కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కార్తీక్ సర్‌ప్రైజ్..దాసు ఎంట్రీతో జ్యోత్స్న మైండ్‌బ్లాక్..నిజం చెప్పేస్తాడేమోననే భయం
కార్తీక దీపం 2 సీరియల్ టుడే జూలై 17వ తేదీ ఎపిసోడ్ లో ఎంగేజ్మెంట్ ఆగిపోవాలని జ్యోత్స్న అనుకుంటుంది. కానీ కార్తీక్ సర్ ప్రైజ్ ఇస్తాడు. దాసు మళ్లీ శివన్నారాయణ ఇంటికి రావడంతో జ్యో మైండ్ బ్లాక్ అవుతుంది. ఇంకా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇక్కడ చూసేయండి.
కార్తీక దీపం 2 టుడే జూలై 17వ తేదీ ఎపిసోడ్ లో పారిజాతంపై ఫైర్ అవుతుంది జ్యోత్స్న. తాత నువ్వు డైరెక్ట్ గా అడిగినప్పుడు చెప్పేయ్ అని సైగ చేస్తే చెప్పొద్దు అని అర్థమైందా? గౌతమ్ మంచివాడు అని చెప్పిందే నేను, ఇప్పుడు చెడ్డవాడు అని చెప్తే దీప మంచిది అని అర్థమవుతుంది. ఎలాగైనా ఈ ఎంగేజ్మెంట్ ఆగిపోవాలి అని జ్యో అంటుంది.

చంపేస్తుంది
కాశీ విషయంలో జ్యోత్స్న తీరు చూశాక ఆ మనిషి మీద జాలి పడటం అనవసరం బావ అని కార్తీక్ తో అంటుంది దీప. అది ముందే చెప్పానని కార్తీక్ అంటాడు. కాశీని అడ్డుపెట్టుకుని ఎంగేజ్మెంట్ ఆపాలనుకున్నావని నాకు తెలుసు. దాసు బాబాయి కూతురివి అని కూడా తెలుసు. నిజాలు ఒప్పుకో అని జ్యోత్స్నను బెదిరించు అని దీప చెప్తుంది. అప్పుడు పారుతో సహా అందరినీ జ్యోత్స్న చంపేస్తుంది. నీ మీద కేసు పెట్టి జైలులో పెట్టిస్తుంది. ఆస్తులన్నీ అమ్ముకుని విదేశాలకు వెళ్లిపోతుంది అని కార్తీక్ అంటాడు.
ప్రాణాలు తీస్తుంది
జ్యోత్స్నకు చిన్న సర్ ప్రైజ్ రేపు ఇస్తాను అని కార్తీక్ చెప్తాడు. దాని బుద్ధి మార్చమని దీప అడుగుతుంది. జ్యోత్స్సకు, పారుకు ఇద్దరికి కలిపి గట్టిగా ఇవ్వాల్సిందే. మనమూ వాళ్ల రూట్ లో అప్పుడప్పుడూ వెళ్లాల్సిందే అని కార్తీక్ అంటాడు. పొద్దున పారు, జ్యో మాట్లాడుకుంటారు. రైలు దగ్గరకు వస్తుంటే పట్టాలపై దడ దడ అని సౌండ్ వచ్చినట్లు ఇప్పుడు నా గుండె కొట్టుకుంటుందని జ్యో అంటుంది. నిశ్చితార్థం కూడా ట్రైన్ లాగే దూసుకొస్తుంది. పెళ్లి వరకూ వెళ్తే నా పుట్టుక ఎంత మంది ప్రాణాలు తీసిందో, నా పెళ్లి అంతమంది ప్రాణాలు తీస్తుందని జ్యో సీరియస్ గా మాట్లాడుతుంది.
దాసు ఎంట్రీ
జ్యోత్స్న కాఫీ తాగుతుండగా ఆమె నిజమైన తండ్రి దాసు ఎంట్రీ ఇస్తాడు. దాసును చూసి జ్యోత్స్న మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకు వచ్చావు నాన్న అని అడిగితే, నిజాలు చెప్పి నిన్ను తీసుకెళ్లడానికి అని దాసు చెప్తాడు. దాసును చూసి సుమిత్ర, దశరథ, పారు సర్ ప్రైజ్ అవుతారు. శివన్నారయణ గారు అని పిలుస్తూనే ఉంటాడు దాసు. శివన్నారాయణతో ఒక నిజం చెప్పాలి అని ఆయన్ని తీసుకుని గదిలోకి వెళ్తాడు దాసు. బయట ఉన్న జ్యో, పారుకు ఫ్యూజులు ఎగిరిపోతాయి.
