కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: శ్రీధర్ లుంగీ గొడవ- వర్కర్స్ ధర్నా- శివ నారాయణతో దీప డీల్- ఏం అడిగిన ఇస్తానన్న పెద్దయ్య!
కార్తీక దీపం 2 సీరియల్ జూన్ 21 ఎపిసోడ్‌లో శివ నారాయణ ఇంట్లో వర్కర్స్ జీతాలు పెంచమని ధర్నా చేస్తారు. ఈ సమస్యకు పరిష్కారం కార్తీక్ చెబుతాడని దీప అంటుంది. వర్కౌట్ కాకపోతే జ్యోత్స్న అప్పులో కోటి రూపాయలు పెంచుకోమని కార్తీక్ అంటాడు. వర్కౌట్ అయితే దీప అడిగింది ఇస్తానని శివ నారాయణ చెబుతాడు.
కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో స్నానం చేసి వచ్చిన శ్రీధర్ తన లుంగీ గురించి అడుగుతాడు. అల్లుడి గారికి ఇచ్చానని కావేరి చెబుతుంది. ఒరేయ్ సిగ్గు లేనోడా నా లుంగీ ఇవ్వరా అంటూ శ్రీధర్ అరుస్తూ వెళ్తాడు. కాశీ దగ్గరికి వెళ్లి నన్ను అడక్కుండా నా లుంగీ ఎందుకు కట్టుకున్నావురా అని అంటాడు.

డబ్బులు ఇస్తాను
లుంగీ కోసం గొడవ ఏంటండి. ఎవరైనా వెంటే చెండాలంగా ఉంటుంది అని కావేరి అంటుంది. దాంతో లుంగీ విప్పడానికి నీలు ట్రై చేస్తుంది. భార్యను ఆపిన కాశీ మావయ్య రెండు నిమిషాలు ఆగండి ఇస్తాను అని అంటాడు. నువ్ కట్టుకుంది నేను కట్టుకోనా అని శ్రీధర్ అంటాడు. మరి ఎంత అయిందో చెప్పండి డబ్బులు ఇస్తాను అంటాడు కాశీ.
రెండు వేలు అని శ్రీధర్ చెబుతాడు. సాధారణంగా అయితే నా కొత్త లుంగీ దొంగతనం చేసినందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. కానీ దయతలిచి డబ్బులు తీసుకుని వెళ్తున్నాని శ్రీధర్ వెళ్లిపోతాడు. మరోవైపు శివ నారాయణ ఇంట్లో జీతాలు పెంచాలని రెస్టారెంట్ వర్కర్స్ ధర్నా చేస్తారు. రేపు ఆఫీస్‌లో మాట్లాడతానని జ్యోత్స్న అంటుంది. ఆఫీస్‌లో మాట్లాడటానికి ఏం లేదు బోనస్ పెంచితే సరే లేకుంటే అంతా ధర్నా చేస్తామంటారు.
బెదిరిస్తున్నారా అని శివ నారాయణ అంటే.. లేదు. జీతాలు పెంచకుంటే మీ 450 మందితో మీ ఇంటి ముందు స్ట్రైక్ చేస్తాం. న్యాయం చేస్తే చేయండి లేదంటే స్ట్రైక్ చేస్తాం. ఇందులో ఎవరు చెప్పిన వినేది లేదని మేనేజర్ అంటాడు. వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతారు వర్కర్స్. తాతయ్య అని జ్యోత్స్న అంటే నోర్మూయ్. మాట్లాడితే దవడ పళ్లు రాలిపోతాయ్. ఇవాళ నాకే వర్కర్స్ వార్నింగ్ ఇచ్చారు. నాకు రేపు సాయంత్రం వరకు టైమ్ ఇచ్చారు. దానికంటే చావడం బెటర్ అని శివ నారాయణ అంటాడు.
వ్యాపారం మూసేయాలి
నేను హ్యాండిల్ చేస్తానని జ్యోత్స్న అంటుంది. అలా చేస్తే ఇక్కడి వరకు పరిస్థితి రాదు. శివ నారాయణ కంపెనీ దివాళా తీసిందనే వార్తలు చదవలేను. నువ్వు ఎప్పుడో పడేసిపోయావ్. మనకుంది 34 గంటలు మాత్రమే ఉంది. అయితే వాళ్ల డిమాండ్స్ తీర్చాలి. లేదా వ్యాపారం మొత్తం మూసేయాలి. అప్పుడు ఎవరు ఏం మాట్లాడుకుంటే మనకేంటీ అని శివ నారాయణ అంటాడు.
నాకు టైమ్ ఇవ్వు తాత అని జ్యోత్స్న అంటే నీకు వారం టైమ్ ఇచ్చిన ఏం చేయలేవు అని శివ నారాయణ అంటాడు. కార్తీక్‌ను బయటకు తీసుకెళ్లి నువ్వు సలహా ఇవ్వగలవు. వాళ్లకు మనకు దూరం తగ్గడానికి మనకు అవకాశం దొరికింది అని దీప అంటుంది. వాళ్లు అడిగితే చెబుతా లేకుంటే చెప్పను అని కార్తీక్ అంటాడు. సారీ బావ చనువు తీసుకున్నందుకు అని దీప వెళ్లిపోతుంది.
సమస్యకు పరిష్కారం లేదని శివ నారాయణ అంటే ఉంది పెద్దయ్య. మా బావ సలహా ఇస్తాడు అని దీప చెబుతుంది. మాకు పనివాళ్ల సలహాలు అవసరం లేదు అని శివ నారాయణ అంటాడు. దాంతో కార్తీక్‌ను దశరథ్ పొగుడుతాడు. వాళ్ల సమస్యలు అర్థం కావాలంటే మనం వర్కర్స్‌లా ఆలోచించాలి. వాళ్లను పిలిపించండి నేను మాట్లాడుతాను అని కార్తీక్ అంటాడు.
కోటి రూపాయలురా
వర్కౌట్ కాకపోతే అని శివ నారాయణ అంటే.. జ్యోత్స్నకు ఇవ్వాల్సిన దాంట్లో టెన్ పర్సంట్ పెంచుకోండి అని కార్తీక్ అంటాడు. అంటే కోటి రూపాయలురా అని దశరథ్ అంటాడు. శివ నారాయణ ఒప్పుకుంటాడు. మరి వర్కౌట్ అయితే ఏం చేస్తారు. ఇచ్చిన సలహా వర్కౌట్ కాకుంటే కోటి రూపాయలు ఫైన్ వేసినప్పుడు వర్కౌట్ అయితే ఏంటో కూడా చెప్పాలి కదా అని దీప అంటుంది.
నీ ప్లాన్ వర్కౌట్ అయితే నువ్ ఏది అడిగితే అది ఇస్తాను అని శివ నారాయణ అంటాడు. దాంతో పారిజాతంపై జ్యోత్స్న కోప్పడుతుంది. ఇదేంటీ ఇలా నోరు జారేశాను. అయినా ప్లాన్ వర్కౌట్ కావాలి కదా. అప్పులో కోటి పెరిగినట్లే అని పారు అనుకుంటుంది. వర్కర్స్‌తో కార్తీక్ మాట్లాడుతాడు. మీరు అడిగిన దానికంటే ఎక్కువే ఇస్తామన్నారు. కానీ, ఇప్పుడు కంపెనీ లాభాల్లో లేదు కాబట్టి ఇప్పుడే జీతాలు పెంచలేరు. కానీ, మీకు వడ్డీ లేని రుణాలు ఇస్తారు అని కార్తీక్ అంటాడు.
దాంతో అంతా వర్కర్స్ అంతా చప్పట్లు కొడతారు. అలాగే, ఇకమీదట బోనస్‌లు ఉండవు. కానీ, ప్రతి సంవత్సరం కంపెనీలో వచ్చే లాభాల్లో 25 శాతం మీకే పంచుతాం. అంటే మీరు ఇప్పుడు వర్కర్స్ కాదు భాగస్వాములు. మీ వల్ల కంపెనీకి రూపాయి వస్తే 25 పైసలు మీకే. అయితే, మీకిచ్చే రుణాలను ప్రతి నెల మీ జీతం నుంచి కట్ చేసుకుంటాం. అలాగే లాభాల్లో 25 శాతం అందరికి సమానంగా పంచుతాం అని కార్తీక్ అంటాడు.
పరువు నిలబెట్టాడు
ఇప్పుడు మీ నిర్ణయం చెప్పండి. టైమ్ తీసుకున్నా పర్లేదు అని కార్తీక్ అంటాడు. దాంతో కాసేపు మాట్లాడుకున్న వర్కర్స్ అంతా ఒప్పుకుంటారు. ధర్నా చేస్తామన్నాం కానీ దాని వల్ల మాకే నష్టం. వేరే దారి లేక చెప్పాం. కానీ, మీరు ఇంతబాగా ఆలోచిస్తారని తెలియదని మేనేజర్ అంటాడు. మీ మనవడు మీ పరువు నిలబెట్టాడు సర్ అని శివ నారాయణను అంటాడు మేనేజర్.
కార్తీక్ సర్‌కు జిందాబాద్ చెప్పి వెళ్లిపోతారు. కార్తీక్ గెలిచాడు అని దశరథ్ అంటాడు. లోపలికి రమ్మని పిలుస్తాడు శివ నారాయణ. తర్వాత పారిజాతంకు శ్రీధర్ కాల్ చేసి గొడవ సద్దుమణిగింది కదా. ప్రతి చోట మన మనిషి ఉంటాడని అంటాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



