కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: చావు దెబ్బ కొట్టిన కార్తీక్- జ్యోత్స్నకు కాశీ నమ్మకద్రోహం- గౌతమ్ వీడియో ప్లాన్ ఫెయిల్!
కార్తీక దీపం 2 సీరియల్ జూలై 18 ఎపిసోడ్‌లో జ్యోత్స్న చెప్పినట్లు గౌతమ్ వీడియోలు తీసుకురమ్మని కాశీతో చెబుతాడు కార్తీక్. కాశీ అలాగే చేస్తాడు. తాము చెప్పిందే చేస్తున్నాడు అని జ్యోత్స్న, పారు అనుకుంటారు. కానీ, జ్యోత్స్న ఇచ్చిన పది లక్షల చెక్ ఇస్తాడు కాశీ. నమ్మకద్రోహం చేశాడని జ్యోత్స్న కోపంతో ఊగిపోతుంది.
కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో గౌతమ్ గాడు పెద్ద ఎధవ. వాడి గురించి చెబితే వాళ్లు నమ్మని నమ్మకపోని కానీ, నేను మాత్రం చెబుతాను. నా పుట్టింట్లో కన్నీళ్లు తిరగడం చూడలేను. చెబుతాను అని అనసూయ అంటుంది. గౌతమ్, జ్యోత్స్న ఇద్దరు బయటపడరని, జ్యోత్స్నతోనే నిజం చెప్పించాలి. దానికి ఈ ఎంగేజ్‌మెంట్ ఒక్కటే దారి అని కార్తీక్ నచ్చెజెప్పుతాడు.

అనుకుంది సాధిస్తారు
మళ్లీ పాత రోజులు తీసుకొస్తాను అని కార్తీక్ అంటే వీళ్లిద్దరు అనుకుంది సాధించారు. ఇది కూడా సాధిస్తారు. కార్తీక్ అన్నది జరిగితే నీకు పూలు జల్లి మరి ఇంటికి ఆహ్వానిస్తారు. దీపను గొప్పగా చూస్తారు అని కాంచన అంటుంది. మీరంతా ధైర్యంగా ఉంటే చాలు అని కార్తీక్ అంటాడు. మరోవైపు తండ్రి దాస్ వచ్చాడని శ్రీధర్ చెబితే తెలిసిందని, లగేజ్ సర్దుకున్నామని కాశీ చెబుతాడు.
ఇంతలో కాశీకి కార్తీక్ కాల్ చేస్తాడు. గౌతమ్ చెడ్డవాడు అని నిరూపించడానకి వీడియోలు అన్ని తీసి సినిమా తయారు చేశావ్‌గా. ఇవాళ జ్యోత్స్న వాళ్ల ఇంట్లో ఆ సినిమా వేయాల్సిందే. మీ నాన్న కూడా వచ్చాడుగా. ఇవాళ అందరికి సినిమా చూపించాల్సిందే అని కార్తీక్ అంటాడు. సరే బావ అని కాశీ కాల్ కట్ చేస్తాడు. మన సీక్రెట్స్ తెలిసినవాళ్లు అయితే దూరంగా ఉండాలి, లేదా ఫొటోలో ఉండాలి అని పారుతో జ్యో అంటుంది.
ఇంతలో జ్యోకి కాశీ కాల్ చేసి గుమ్మం బయట ఉన్నా. కవర్ తీసుకొచ్చా అంటాడు. పారు తీసుకుంటుందని కాల్ కట్ చేస్తుంది జ్యోత్స్న. పారిజాతం తీసుకురాడానికి వెళ్తుంది. ఎందుకైన మంచిది అని జ్యోత్స్న ఓ లుక్కేద్దామనుకుంటుంది. నువ్ ముందు హాల్లోకి వెళ్లి నేను వేరేలా వస్తాను అని కార్తీక్ కాశీతో అంటాడు. కాశీ హాల్లోకి వచ్చి పారుకు కవర్ ఇస్తాడు.
మరోలా బయటపెడుతున్నాడు
అప్పుడే శివ నారాయణ వస్తాడు. నేను ఎలాగు బయటపెట్టాలనుకున్నాను. మరోలా బయటపడుతున్నాయని జ్యోత్స్న అనుకుంటుంది. మళ్లీ ఎందుకు వచ్చావ్ అని కాశీని నిలదీస్తాడు శివ నారాయణ. పారు ఆ చేతిలో ఏంటీ అని కార్తీక్ అంటే.. అది నాకు జ్యోత్స్న అక్కకు మాత్రమే తెలుసు. మీకు అనవసరం అని కాశీ అంటాడు. ఏంట్రా అది అని దశరథ్ అడిగితే చూపించురా కాశీ అని జ్యోత్స్న అంటుంది.
ఇది ప్లాన్ మార్చినట్లు ఉందని కవర్ చూపిస్తుంది పారు. అదేంటో చూపిస్తేగా తెలుస్తుందని కార్తీక్ అంటే.. థ్యాంక్స్ బావా నీ చేతులతోనే ఈ ఎంగేజ్‌మెంట్ చెడిపోయేలా చేస్తున్నావ్ అని జ్యో మనసులో అనుకుంటుంది. కవర్‌లో ఏం లేదని పారు అంటే శివ నారాయణ కూడా చూస్తాడు. ఏదో ఉందే అని చెక్ తీస్తాడు. పేపర్ కాదు పది లక్షల చెక్ అని శివనారాయణ అనడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది.
జ్యోత్స్న నీ పేరు మీద చెక్ ఉంది. కాశీ నీకివ్వడం ఏంటీ అని శివ నారాయణ అడిగితే.. జరిగిందే చెబుతా అని కాశీ అంటాడు. ఇప్పుడు వీడు నన్ను ఇరికించడానికే వచ్చాడు. వీడు నన్ను మోసం చేశాడు. అందరిముందు ఫూల్‌ని చేశాడు అని జ్యోత్స్న అనుకుంటుంది. సారీ అక్కా చెప్పేస్తున్నా. గౌతమ్ గురించి పది లక్షల చెక్ ఇచ్చింది అని కాశీ అంటాడు.
గౌతమ్ ఇంటి దగ్గర వెంచర్
గౌతమ్ ఇంటి దగ్గర వెంచర్ వేస్తున్నాడు. డబ్బులు లేవని గ్రానిని అడిగితే నేను ఇచ్చాను అని జ్యోత్స్న అంటుంది. వాడు గొడవ చేస్తుంటే నువ్ సహాయం చేస్తున్నావా. ఇలాంటి వాళ్లకు సహాయం చేయడమంటే నన్ను అవమానించినట్లే అని శివ నారాయణ వెళ్లిపోతాడు. నువ్ నాకు సహాయం చేశావ్. నేను నీకు తిరిగి ఇస్తున్నాను అని కాశీ వెళ్లిపోతాడు.
కాశీ వచ్చింది కవర్ ఇవ్వడానికి కాదా. ఇంకేదైనా ఉందా.. ఉండే ఉంటుందిలే. కానీ, అది జరగదు. ఇది వెంటనే నా బంగారానికి చెప్పాలి. స్మైల్ ప్లీజ్ అని కార్తీక్ వెళ్లిపోతాడు. వీడు చావుదెబ్బ కొట్టి స్మైల్ ప్లీజ్ అంటాడేంటే అని పారు అంటుంది. కానీ, నీ మనవడు నమ్మకద్రోహం చేశాడు.. వాన్ని అని కోపంగా వెళ్లిపోతుంది జ్యోత్స్న.
అందరు కలిసి నన్ను ఇరికించారు అని పారు ఫీల్ అవుతుంది. అలా గౌతమ్ వీడియోలు కాశీతో చూపించి, అదంతా దీపే చేయించిందని నింద వేయాలని వేసిన జ్యోత్స్న ప్లాన్ ఫెయిల్ అవుతుంది. కానీ, కాశీతో నిజం చెప్పించకుండా కొద్దిలో జ్యోత్స్న ఎస్కేప్ అవుతుంది. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



