కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: దీప కన్నీళ్లు తుడిచిన కార్తీక్- జ్యోత్స్న నిశ్చితార్థానికి కాంచనకు ఆహ్వానం- భయపడిన సుమిత్ర
కార్తీక దీపం 2 సీరియల్ జూలై 12 ఎపిసోడ్‌లో దీప వల్ల తాను ఎంత భయపడుతుందో సుమిత్ర చెప్పుకుంటుంది. దీప కడుపులో ఉన్నప్పుడు జరిగిన విషయాలన్నీ చెప్పి అలాంటి బిడ్డను నువ్ చంపాలనుకున్నావ్ అని సుమిత్ర అంటుంది. మరోవైపు కాంచనను పిలవమని కార్తీక్‌తో శివ నారాయణ అంటాడు.
కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో నేను నిన్ను అసహ్యించుకుంటున్నాను, చిరాకు పడుతున్నాను ఎంత చేసిన నీకు నాపై ఏమాత్రం కోపం రావట్లేదా, చిరాకు అనిపించట్లేదా అని సుమిత్ర అడిగితే లేదని దీప అంటుంది. అదే ఎందుకు అని అడుగుతుంది సుమిత్ర. ఎందుకుంటే నువ్వు నా తల్లివి అని దీప అంటుంది.

నాకో సాయం చేస్తావా
దాంతో సుమిత్ర షాక్ అయినట్లు చూపిస్తారు. కానీ, దీప అలా చెప్పాలనుకుని ఆగిపోతుంది. మౌనంగా ఉంటే ఏంటీ అర్థం. నిన్ను చూస్తుంటే భయంగా ఉంది. నాకో సాయం చేస్తావా. కాంచన కోసం ఈ చీర తీసుకున్నాను. ఇది తీసుకెళ్లి ఇవ్వు అని సుమిత్ర అంటుంది. నాకన్న మీరిస్తేనా బాగుంటుందని దీప అంటుంది.
నువ్ నా కూతురుకి రివాల్వర్ గురి పెట్టినప్పుడు మొదలైన భయం ఇప్పటికీ అలాగే ఉంది. నువ్ ఎక్కడ నా కూతురు నిశ్చితార్థం చెడగొడతావేమో అని భయంగా ఉందని సుమిత్ర చెబుతుంది. జ్యోత్స్న పుట్టుక గురించి చెబుతుంది. నిజానికి అదంతా దీప గురించే చెబుతుంది. నా ప్రాణం కాపాడుకోడానికి నా బిడ్డ ప్రాణం ఎలా తీయాలన్నాను. కష్టమైన సరే నేను నా బిడ్డ కలిసే బతుకుతామని డాక్టర్‌కు చెప్పాను అని తను అనుభవించిన వేదన చెబుతుంది సుమిత్ర.
దశరథ్ మాటలను
అది బిడ్డ కాదు. ఆ దేవుడు ఇచ్చిన కానుక. అలాంటి బిడ్డను నువ్వు చంపాలనుకున్నావ్. నీమీద నాకు ఎంత కోపం రావాలో చెప్పు. కానీ, కోపం రావట్లేదు. భయం వేస్తుంది. దాని జీవితాన్ని ఏం చేస్తావో. రాత్రుళ్లు నిజంగా నిద్రపట్టట్లేదు దీప. నా కూతురుని వదిలేయ్ దీప. సంతోషాన్ని దూరం చేయకు అని సుమిత్ర అంటే దీప వెళ్లిపోతుంది. మరోవైపుదశరథ్ అన్న మాటలు ఆలోచిస్తాడు.
ఏడుస్తున్న దీపను చూసిన కార్తీక్ కన్నీళ్లు తుడుస్తాడు. సుమిత్ర చెప్పింది చెబుతుంది దీప. ఆ ఒక్కరాత్రి నా తల రాతను ఎవరైనా మార్చి ఉంటే నా కన్నతల్లి ప్రేమను అనుభవించేదాన్ని అని దీప ఎమోషనల్ అవుతుంది. నేను నీలా ఏడవలేకపోతున్నాను. దశరథ్ అడిగింది చెబుతాడు. గౌతమ్ మీద మావయ్యకు డౌట్ ఉందని, నిజం చెబితే తట్టుకోలేకపోతాడు, మాట నోరు దాటలేదు అని కార్తీక్ అంటాడు.
నేనే వసపోశాను
అందుకే ఏవో రెండు అబద్ధాలు చెప్పి అందులో నిజం చెప్పాను అని కార్తీక్ అంటాడు. ఇంతలో శివ నారాయణ వస్తాడు. శివ నారాయణ చెప్పేది వినకుండా కార్తీక్ వాగుతుంటే వీడికి నాలుగేళ్ల వరకు మాటలు రాకుంటే నేనే వస పోసాను. అప్పటి నుంచి వాగుతూనే ఉన్నాడు అని తన బంధాన్ని చెబుతాడు శివ నారాయణ. ఏదైనా మనం బతికి ఉన్నప్పుడే బంధాలు అని కార్తీక్ అంటాడు.
నా మాట లెక్క చేయనివాడు, నాకు మాటిచ్చి తప్పినవాడు నాకు రక్తబంధువు అయిన నాకు శత్రువే. ఆ శత్రువుల లిస్టులో నా మనవడు అయినా ఉండొచ్చు. నా ప్రాణం పోయినా నా పంతం వీడను అని శివ నారాయణ అంటాడు. నిశ్చితార్థానికి కాంచనను పిలువు అని శివ నారాయణ ఆహ్వానిస్తాడు. ఎలా రావాలి, కూతురిగానా, డ్రైవర్ తల్లిగానా అని కార్తీక్ అంటాడు.
ఎలా రప్పించాలో
ఎలాగైన పిలు అని శివ నారాయణ అంటే నేను పిలవలేను. మీరే పిల్చుకోండి, డ్రైవర్ తల్లిని పిలవడానికి, ఇంటి ఆడపడుచును పిలవడానికి వేరే పద్ధతి ఉంటుంది. మా అమ్మకు ఆరోగ్యం సరిగా లేదు సర్. ఎక్కడికి వెళ్లకన్నారు అని కార్తీక్ చెప్పి వెళ్లిపోతాడు. ఎవరిని ఎలా రప్పించాలో నాకు తెలుసురా అని శివ నారాయణ అంటాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper













