...
...
Next Story

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కిందపడిపోయిన కాంచన- కార్తీక్‌కు నిజం చెప్పకుండా దీపను అడ్డుకున్న జ్యోత్స్న- దశరథ్ సాయం!

కార్తీక దీపం 2 సీరియల్ జూన్ 26 ఎపిసోడ్‌లో బూజు దులుపుతు కిందపడిపోతుంది కాంచన. తను కిందపడినట్లు కార్తీక్‌కు కాంచన కాల్ చేస్తే దీప లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. దీపకు ఏడుస్తూ జరిగింది చెబుతుంది కాంచన. ఆ విషయాన్ని కార్తీక్‌కు చెప్పడానికి దీప ట్రై చేస్తే జ్యోత్స్న అడ్డుకుంటుంది.

Published on: Jun 26, 2025, 08:29:59 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో దీపపై పారిజాతం దొంగతన వేయడం, కార్తీక్ తిప్పికొట్టడంపై అనసూయ మెచ్చుకుంటుంది. నీ మేనకోడలు ఏమో పని మనిషిని చేసింది. నీ పిన్నేమో దొంగను చేసింది అని అనసూయ అంటుంది. దాంతో నా మేనకోడలు అని నన్ను దెప్పుతున్నట్లు ఉందని అలుగుతుంది కాంచన. నాకు మేనకోడలు అంటే దీపనే గుర్తుకు వస్తుందని కాంచన అంటుంది.

అవమానాలు పడుతూ

కార్తీక దీపం 2 సీరియల్ జూన్ 26వ తేది ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ జూన్ 26వ తేది ఎపిసోడ్

వాళ్లు తీసిన గుంతలో వాళ్లే పడతారు. లేకుంటే నేను పడేసే రకం అని కార్తీక్ అంటాడు. ఇన్ని అవమానాలు పడుతూ వాళ్ల ఇంట్లో ఉండటం దేనికి, ఏం సాధించడానికి. జ్యోత్స్న పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోతుంది. లేదా ఇక్కడే ఉండి అజమాయిషీ చెలాయిస్తుంది అని కాంచన అంటుంది. దీప అసలైన వారసురాలు. అది బయటపెట్టడానికే ఇదంతా అని కార్తీక్మనసులో అనుకుంటాడు.

మీ భవిష్యత్తు ఏంటో మాకు తెలియాలి కదే అని అనసూయ అంటే నా భవిష్యత్తు బావే. నా కూతురు, మీ భవిష్యత్తు కూడా బావే అని దీప అంటుంది. తర్వాత కారు తుడుస్తుంటాడు కార్తీక్. జ్యోత్స్న వచ్చి మాట్లాడుతుంది. దొంగతనం పేరు చెప్పి సెటైర్లు వేస్తాడు కార్తీక్. నీకు నీ భార్యకు బాధేంటో చూపించాను బావ అని జ్యోత్స్న అంటుంది. నువ్ చాలా పెద్ద తప్పులు చేశావ్ అవన్నీ టైమ్ వచ్చినప్పుడు అందరికీ వినపడేలా చెబుతా అని కార్తీక్ అంటాడు.

బయటకు వెళ్లాలి కారు తీయ్ అని జ్యోత్న్న అంటే నీకు చెబితే అర్థం కాదు. ఉందే పీత బుర్ర అని గాలిలోకి చూస్తూ నర్సమ్మతో మాట్లాడుతున్నాను అని కార్తీక్ అంటాడు. కారు తీయమని గట్టిగా జ్యోత్స్న అంటే పెట్రోల్ లేదు రూట్ గురించి చెబుతూ విసిగిస్తాడు కార్తీక్. దాంతో ఇరిటేట్ అవుతుంది జ్యోత్స్న. పెట్రోల్ కొట్టించుకుని రమ్మని అనడంతో కార్తీక్ వెళ్లిపోతాడు.

కిందపడిన కాంచన

ఆ ఫోన్ దీప లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. కాంచన ఏడుస్తూ కిందపడిపోయినట్లు చెబుతుంది. రక్తం కూడా వస్తుంది. కళ్లు కూడా తిరుగుతున్నాయని దీప దీప అంటూ కిందపడిపోతుంది కాంచన. బావకు చెప్పాలి అని దీప వెళ్తుంటే.. జ్యోత్స్న అడ్డుకుంటుంది. ఏమైందని అడిగితే దీప జరిగింది చెబుతుంది. నువ్వు చెప్పేది అబద్ధమూ నిజమో తెలియకుండా ఉందని జ్యోత్స్న అంటుంది.

నువ్ చెప్పింది నిజమని తేలాలి అని జ్యోత్స్న అంటే మళ్లీ కాల్ చేస్తుంది దీప. కానీ, స్విచాఫ్ వస్తుంది. దాంతో అస్సలు నమ్మదు జ్యోత్స్న. పారిజాతం వచ్చి ఏమైందని అడుగుతుంది. ఇంతలో కార్తీక్ వస్తాడు. దీప వెళ్తుంటే జ్యోత్స్న అడ్డుకుని నేను ఆఫీస్‌కు వెళ్లాలి. దీన్ని బయటకు రాకుండా ఆపు అని పారిజాతంకు చెబుతుంది జ్యోత్స్న. ఇంతకీ ఏమైందని పారు అంటే బావ అమ్మగారు కిందపడిపోయారని దీప చెబుతుంది.

వెళ్లిపోయిన కార్తీక్

ఆ మాటలు దశరథ్ వింటాడు. అదంతా అబద్ధం గ్రానీ అని జ్యోత్స్న అంటుంది. దీప బయటకు రాకుండా ఆపు అని జ్యోత్స్న వెళ్లిపోతుంది. పారు ఆపుతుంది. కార్తీక్‌ను కూడా హడావిడిగా బయటకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంది జ్యోత్స్న. మేము చెప్పేది మీరు నమ్మరు కానీ అని పారు చేయి వదులుకుని బయటకు వస్తుంది దీప. కారులో కూర్చొన్న కార్తీక్‌కు మాటలు వినపడకుండా ఉండేందుకు సాంగ్స్ పెద్దగా పెడుతుంది.

దాంతో కార్తీక్ వెళ్లిపోతాడు. కాంచనను చూసుకోడానికి అనసూయ ఉంటుంది కదా. ఏమైనా అయితే తనకు కాల్ చేయాలి కదా. ఏం అర్థం కావడం లేదను. ఇప్పుడు పిన్నితో గొడవ పడటం కంటే కాంచనను కాపాడం బెటర్ అని దశరథ్అనుకుంటాడు. ఇంతలో దీప చూస్తే నేనున్నాను హామీ ఇచ్చినట్లు సైగ చేసి సాయం చేసేందుకు కారులో వెళ్లిపోతాడు దశరథ్. తర్వాత జ్యోత్స్నకు కాల్ చేస్తే బావకు అర్థం అవుతుంది అని కాల్ చేస్తుంది దీప.

జ్యోత్స్నకు కాల్ వస్తే ఏంటీ గౌతమ్ బ్రోనా. అవతలి వాళ్లు ఎంత టెన్షన్‌లో ఉన్నారో మాట్లాడు అని కార్తీక్ అంటాడు. ఒకవేళ దీప చెప్పింది నిజమైతే నా శత్రువుల లిస్ట్ నుంచి ఒకరు పోతారు. అప్పుడు బావకు దగ్గర కావడానికి సులువు అవుతుందని జ్యోత్స్న అనుకుంటుంది. జ్యోత్స్న లిఫ్ట్ చేయకపోవడంతో ఛ.. సైలెంట్‌లో పెట్టినట్లుందని దీప అనుకుంటుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks