కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో గౌతమ్ గాడు పెద్ద ఎధవ. వాడి గురించి చెబితే వాళ్లు నమ్మని నమ్మకపోని కానీ, నేను మాత్రం చెబుతాను. నా పుట్టింట్లో కన్నీళ్లు తిరగడం చూడలేను. చెబుతాను అని అనసూయ అంటుంది. గౌతమ్, జ్యోత్స్న ఇద్దరు బయటపడరని, జ్యోత్స్నతోనే నిజం చెప్పించాలి. దానికి ఈ ఎంగేజ్‌మెంట్ ఒక్కటే దారి అని కార్తీక్ నచ్చెజెప్పుతాడు.
అనుకుంది సాధిస్తారు

మళ్లీ పాత రోజులు తీసుకొస్తాను అని కార్తీక్ అంటే వీళ్లిద్దరు అనుకుంది సాధించారు. ఇది కూడా సాధిస్తారు. కార్తీక్ అన్నది జరిగితే నీకు పూలు జల్లి మరి ఇంటికి ఆహ్వానిస్తారు. దీపను గొప్పగా చూస్తారు అని కాంచన అంటుంది. మీరంతా ధైర్యంగా ఉంటే చాలు అని కార్తీక్ అంటాడు. మరోవైపు తండ్రి దాస్ వచ్చాడని శ్రీధర్ చెబితే తెలిసిందని, లగేజ్ సర్దుకున్నామని కాశీ చెబుతాడు.
ఇంతలో కాశీకి కార్తీక్ కాల్ చేస్తాడు. గౌతమ్ చెడ్డవాడు అని నిరూపించడానకి వీడియోలు అన్ని తీసి సినిమా తయారు చేశావ్‌గా. ఇవాళ జ్యోత్స్న వాళ్ల ఇంట్లో ఆ సినిమా వేయాల్సిందే. మీ నాన్న కూడా వచ్చాడుగా. ఇవాళ అందరికి సినిమా చూపించాల్సిందే అని కార్తీక్ అంటాడు. సరే బావ అని కాశీ కాల్ కట్ చేస్తాడు. మన సీక్రెట్స్ తెలిసినవాళ్లు అయితే దూరంగా ఉండాలి, లేదా ఫొటోలో ఉండాలి అని పారుతో జ్యో అంటుంది.
ఇంతలో జ్యోకి కాశీ కాల్ చేసి గుమ్మం బయట ఉన్నా. కవర్ తీసుకొచ్చా అంటాడు. పారు తీసుకుంటుందని కాల్ కట్ చేస్తుంది జ్యోత్స్న. పారిజాతం తీసుకురాడానికి వెళ్తుంది. ఎందుకైన మంచిది అని జ్యోత్స్న ఓ లుక్కేద్దామనుకుంటుంది. నువ్ ముందు హాల్లోకి వెళ్లి నేను వేరేలా వస్తాను అని కార్తీక్ కాశీతో అంటాడు. కాశీ హాల్లోకి వచ్చి పారుకు కవర్ ఇస్తాడు.
మరోలా బయటపెడుతున్నాడు
అప్పుడే శివ నారాయణ వస్తాడు. నేను ఎలాగు బయటపెట్టాలనుకున్నాను. మరోలా బయటపడుతున్నాయని జ్యోత్స్న అనుకుంటుంది. మళ్లీ ఎందుకు వచ్చావ్ అని కాశీని నిలదీస్తాడు శివ నారాయణ. పారు ఆ చేతిలో ఏంటీ అని కార్తీక్ అంటే.. అది నాకు జ్యోత్స్న అక్కకు మాత్రమే తెలుసు. మీకు అనవసరం అని కాశీ అంటాడు. ఏంట్రా అది అని దశరథ్ అడిగితే చూపించురా కాశీ అని జ్యోత్స్న అంటుంది.
{{/usCountry}}అప్పుడే శివ నారాయణ వస్తాడు. నేను ఎలాగు బయటపెట్టాలనుకున్నాను. మరోలా బయటపడుతున్నాయని జ్యోత్స్న అనుకుంటుంది. మళ్లీ ఎందుకు వచ్చావ్ అని కాశీని నిలదీస్తాడు శివ నారాయణ. పారు ఆ చేతిలో ఏంటీ అని కార్తీక్ అంటే.. అది నాకు జ్యోత్స్న అక్కకు మాత్రమే తెలుసు. మీకు అనవసరం అని కాశీ అంటాడు. ఏంట్రా అది అని దశరథ్ అడిగితే చూపించురా కాశీ అని జ్యోత్స్న అంటుంది.
{{/usCountry}}ఇది ప్లాన్ మార్చినట్లు ఉందని కవర్ చూపిస్తుంది పారు. అదేంటో చూపిస్తేగా తెలుస్తుందని కార్తీక్ అంటే.. థ్యాంక్స్ బావా నీ చేతులతోనే ఈ ఎంగేజ్‌మెంట్ చెడిపోయేలా చేస్తున్నావ్ అని జ్యో మనసులో అనుకుంటుంది. కవర్‌లో ఏం లేదని పారు అంటే శివ నారాయణ కూడా చూస్తాడు. ఏదో ఉందే అని చెక్ తీస్తాడు. పేపర్ కాదు పది లక్షల చెక్ అని శివనారాయణ అనడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది.
జ్యోత్స్న నీ పేరు మీద చెక్ ఉంది. కాశీ నీకివ్వడం ఏంటీ అని శివ నారాయణ అడిగితే.. జరిగిందే చెబుతా అని కాశీ అంటాడు. ఇప్పుడు వీడు నన్ను ఇరికించడానికే వచ్చాడు. వీడు నన్ను మోసం చేశాడు. అందరిముందు ఫూల్‌ని చేశాడు అని జ్యోత్స్న అనుకుంటుంది. సారీ అక్కా చెప్పేస్తున్నా. గౌతమ్ గురించి పది లక్షల చెక్ ఇచ్చింది అని కాశీ అంటాడు.
గౌతమ్ ఇంటి దగ్గర వెంచర్
గౌతమ్ ఇంటి దగ్గర వెంచర్ వేస్తున్నాడు. డబ్బులు లేవని గ్రానిని అడిగితే నేను ఇచ్చాను అని జ్యోత్స్న అంటుంది. వాడు గొడవ చేస్తుంటే నువ్ సహాయం చేస్తున్నావా. ఇలాంటి వాళ్లకు సహాయం చేయడమంటే నన్ను అవమానించినట్లే అని శివ నారాయణ వెళ్లిపోతాడు. నువ్ నాకు సహాయం చేశావ్. నేను నీకు తిరిగి ఇస్తున్నాను అని కాశీ వెళ్లిపోతాడు.
కాశీ వచ్చింది కవర్ ఇవ్వడానికి కాదా. ఇంకేదైనా ఉందా.. ఉండే ఉంటుందిలే. కానీ, అది జరగదు. ఇది వెంటనే నా బంగారానికి చెప్పాలి. స్మైల్ ప్లీజ్ అని కార్తీక్ వెళ్లిపోతాడు. వీడు చావుదెబ్బ కొట్టి స్మైల్ ప్లీజ్ అంటాడేంటే అని పారు అంటుంది. కానీ, నీ మనవడు నమ్మకద్రోహం చేశాడు.. వాన్ని అని కోపంగా వెళ్లిపోతుంది జ్యోత్స్న.
అందరు కలిసి నన్ను ఇరికించారు అని పారు ఫీల్ అవుతుంది. అలా గౌతమ్ వీడియోలు కాశీతో చూపించి, అదంతా దీపే చేయించిందని నింద వేయాలని వేసిన జ్యోత్స్న ప్లాన్ ఫెయిల్ అవుతుంది. కానీ, కాశీతో నిజం చెప్పించకుండా కొద్దిలో జ్యోత్స్న ఎస్కేప్ అవుతుంది. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.