రుద్రాక్ష మాల
తాత బయటకు వచ్చి ఎందుకు పిల్లలను మార్చావంటే ఏం చేస్తావు? మన కథ క్లైమాక్స్ కు వచ్చింది గ్రానీ. తప్పించుకోవడానికి రెడీగా ఉండూ అని పారుతో జ్యో అంటుంది. బయటకు వచ్చిన శివన్నారాయణ మెడలో రుద్రాక్ష మాల చూసి అందరూ షాక్ అవుతారు. మీరు ప్రమాదంలో ఉన్నారు. మీ కోసం ఒకటి తీసుకొచ్చాను. కాశీ క్షేమం కోసం కాశీ వెళ్లా. ఇప్పుడు మీ కుటుంబం ప్రమాదంలో ఉంది. అందుకే ఇది మెడలో వేసుకోండి అని గదిలో శివన్నారాయణకు చెప్పి మాల అందిస్తాడు దాసు.
నన్నెవరు కొట్టారు?
దాసు నిజం చెప్పకపోవడంతో జ్యోత్స్న ఊపిరి తీసుకుంటుంది. దాసు నీకంతా గుర్తొచ్చిందా? అని అడుగుతుంది సుమిత్ర. గుర్తొచ్చింది అని చెప్తాడు దాసు. నిన్ను ఎవరు కొట్టారో కూడా నీకు గుర్తుందా అని సుమిత్ర మళ్లీ ప్రశ్నిస్తుంది. నన్నెవరు కొట్టారు? అయినా నన్నెవరు కొడతారు? అని దాసు అనగానే.. ఇప్పటికైతే నేను తప్పించుకున్నా అని జ్యో మనసులో అనుకుంటుంది. నన్ను పంపింది, రప్పించింది కార్తీక్ అని జ్యోను చూస్తూ మనసులో అనుకుంటాడు దాసు.
కాంచన కంగారు
ఇటు తమ ఇంటి వంట గదిలో జ్యో ప్లాన్ గురించి ఆలోచిస్తుంది దీప. జ్యోత్స్న ఎంగేజ్మెంట్ జరగదు అని దీపతో కార్తీక్ అంటే.. అప్పుడే అక్కడికి వచ్చిన కాంచన జరగని పెళ్లికి జ్యోత్స్న ఎందుకు ఒప్పుకుంది? అని ప్రశ్నిస్తుంది. మళ్లీ నిశ్చితార్థం ఆగిపోతే మా నాన్న, అన్నయ్యకు ఏమవుతుంది? నాకు తెలియకుండా ఏదో చేస్తున్నారు. మీరు చేసే దాంట్లో మంచి ఉంటుందని నమ్ముతున్నా. కానీ పెళ్లి విషయంలో మాత్రం నమ్మను గాక నమ్మను.
నన్ను మా పుట్టింటికి తీసుకెళ్లు అక్క అని అనసూయను అడుగుతుంది కాంచన. పోయిన సారి కూడా ఇలాగే చేశావు. కానీ జరిగిందా? మీ నాన్న నీ మాట విన్నాడా? మీ వదిన నీ మాట నమ్మిందా? ఆ గౌతమ్ తో తాళి కట్టించుకోని బలైపోయేందుకు ఆ పారిజాతం మనవరాలు తింగరిది ఏం కాదు అని కార్తీక్ అంటాడు. పారిజాతం మనవరాలు కాదు జ్యోత్స్న మా అన్నయ్య కూతురు అని కాంచన అంటుంది. మామయ్య కూతురు దీప అనే నిజం త్వరలోనే బయటపడుతుంది అమ్మ అని అనుకుంటాడు కార్తీక్.
గౌతమ్ వెధవ. అలాంటి వెధవ కారణంగా నా పుట్టిల్లు బాధపడకూడదు. చెప్పకపోతే నేను దోషిగా నిలబడతాను. మా అన్నయ్య, నాన్న కళ్లలో నీళ్లు తిరిగినా, నీకేదైనా అయినా బాధ పడేది నేను రా అని కాంచన అనడంతో నేటి కార్తీక దీపం2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper













