కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కార్తీక్, దీపకు శివ నారాయణ సర్‌ప్రైజ్ గిఫ్ట్- కోటిలో ఒక్క రూపాయి తగ్గిన జ్యోత్స్న అప్పు!
కార్తీక దీపం 2 సీరియల్ జూన్ 23 ఎపిసోడ్‌లో సమస్య తీరితే ఏమైన కోరుకోమన్నారుగా అని కార్తీక్ అంటాడు. మాటిచ్చానని శివ నారాయణ చెబుతాడు. దాంతో జ్యోత్స్న అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయమని చెబుతాడు కార్తీక్. ఇదే కోరుకుంటావని తెలుసని శివ నారాయణ అంటే కాదని మాట మారుస్తాడు కార్తీక్. బ్లాంక్ చెక్ ఇస్తాడు శివ నారాయణ.
కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో వర్కర్స్‌ను ఒప్పించి పంపించిన తర్వాత పారుకు శ్రీధర్ కాల్ చేసి తనకంతా తెలుసని చెబుతాడు. సమస్య క్లియర్ అయితే మా ఆయన ఏది అడిగిన ఇస్తా అని అన్నాడు అదే టెన్షన్‌గా ఉందని పారిజాతం అంటుంది. గోవిందా గోవిందా. ఇంకేం అడుగుతాడు అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయమని అంటాడని శ్రీధర్ అంటాడు.

చెమ్మ చెక్కల ఆట
అలా జరిగితే మా ఆయన చంపేస్తాడు. నేనే నోరు జారాను. దానివల్లే నీ కొడుకుకి మా ఆయన మాటిచ్చాడు అని పారిజాతం అంటాడు. అయితే మిమ్మల్ని మావయ్య గారు గెంటేస్తారు. మా ఇంటికి వచ్చేయండి. మనమంతా కలిసి చెమ్మ చెక్క ఆటలు ఆడుకుందాం అని శ్రీధర్ అంటాడు. మీకు బుద్ధిలేదని పారిజాతం కాల్ కట్ చేస్తుంది. శివ మావయ్య నీకు నా కొడుకే కరెక్ట్ అని శ్రీధర్ అనుకుంటాడు.
ఇంట్లో పెద్ద సార్ ఏదో మాట ఇచ్చారు అని కార్తీక్ అంటాడు. నేను మాటిచ్చాను అడుగు అని శివ నారాయణ అంటాడు. మరదలా మరి మనం అనుకుంది అడుగుతా అని కార్తీక్ అంటాడు. ఇప్పుడు వీడు మన అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయమని అడుగుతాడని పారు, జ్యోత్స్న గుసగుసలు ఆడుతారు. అలా జరిగితే బావ నా చేతులో నుంచి జారిపోయినట్లే అని జ్యోత్స్న అంటుంది.
అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయాలి
నేను సంతకం పెట్టిన అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయాలి అని కార్తీక్ అడుగుతాడు. ఇక నీ నుంచి మీ బావకు విడుదలే అని పారు అంటుంది. నువ్ అవకాశవాదివిరా నాకు తెలుసు ఇదే అడుగుతావని అని శివ నారాయణ అంటాడు. అని అడుగుతానని అనుకున్నారు కదూ. కానీ, కాదు అని ట్విస్ట్ ఇస్తాడు కార్తీక్. అదేంటే లాస్ట్ సెకన్‌లో మాట మార్చి టెన్షన్ పెడతాడు. ఏం అడుగుతాడే అని భయపడుతుంది పారిజాతం.
నాకు ఏం కావాలో స్పష్టంగా అడుగుతా. కానీ, అవసరం వచ్చినప్పుడు అడుగుతా అని కార్తీక్ అంటాడు. నేను మాత్రం అనుకున్నప్పుడే ఇస్తాను. నీకు అవసరం వచ్చేవరకు నేనేందుకు ఎదురుచూడాలి. వాడికి ఇప్పుడు అవసరం అని పారును చెక్ బుక్ తీసుకురమ్మంటాడు శివ నారాయణ. బ్లాంక్ చెక్ మీద సంతకం చేసి ఇస్తాడు శివ నారాయణ. ఎంత రాసుకుంటావో నీ ఇష్టం. నువే చేసినదానికి విలువల కట్టలేను అని శివ నారాయణఅంటాడు.
ఒక్క రూపాయి రాసి
తర్వాత బ్లాంక్ చెక్ మీద కార్తీక్ అమౌంట్ రాసినట్లు చేసి ఏం రాయకుండానే జ్యోత్స్నకు ఇస్తాడు కార్తీక్. మళ్లీ ఇదేం ట్విస్టురా అని పారు అంటుంది. ఒక పెద్ద మనిషి నా మీద నమ్మకంతో బ్లాంక్ చెక్ ఇచ్చారు. నేను అదే నమ్మకంతో నీకు ఇచ్చాను. నువ్ ఎంత రాస్తే అంత అప్పులో తీరినట్లే. ఛాన్స్ అవతలి వాళ్లకు ఇచ్చాను అని కార్తీక్ అంటాడు. ఛాన్స్ ఇచ్చినప్పుడు తీసుకోకపోతే ఎలా అని బ్లాంక్ చెక్ మీద ఒక్క రూపాయి రాస్తుంది జ్యోత్న్స.
ఇది అన్యాయం అని దశరథ్ అంటాడు. ఎందుకు వాడికి బ్లాంక్ చెక్ ఇస్తే జ్యోత్న్సకు ఇచ్చాడు. తప్పు ఎవరిది అని శివ నారాయణ అంటాడు. నాకు ఓకే అని కార్తీక్ అంటాడు. కోటి రూపాయల అప్పు నుంచి ఒక్క రూపాయి తగ్గినట్లు అని జ్యోత్న్స అంటుంది. నేను మాత్రం ఊరుకోను. నీకూ గిఫ్ట్ ఇస్తాను. ఇంటి దగ్గర స్కూటి ఉంది. అది వాడుకోండి. అంటే అది మీదే. పెట్రోల్‌కు బిల్ పెట్టుకో మేమిస్తాం అని శివ నారాయణ అంటాడు.
శివ నారాయణ సర్‌ప్రైజ్
దాంతో శివ నారాయణకు జై అని అరుస్తారు కార్తీక్, దీప. ఇలా కార్తీక్ వాళ్లకు శివ నారాయణ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాడు. తర్వాత కిచెన్‌లో కార్తీక్‌కు దిష్టి తీస్తుంది దీప. నువ్వేంటో తెలిసింది. జ్యోత్స్న బుద్ధి ఏంటో కూడా తెలుసింది అని దీప అంటుంది. నీలో మా అమ్మ కనిపించింది అని దీపను కార్తీక్ అంటాడు. ఇలాంటి వాళ్లు నా జీవితంలో నువ్వు, మా అమ్మ, నా కూతురు ముగ్గురు ఉన్నారని కార్తీక్ అంటాడు.
మరోవైపు శౌర్య ఆడుకుంటూ నాన్న వాళ్లు ఇప్పుడే రారు. రాత్రి వరకు వస్తారని అంటుంది. ఇంతలో స్కూటీపై కార్తీక్, దీప వస్తారు. శివ నారాయణ స్కూటిని గిఫ్ట్‌గా ఇచ్చారని చెబుతారు. ముసలితాత మంచోడుగా అని శౌర్య అంటుంది. తర్వాత స్కూటీతో కార్తీక్, దీప పోజు ఇస్తారు. అది వీడియో, ఫొటోలు తీస్తుంది శౌర్య. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper



