కార్తీక దీపం 2 టుడే జూలై 16వ తేదీ ఎపిసోడ్ లో కాశీ గురించి జ్యోత్స్నతో మాట్లాడుతుంది దీప. దాసు బాబాయికి గతం గుర్తుకొచ్చిందని విన్నా అని జ్యోత్స్నను టెన్షన్ పెడుతుంది దీప. బాబాయిని కొట్టిన వాళ్లే నన్ను చంపాలని అనుకోవచ్చు, దశరథ్ ను షూట్ చేయొచ్చు కదా అని దీప అంటుంది. మా డాడీని షూట్ చేసింది నువ్వే అని అందరికీ తెలుసులే అని జ్యో అంటుంది. నిజాలు మట్టిలో పాతిన విత్తనాల్లాంటివి అవి ఏదో ఒక రోజు మొలకలై బయటకు వస్తాయని దీప వార్నింగ్ ఇచ్చినట్లు చెప్తుంది. తప్పుల నుంచి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది. మన తల్లిదండ్రులు మనల్ని కన్నందుకు బాధపడకూడదు. అలాంటి పరిస్థితి నీ తల్లిదండ్రులకు రానివ్వకు అని దీప వెళ్లిపోతుంది.
స్వప్న డ్రామా

దశరథ, సుమిత్ర నీ కన్నవాళ్లు, నా కన్నవాళ్లు కాదు. నేను గౌతమ్ తో పెళ్లి నుంచి బయటపడతాను కానీ నింద నీ మీద పడేలా చేస్తాను. నేను బతుకుతుంది నా కోసమే. నా హ్యాపీనెస్ కోసం ఎవరు చచ్చినా సరే పట్టించుకోను అని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. మరోవైపు కాశీ రావడం చూసి కావేరితో గౌతమ్ తో జ్యోత్స్నకు జరగాల్సిన ఎంగేజ్మెంట్ ఒకసారి ఆగిపోయింది కదా అని స్వప్న అంటుంది. అది విని స్వప్న తెలిసే అంటుందా అని కాశీ అనుకుంటాడు. అప్పుడందరూ దీప వదినదే తప్పని అన్నారు కదా. రెండో సారి వదినకు ఏం కాకూడదు అనే నా భయం. గౌతమ్, జ్యోత్స్నకు త్వరలోనే ఎంగేజ్మెంట్ అని స్వప్న చెప్తుంది.
కాశీ షాక్
ఆ గౌతమ్ ను మాత్రం జ్యోత్స్న చేసుకోకూడదు. గౌతమ్ కాదు జ్యోత్స్న కూడా ఫ్రాడ్ అని కావేరి అంటుంది. ఈ పెళ్లి, నిశ్చితార్థాలు అంతా ఒక నాటకం. గౌతమ్ చెడ్డవాడని జ్యోత్స్నకు తెలుసు. కానీ ఆ విషయం దీపకు తెలియదు. దీపను కార్తీక్ జీవితంలో లేకుండా చేయడానికి తన నిశ్చితార్థం చెడగొట్టుకుని ఆ నిందను దీపపై వేసింది. ఒక రెస్టారెంట్లో జ్యోత్స్న, పారిజాతం మాట్లాడుకున్న మాటలు విన్నా. కార్తీక్ జీవితంలో దీప లేకుండా చేసేందుకే జ్యోత్స్న మళ్లీ ఎంగేజ్మెంట్ నాటకం ఆడుతుందని కావేరి చెప్తుంది.
ఈ మాటలన్నీ బయట నుంచి విన్న కాశీ షాక్ అవుతాడు. జ్యోత్స్నను అమాయకంగా నమ్మానా? అని అనుకుంటాడు. అంటే ఈ పెళ్లి జరగదు అంటావా అని స్వప్న అడిగితే.. ఈ పెళ్లి జరగదు, దీపను ఇంటి నుంచి వెళ్లగొట్టడమే వాళ్ల లక్ష్యం. ఈ సారి దీపను ఏ రకంగా చెడ్డదాన్ని చేయబోతున్నారో అని భయంగా ఉందని కావేరి అంటుంది. జ్యోత్స్న అక్క మాటలు విని తప్పు చేశాను. ఇప్పుడు నేనేం చేయాలి అని అనుకుని లోపలికి వెళ్లిపోతాడు కాశీ. అన్నయ్య చెప్పినట్లు కాశీ వినేలా చేశాను అని స్వప్న అనుకుంటుంది.
నోరు జారిన పారు
{{/usCountry}}ఈ మాటలన్నీ బయట నుంచి విన్న కాశీ షాక్ అవుతాడు. జ్యోత్స్నను అమాయకంగా నమ్మానా? అని అనుకుంటాడు. అంటే ఈ పెళ్లి జరగదు అంటావా అని స్వప్న అడిగితే.. ఈ పెళ్లి జరగదు, దీపను ఇంటి నుంచి వెళ్లగొట్టడమే వాళ్ల లక్ష్యం. ఈ సారి దీపను ఏ రకంగా చెడ్డదాన్ని చేయబోతున్నారో అని భయంగా ఉందని కావేరి అంటుంది. జ్యోత్స్న అక్క మాటలు విని తప్పు చేశాను. ఇప్పుడు నేనేం చేయాలి అని అనుకుని లోపలికి వెళ్లిపోతాడు కాశీ. అన్నయ్య చెప్పినట్లు కాశీ వినేలా చేశాను అని స్వప్న అనుకుంటుంది.
నోరు జారిన పారు
{{/usCountry}}పారిజాతానికి శ్రీధర్ ఫోన్ చేస్తాడు. నీ తలతిక్క మనవరాలికి ఎంగేజ్మెంట్ అంట కదా. ఆ గౌతమ్ వెధవ అని పబ్లిక్ టాక్. శివన్నారాయణ అల్లుడికి ఇంత వరకూ ఆహ్వానం అందలేదని శ్రీధర్ అంటాడు. నువ్వు వచ్చిన రాకపోయినా ఈ నిశ్చితార్థం జరగదు అల్లుడూ అనుకుంటూ హాల్లోకి వెళ్లుంది పారు. అక్కడ శివన్నారాయణ, దశరథ్, కార్తీక్ ఉండటం చూసి కంగుతింటుంది. పారు ఏమంది పెద్ద సారు అని కార్తీక్ మరింత రెచ్చగొడతాడు. గ్రానీ ఏదో తెలియక మాట్లాడిందని మధ్యలో జ్యో వస్తుంది. మీ శ్రీధర్ మామయ్యకు కాల్ చేసి నిశ్చితార్థం జరగదని చెప్పిందంటా. మేం సంతోషంగా ఉండటం మీకు ఇష్టం లేదా? అని సుమిత్ర అడుగుతుంది.
నిశ్చితార్థం జరుగుతుంది
నిశ్చితార్థం ఎందుకు జరగదో చెప్పు అని శివన్నారాయణ గద్దిస్తాడు. వెనకాల ఏ ప్లాన్ చేయడం లేదు కదా అని కార్తీక్ అంటాడు. వీళ్లు అల్లుడు వీళ్లు ఒకటైపోయి ఏదో ప్లాన్ చేస్తున్నారేమో పెద్ద సారు అని కార్తీక్ అంటే.. పారును కూడా బయటకు గెంటేస్తానని శివన్నారాయణ అంటాడు. ఆ శ్రీధర్, నువ్వు ఏదైనా చేస్తున్నారా? అని పారును ప్రశ్నిస్తాడు శివన్నారాయణ. కాళ్లు పట్టుకుంటే దొంగ నాటకాలు ఆపు. ఎవరు ఏం చేసినా ఈ నిశ్చితార్థం ఆగదు అని శివన్నారాయణ స్పష్టం చేస్తాడు. పారు వల్ల ఆగితే నీకు నెక్ట్స్ బర్త్ డే ఉండదు అని చెప్పి శివన్నారాయణ వెళ్లిపోతాడు.
నలుగురు కలిసి
ఈ నిశ్చితార్థం జరగాలి. లేదంటే సుమిత్ర తట్టుకోలేదు అని కార్తీక్ చెప్పి వెళ్లిపోతాడు దశరథ్. జ్యోత్స్నకు వేరే ట్రీట్మెంట్ ఇవ్వాలని కార్తీక్ అనుకుంటాడు. కార్తీక్, దీపకు సారీ చెప్తాడు కాశీ. డబ్బులు ఎందుకు అడగలేదు అని దీప అంటుంది. నీ అవకాశాన్ని వాడుకుని నీ ద్వారా అక్కను మోసం చేయాలని జ్యో అనుకుంది. ప్రాబ్లెం వచ్చినప్పుడు మాకు చెప్పాలని కార్తీక్ అంటాడు. సారీ బావా తప్పంతా నాదే. ఇప్పుడు ఏం చేయమంటావో చెప్పు బావ అని కార్తీక్ అంటాడు. కాశీకి డబ్బులు ఇస్తాడు కార్తీక్. మనం నలుగురం ఒక్కటిగా వర్క్ చేయాలి. కాశీ వాళ్లక్క లాగే అతి మంచోడని కార్తీక్ అంటాడు. మా అక్కకు, నాకు నువ్వే కదా దిక్కు, దేవుడు అని కాశీ చెప్తాడు.
మనం అందరం కలిసి ఉండటం కోసమే ఈ కష్టాలన్నీ. సైన్యం రెడీ బావ, యుద్ధం ఎప్పుడూ అని దీప అడుగుతుంది. జ్యోత్స్నకు కొంచెం కూడా తప్పించుకునే ఛాన్స్ ఇవ్వకూడదు అని కార్తీక్ అనడంతో నేటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ముగుస్తుంది.