కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: జ్యోత్స్న చేయి నలిపేసిన గౌతమ్.. కాంచన ఇంటికి వెళ్లిన సుమిత్ర.. కాఫీ ఇవ్వని దీప
కార్తీక దీపం 2 సీరియల్ టుడే జూలై 14వ తేదీ ఎపిసోడ్ లో జ్యోత్స్న గదికి వెళ్తాడు గౌతమ్. ఆమె చేయిని పిసికేస్తాడు. మరోవైపు కాంచన ఇంటికి దశరథ్, సుమిత్ర కలిసి వెళ్తారు. తన కూతురు నిశ్చితార్థానికి రమ్మని ఆహ్వానిస్తారు. ఇంకా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇక్కడ చూసేయండి.
కార్తీక దీపం 2 సీరియల్ టుడే జూలై 14వ తేదీ ఎపిసోడ్ లో శివన్నారాయణ ఇంట్లో జరిగింది గుర్తు చేసుకుంటూ కార్తీక్, దీప స్కూటీపై వెళ్తారు. మధ్యలో మొక్కజొన్న పొత్తుతో కార్తీక్ ను కూల్ చేయాలని చూస్తుంది దీప. అత్త చీర తీసుకుని అమ్మకు ఇవ్వమంటే ఇవ్వొచ్చుగా అని దీప మీద కాస్త కోపం చూపిస్తాడు కార్తీక్. నీ మీద కోపాన్ని మా అమ్మ మీద అత్తయ్య ఎందుకు చూపించాలి? ఇక శివన్నారాయణకు ఈగో అని కార్తీక్ అంటాడు. అయిపోయింది వదిలేయ్ అని దీప చెప్తుంది.

జ్యో రూమ్ లో గౌతమ్
కార్తీక్ ను కూల్ చేస్తుంది దీప. నువ్వు అందగాడివి బావ అని అంటుంది వంటలక్క. మరోవైపు దీప జడలో కార్తీక్రోజా పెట్టడం గుర్తు చేసుకుంటూ జ్యోత్స్న మండిపోతుంది. అప్పుడే గౌతమ్ తన గదిలోకి రావడంతో జ్యో షాక్ అవుతుంది. ప్రైవేటుగా మాట్లాడదామని వచ్చా అని చెప్పి జ్యో చేయి పట్టుకుంటాడు గౌతమ్. కంగారు పడ్డ జ్యో.. పారిజాతాన్ని రమ్మని మెసేజ్ చేస్తుంది. నీ కోసం నేను దీపను కూడా చంపాలనుకున్నా. కానీ బతికేసింది. మన పెళ్లి ఫిక్స్ అయిపోయింది కాబట్టి చంపే వీలు లేదు అని గౌతమ్ అంటాడు.
ప్లాన్ ప్రకారమే
పారుకు కాల్ చేస్తుంది జ్యోత్స్న. వెంటనే వెళ్లాలని పారు అనుకుంటే, శివన్నారాయణ అడ్డుకుంటాడు. ఇటు జ్యో చేయిని నలిపేస్తూ రింగ్స్ నచ్చాయా? అని గౌతమ్ అడుగుతాడు. సరదాగా అలా బయటకు వెళ్దామా అంటాడు. అప్పుడే కాఫీ పట్టుకుని పారు ఎంట్రీ ఇస్తుంది. వెరైటీ వంటకాలు చేస్తున్నానని పారు చెప్పడంతో గౌతమ్ వెళ్లిపోతాడు. ఎంగేజ్మెంట్ చెడగొట్టే ప్లాన్ ప్రకారమే ముందుకు వెళ్దాం. కాశీ ఎంత వరకు వివరాలు తీసుకున్నాడో చూద్దాం అని జ్యో అంటుంది.
కాంచన సంతోషం
కాంచన దగ్గరకు దశరథ్, సుమిత్ర వెళ్తారు. అన్నయ్య వదిన నాతో మాట్లాడింది అంటూ కాంచన సంతోషంలో తేలిపోతుంది. ఎవరి వల్లో మన మధ్య గొడవలు వచ్చాయి కానీ మనం ఎప్పుడూ పౌరుషంగా మాట్లాడుకోలేదు అని సుమిత్ర అంటుంది. ఎవరో ఏదో అంటే ఇంటి పడుచును దూరం పెడతారా అని అనసూయ అడుగుతుంది. అందుకు కారణం నీ మేనకోడలే. లేదంటే కాంచన నేను తోబుట్టువుల్లా ఉండేవాళ్లం అని సుమిత్ర అంటుంది.
