తొలివారం ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా కాంతార ఛాప్టర్ 1.. హాలీవుడ్ సినిమాలను కూడా మించి..
రిషబ్ శెట్టి కాంతార ఛాప్టర్ 1 ఈవారం ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. హాలీవుడ్ లో టేలర్ స్విఫ్ట్, లియోనార్డో డికాప్రియోలాంటి వాళ్ల సినిమాలను కూడా వెనక్కి నెట్టడం విశేషం.
'కాంతార చాప్టర్ 1' సినిమా విడుదలైన మొదటి వారంలో బాక్సాఫీస్ వద్ద సాధించిన అద్భుతమైన వసూళ్లు కేవలం ఇండియన్ సినిమాకే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 50 మిలియన్ల డాలర్లకు పైగా వసూళ్లను అధిగమించింది. దీనికి ప్రధానంగా ఇండియాలోలో సాధించిన బలమైన కలెక్షన్లు తోడయ్యాయి. దీంతో హాలీవుడ్‌లోని కొన్ని పెద్ద సినిమాలను కూడా వెనక్కి నెట్టి, విడుదలైన మొదటి వారంలో ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఇది నిలిచింది.

ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన'కాంతార చాప్టర్ 1'
రిషబ్ శెట్టి నటించి, డైరెక్ట్ చేసిన 'కాంతార చాప్టర్ 1' ఇండియాలో మొదటి ఏడు రోజుల్లో రూ.379 కోట్ల గ్రాస్ (42 మిలియన్ డాలర్లు) వసూలు చేసింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, గురువారం (అక్టోబర్ 9) నాటికి దాని మొదటి ఎక్స్‌టెండెడ్ వీక్ ముగిసేసరికి.. ఇది 45 మిలియన్ డాలర్లకు (రూ.400 కోట్లకు పైగా) పెరుగుతుందని అంచనా. దీనికి ఓవర్సీస్ నుండి అంచనా వేసిన 8 మిలియన్ డాలర్ల వసూళ్లను జోడిస్తే, 'కాంతార చాప్టర్ 1' తొలి వారం మొత్తం వసూళ్లు సుమారు 53 మిలియన్ డాలర్లుగా ఉంటాయి.
దీని ద్వారా ఇది వీకెండ్ లో 50 మిలియన్ డాలర్లు వసూలు చేసిన ‘టేలర్ స్విఫ్ట్: ది అఫీషియల్ రిలీజ్ పార్టీ ఆఫ్ ఎ షోగర్ల్’ను అధిగమించింది. అయితే టేలర్ కొత్త ఆల్బమ్ విడుదల సందర్భంగా ఇది కేవలం వీకెండ్ లో మాత్రమే విడుదల కావడంతో సోమవారం తర్వాత దానికి వసూళ్లు పెరగలేదు.
‘కాంతార చాప్టర్ 1’.. అటు పాల్ థామస్ అండర్సన్ దర్శకత్వంలో లియోనార్డో డికాప్రియో నటించిన 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్' ను కూడా వెనక్కి నెట్టింది. ఆ సినిమా రెండవ వారంలో ప్రపంచవ్యాప్తంగా అంచనా ప్రకారం 40 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. రీరిలీజ్ అయిన 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' కూడా ఇదే సమయంలో 10 మిలియన్ డాలర్ల కంటే తక్కువ వసూళ్లతో వెనుకబడి ఉంది.
'కాంతార చాప్టర్ 1' పాన్ ఇండియా సక్సెస్
సాధారణంగా కన్నడ భాషలో రూపొందించిన ‘కాంతార చాప్టర్ 1’.. వివిధ భాషల్లో విజయం సాధించిన అరుదైన భారతీయ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. దీని హిందీ వెర్షన్ బుధవారం (అక్టోబర్ 8) నాటికి దేశీయంగా రూ.100 కోట్ల నెట్ వసూలు చేసింది. ఆ తర్వాత శుక్రవారం (అక్టోబర్ 10) నాటికి కన్నడ వెర్షన్ కూడా అదే ఘనతను సాధించనుంది.
తెలుగు వెర్షన్ కూడా ఇప్పటివరకు రూ.60 కోట్లకు పైగా నెట్ వసూళ్లతో దూసుకెళ్తోంది. మలయాళం, తమిళ డబ్బింగ్‌లు రెండూ ఒక్కొక్కటి రూ.20 కోట్లకు పైగా వసూలు చేశాయి.
'కాంతార చాప్టర్ 1' గురించి..
రిషబ్ శెట్టి రచన, దర్శకత్వం వహించిన 'కాంతార చాప్టర్ 1' లో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. 2022లో వచ్చిన 'కాంతార' సినిమాకు ఇది ప్రీక్వెల్. ఈ చిత్రం కథ.. మొదటి సినిమా సంఘటనలకు వెయ్యి సంవత్సరాల ముందు జరుగుతుంది. విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల ఆదరణ పొందిన ఈ మూవీ తర్వాత 'కాంతార చాప్టర్ 2' కూడా ఉంటుందని ప్రకటించారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


