కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: ఉంగరాలు దాచేసిన జ్యోత్స్న.. పాపం పారిజాతం బలి.. లాస్ట్ లో అదిరే ట్విస్ట్ ఇచ్చిన కార్తీక్

కార్తీక దీపం 2 సీరియల్ టుడే జూలై 10వ తేదీ ఎపిసోడ్ లో జ్యోత్స్న చేతికి ఉంగరాలు ఇస్తుంది సుమిత్ర. వాటిని దాచేసిన జ్యో.. పారిజాతం తీసుకుందని చెప్తుంది. పారును ఇరికించేస్తుంది. కానీ కార్తీక్ ఉంగరాలతో ట్విస్ట్ ఇస్తాడు. ఇంకా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇక్కడ చూసేయండి. 

Jul 10, 2025, 07:19:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ లో ఎంగేజ్మెంట్ రింగులను సుమిత్రకు ఇస్తాడు కార్తీక్. పారిజాతాన్ని కాసేపు ఆడుకుంటాడు. అందరి ముందు పరువు తీసేస్తాడు. దీంతో దీప నవ్వుకుంటుంది. ఈ ఉంగరాలు ఎందుకు తీసుకు వచ్చావు అని కార్తీక్ ను అడుగుతుంది దీప. నువ్వేం భయపడకు, భయపడాల్సిన వాళ్లు వేరే ఉన్నారని కార్తీక్ అంటాడు.

కార్తీక దీపం 2 సీరియల్ టుడే జూలై 10 ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 సీరియల్ టుడే జూలై 10 ఎపిసోడ్ (jiohotstar)

ఎవరూ ఆపలేరు

గౌతమ్ ను రెచ్చగొట్టి దీపను చంపాలనుకున్న దాన్ని, మ్యారేజ్ పోస్ట్ పోన్ చేయించలేనా అని కాల్ చేసేందుకు ట్రై చేస్తుంది జ్యోత్స్న. ఇంతలో సుమిత్ర తీసుకొచ్చిన ఎంగేజ్మెంట్ రింగ్స్ చూసి జ్యో షాక్ అవుతుంది. మరోసారి ఎలాంటి ఆటంకం జరగొద్దని, భద్రాచలంలో పూజలు చేయించిన ఉంగరాలు ఇవి. ఇక మీ నిశ్చితార్థాన్ని ఎవరూ ఆపలేరు. ఒకసారి చూసి నచ్చాయో లేదో చెప్పు అని సుమిత్ర అంటుంది. నువ్వు ఎంగేజ్మెంట్ అనగానే భయపడుతున్నావు కదూ అని సుమిత్ర అనగానే జ్యో కంగారు పడుతుంది.

ఉంగరాలు జాగ్రత్త

నిశ్చితార్థం అంటే ఎన్నో భయాలుంటాయి. కానీ నీ పెళ్లి గౌతమ్ తో జరుగుతుంది. నువ్వు లేని పోని భయాలు పెట్టుకుని కంగారు పడకు. ముందు ఉంగరాలు ఎలా ఉన్నాయో చెప్పు అని సుమిత్ర అడుగుతుంది. మీకు నచ్చాయి కదా నాకు నచ్చినట్లే అని జ్యో అనగానే సుమిత్ర మురిసిపోతుంది. ఆ ఉంగరాలు జాగ్రత్త, మరోసారి మనవైపు నుంచి ఏ తప్పూ జరగకూడదు అని సుమిత్ర చెప్పి వెళ్లిపోతుంది. ఆ ఉంగరాలు చూస్తూ నేను అనుకున్నట్లుగా జరగాలి అని అనుకుంటుంది జ్యో.

ఇక గౌతమ్ తో ఫోన్లో మాట్లాడుతూ వస్తాడు కార్తీక్. మీరు ఇంత క్లోజ్ ఎప్పుడు అయిపోయారో నాకు అర్థం కాలేదు అని శివన్నారాయణ అంటే.. వీడు మంచోడు డాడీ అని కార్తీక్ గురించి దశరథ్ చెప్తాడు. మంచోళ్లు మారిపోతారు డాడీ అంటూ మధ్యలో వస్తుంది జ్యో. నాతో ఉంగరాలు పంపించాడు కదా అవి ఎలా ఉన్నయో అడగడానికి జ్యోత్స్నకు కాల్ చేశాడంటా, కానీ ఆమె లిఫ్ట్ చేయకపోవడంతో నాకు కాల్ చేశాడు అని కార్తీక్ అంటాడు.

పారు పేరు

మధ్యలో పారిజాతం మాట్లాడుతుంది. మా ఇంట్లో మాటలు భార్యలు వింటారు అని పారిజాతాన్ని ఇరకాటంలో పెడతాడు కార్తీక్. ఈ మాటతో పారును తిట్టేస్తాడు శివన్నారాయణ. ఉంగరాలు చేతిలో పట్టుకుని నచ్చాయి అంటే వీడియో తీసి గౌతమ్ కు పంపిస్తా అని కార్తీక్ అంటాడు. ఆ ఉంగరాలు తీసుకురా అని జ్యోకు చెప్తుంది సుమిత్ర. ఆ ఉంగరాలు లేవు మమ్మీ అని జ్యో అంటుంది. నా దగ్గర ఉంటే పోతాయని నువ్వే కదా ఉంగరాలు తీసుకుంది అని పారును మధ్యలోకిి లాగుతుంది జ్యో.

నింద వేసి

మమ్మీ నాకు ఉంగరాలు ఇచ్చిన తర్వాత నువ్వు నా రూమ్ కు వచ్చావు కదా. అప్పుడే ఇవి చాలా ఇంపార్టెంట్ రింగ్స్ నీ దగ్గర ఉంటే పారేసుకుంటావని, నేను దాస్తానని తీసుకున్నావు అని జ్యోత్స్న అంటుంది. నువ్వే తీసేశావు అంటూ జ్యో మళ్లీ అదే మాట చెప్తుంది. నింద మనమీద వేయాలి కదా అని దీప అంటే.. మన మీద వేస్తే ఎవరూ నమ్మరు, అదే పారు అయితే మనవరాలి కోసం తిట్లు అయినా తింటుంది అని కార్తీక్, దీప గుసగుసలు పెడతారు. నువ్వు ఒక పని చేయు మరదలా అంటూ దీపకు ఏదో చెప్తాడు కార్తీక్.

సెంటిమెంట్ రింగ్స్

ఏంటీ ఎంగేజ్మెంట్ రింగ్స్ పోయాయా? అని కార్తీక్ గట్టిగా అంటాడు. ఉంగరాలు పారేశావా? అవి మామూలు ఉంగరాలు కూడా కావు. గౌతమ్ వాళ్ల అమ్మకు సెంటిమెంట్ ఉంగరాలు. అవి పోయాయని ఆమెకు తెలిస్తే ఏమైనా ఉందా? ఎంగేజ్మెంట్ ఆపండని అంటుంది. అంటే ఎంగేజ్మెంట్ జరగడం నీకు ఇష్టం లేదా పారు అని కార్తీక్ అంటాడు. నాకేం తెలియదు అని పారు అంటే.. నువ్వే తీశావని జ్యో చెప్తుంది. నీ ఎంగేజ్మెంట్ ఆపడానికి నన్ను బలి చేస్తున్నావా? అని పారు అనుకుంటుంది.

జ్యోకు షాక్

శత్రువులు మీకు ఇంట్లోనే ఉన్నారు అని శివన్నారాయణను రెచ్చగొడతాడు కార్తీక్. బ్రో కు కాల్ చేసి ఉంగరాలు పోయాయని చెప్తా అని కార్తీక్ అంటాడు. పదే పదే గౌతమ్ భార్య అని జ్యోకు చిరాకు తెప్పిస్తాడు కార్తీక్. ఉంగరాలు తీసుకొస్తావా? లేదా అని పారుపై శివన్నారాయణ ఫైర్ అవుతాడు. ఉంగరాలు లేవంటే పెద్ద మేడం ఎంగేజ్మెంట్ ఆగినట్లే అని కార్తీక్ అంటే.. ఆగదు బావ అని దీప వస్తుంది. పారిజాతం ఉంగరాలు నాకు ఇచ్చారని బాక్స్ తీసి ఇస్తుంది. దీంతో జ్యోకు షాక్ తప్పదు.

ఉంగరాలు టెడ్డీ బేర్ లో పెడితే దీప చేతికి ఎలా వచ్చాయని జ్యో అనుకుంటుంది. దీప నీ జీవితంలో ఇంత కాస్ట్ లీ ఉంగరాలు చూసి ఉండవని నా చేతిలో పెట్టారు అని పారుతో దీప అంటుంది. పారుపై శివన్నారాయణ ఫైర్ అవుతాడు. సుమిత్ర ఆ ఉంగరాలు నీ దగ్గరే పెట్టుకో, నిశ్చితార్థం వరకూ వాటి బాధ్యత నీదే అని శివన్నారాయణ చెప్తాడు. దీప చేతిలో నుంచి సుమిత్ర ఉంగరాలు తీసుకుంటుంది. కొన్ని జరగాలంటే కొంత బాధ భరించాలి దీప, మనం కొట్టిన దెబ్బకు జ్యోత్స్న కంగారు పడుతుంది అని కార్తీక్ అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More