పరాయి దాన్నే
మరి ఇప్పుడెందుకు వచ్చావు అత్తా అని కార్తీక్ అంటే.. కాంచన ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మధ్యలో దశరథ్ మనం వచ్చిన పని ఏంటీ అని గుర్తు చేస్తాడు. నేను కొందరికీ పరాయి దాన్నే అన్నయ్య అని కాంచన అంటే.. నన్నే కదా ఈ మాట అన్నావని సుమిత్ర బాధ పడుతుంది. నీ మనసు గాయపడేలా నేనెప్పుడైనా మాట్లాడానా? నువ్వు నేను వేరు అని నేనెప్పుడూ అనుకోలేదు. తప్పు చేశానంటే కొట్టు వదిన అని కాంచన చేతులతో చెంపలపై కొట్టుకుంటూ ఏడుస్తుంది సుమిత్ర.
డ్రైవర్ తల్లిలా
ఆ సీన్ చూసి దీప, కార్తీక్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటారు. సుమిత్ర చేతితో టాబ్లెట్ ఇస్తే కాంచన వద్దంటుంది. టాబ్లెట్స్ వాడకపోతే నేనేమైనా చచ్చిపోతా అనుకున్నావా? నా గుండెకు తట్టుకుని నిలబడే శక్తి ఉందన్నయ్యా. నా తండ్రి నన్నొక డ్రైవర్ తల్లిలా చూసి వెళ్లిపోయాడంటే ఆ రోజే చచ్చిపోవాలి. నా మేనకోడలి పెళ్లి చేయాల్సిందాన్ని. ప్రేమగా పిలవడానికి వచ్చారు ఇది చాలు అన్నయ్య. ఆడదానికి కష్టం వస్తే చెప్పుకునేది అమ్మనాన్న తర్వాత అన్నయ్యకి అని కాంచన బాధపడుతుంది.
అనసూయ కాఫీ
వదిన మన మధ్య జరిగింది మర్చిపో. మనలో మనం సర్దుకుపోవాలి. కలిసిపోవాలి. నిశ్చితార్థానికి రా. మామయ్యతో మాట్లాడి చూస్తాం అని సుమిత్ర అంటుంది. నేనూ ఆ తండ్రికే పుట్టా. కానీ నాన్నకు నీ మీద ఉన్నంత ప్రేమ నా మీద లేదు. మనం మాటలు ఇచ్చుకున్నంత తేలికగా పిల్లలు మనసులు ఇచ్చుకోలేరు కదా అని కాంచన అంటుంది. అనసూయ కాఫీ తీసుకొస్తే దీపను పిలుస్తుంది కాంచన. దీప రాదు, ఆమె కాఫీ ఇస్తే మీ వదిన తీసుకోదని అనసూయ అంటుంది.
అమ్మగారు కాదు
అయినా దీప అని పిలుస్తుంది కాంచన. కాఫీ గ్లాసులు తీసుకో, మా అన్నయ్య వదినకు ఇవ్వు. కాఫీ ఎందుకు తీసుకోవడం లేదు అని సుమిత్రను అడుగుతుంది కాంచన. దీప నా ఇంటి యజమాని. నా ఇంటి కోడలు. దీప నువ్వు అమ్మగారు అని పిలుస్తావేంటీ? వరుసకు చిన్నమ్మ అవుతుంది అని కాంచన అంటుంది. కానీ ఈ మనిషి కోసం ఒక్క మెట్టు కూడా దిగను. నా తరపు నుంచి ఆహ్వానం కూడా లేదు. ఆమె వస్తే నిశ్చితార్థం జరగదేమో అనే భయం కూడా ఉంది అని సుమిత్ర చెప్తుంది.
పట్టుచీరతో ఆహ్వానం
ఓ వైపు చెల్లి, మరోవైపు భార్య. ఎవరినీ నిందించలేను. ఎవరినీ సమర్థించలేను. నా తండ్రి ముందు తలదించుకునే పరిస్థితి తీసుకు రాకండి. నా కూతురు నిశ్చితార్థానికి రావాలి కాంచన అని దశరథ్ అంటాడు. కాంచనకు బొట్టు, చీర పెట్టి ఆహ్వానిస్తుంది సుమిత్ర. నువ్వు ఈ పట్టుచీర కట్టుకునే రావాలి అని సుమిత్ర అంటుంది. దీప నా ఇంటి కోడలిగా మా వదినకు కుంకమ పెట్టు అని కాంచన అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper



