివ భక్తుడిగా
ట్రైలర్ మధ్యలో శివ భక్తుడిగా మోహన్ బాబు ఎంట్రీ అదుర్స్ అనిపించింది. వాయు లింగం రహస్యాన్ని తనలోనే దాచుకునే క్యారెక్టర్ లో మోహన్ బాబు కనిపించారు. ఈ మధ్యలో వచ్చే యాక్షన్ సీన్స్ అలరిస్తాయి. దేవుడిని రాయి అంటావా అంటూ నెమలి (ప్రీతి ముకుందన్), తిన్నడి మధ్య కెమిస్ట్రీ కూడా ఉంటుంది. కానీ దేవతను దిక్కరించేవాడికి గూడెంలో చోటు లేదని తిన్నడిని పంపించేస్తారు.
ప్రభాస్ ఎంట్రీ
ఇలాంటి వాడు మీకు గొప్ప భక్తుడవుతాడని నమ్మకం ఏంటి ప్రభు? అని పార్వతి క్యారెక్టర్ లో కాజల్.. శివుడు (అక్షయ్ కుమార్)ను అడుగుతుంది. అప్పుడు రుద్ర (ప్రభాస్)ను భూలోకానికి పంపిస్తాడు శివుడు. ప్రభాస్ లుక్, అతని డైలాగ్స్ అదిరిపోయాయి. తిన్నడిని రెచ్చగొట్టి, భక్తుడిగా రుద్ర ఎలా మారుస్తాడన్నది ఆసక్తికరంగా ఉంది. ట్రైలర్ చూస్తే ప్రభాస్ స్క్రీన్ ప్రజెన్స్ ఎక్కువగా ఉండేలా కనిపిస్తోంది.
చివరగా తిన్నడు మారిపోయి శివ భక్తుడిగా మారడం కనిపించింది. శివలీల అంటూ ప్రభాస్ చెప్పడం, అక్షయ్ కుమార్ నవ్వడం ట్రైలర్ ఎండింగ్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ముకేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకు డైరెక్టర్. ఈ నెల 27న కన్నప్ప రిలీజ్ కానుంది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper



