కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: పుట్టింట్లో అడుగుపెట్టిన దీప - జ్యోత్స్నకు డబుల్ షాక్ - పారిజాతం బ్యాడ్‌టైమ్ స్టార్ట్!
కార్తీక దీపం 2 సీరియల్ మే 29 ఎపిసోడ్‌లో టైమ్ దాటినా కార్తీక్ పనిచేయడానికి ఇంటికి రాకపోవడంతో అతడిని వెతుక్కుంటూ వెళుతుంది జ్యోత్స్న. నా పనివాడి కోసం వచ్చానని కాంచన ముందు బిల్డప్‌లు ఇస్తుంది. కార్తీక్ బాబును నేనే పనికి పంపిస్తానని చెప్పి జ్యోత్స్నకు షాకిస్తుంది దీప.
నా గొంతులో ప్రాణం ఉండగా కార్తీక్ ను నీ దగ్గరకు రానివ్వనని దీప తనతో చేసిన ఛాలెంజ్ గురించి టెన్షన్ పడుతుంది జ్యోత్స్న. నిజంగానే కార్తీక్‌ను తన దగ్గరకు రాకుండా దీప ఎక్కడ అడ్డుకుంటుందోనని భయపడిపోతుంది. నైట్ టూ ఫైవ్ డ్యూటీ చేసే బావ కోసం వెయిట్ చేస్తున్నావా అని జ్యోత్స్నను అడుగుతుంది పారిజాతం.

నా రూల్ ప్రకారం నేను చెప్పినప్పుడు రావాలి...పొమ్మన్నప్పుడు పోవాలి అని జ్యోత్స్న సమాధానమిస్తుంది. నిన్ను సాటిస్‌ఫై చేయడానికి నిన్న వచ్చాడు...ఈ రోజు వస్తాడా ఏంటి? వచ్చేవాడు అయితే ఈ పాటికి రావాలి కదా అని పారిజాతం అంటుంది. నేను అదే చూస్తున్నానని జ్యోత్స్న బదులిస్తుంది.
మీ తాత మీదే గెలిచాడు..
తల వంచాడు కదా అని తగ్గాడు అనుకోకు...మీ తాత మీదే ఛాలెంజ్ చేసి గెలిచాడు అని కార్తీక్ గురించి గొప్పగా చెబుతుంది పారిజాతం. అందుకే కదా పనోడిని చేసింది జ్యోత్స్న అంటుంది. అది ఒక్క రోజు ముచ్చటేనని, కార్తీక్ రాడు అని...దీప రానివ్వదని జ్యోత్స్నతో ఛాలెంజ్ చేస్తుంది పారిజాతం. నా బెట్ వెయ్యి రూపాయలు అని అంటుంది. పారిజాతం మాటలతో కోపం కార్తిక్ ఇంటికి వెళుతుంది జ్యోత్స్న.
కాంచన ఆవేశం...
తమ ఇంటికి వచ్చిన జ్యోత్స్నను చూడగానే కాంచన కోపం పట్టలేకపోతుంది. గేటు దగ్గరే ఆగిపోమ్మని కోపంగా అంటుంది. భగవంతుడు లేచే శక్తి నాకు ఇవ్వలేదు కానీ లేదంటే నీ దవడ పగల గొట్టాలన్నంత కోపం వస్తుందని కాంచన అంటుంది. నువ్వు పంపించిన వీడియోలు చూశానని కాంచన అంటుంది.
జరిగిందే కదా ఆ వీడియోలో ఉందని కూల్‌గా సమాధానమిస్తుంది జ్యోత్స్న. నా కొడుకుతో కాగితాల మీద సంతకాలు పెట్టుకొని కాళ్ల దగ్గర పడేసుకున్నావు...నీలాంటి మేన కోడలు నాకు అవసరం లేదని, ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మని అంటుంది.
నా పనివాడి కోసం వచ్చా...
నీ మేనకోడలిగా వచ్చానంటే నచ్చడం లేదా...నా మేనత్త ముందు నేను తగ్గనని, శివన్నారాయణ మనవరాలిగా మాట్లాడుతానని, యజమానిగా నా పనివాడు అయినా నీ కొడుకును నాతో తీసుకెళ్లడానికి వచ్చానని కోపంగా అంటుంది జ్యోత్స్న.
అప్పుడే అక్కడికి వచ్చిన కార్తీక్...నమస్తే యజమానురాలు అంటూ వెటకారం ఆడుతాడు. పనివాళ్ల కోసం యజమానులు ఇంత దూరం రావడం ఏంటో అని అంటాడు. టైమ్ ఎంత అయ్యింది అని కోపంగాకార్తీక్ను అడుగుతుంది జ్యోత్స్న. అది తెలుసుకోవడానికి ఇంత దూరం వచ్చారా అని కార్తీక్ పంచ్ వేస్తాడు.
కార్తీక్ బాబు వస్తాడు...
భార్యతో షికార్లు నీ టైమ్‌లో చేసుకోవాలి...నాకు కేటాయించిన టైమ్‌లో కాదని కార్తీక్‌పై కోప్పడుతుంది జ్యోత్స్న. పది నిమిషాలు ఆలస్యానికే ఇంత హడావిడి చేయాలా అని కార్తీక్ బదులిస్తాడు, రానని అనుకున్నారా అని అడుగుతాడు. కార్తీక్ బాబు వస్తాడని దీప బదులిస్తుంది. దీప సమాధానం విని కాంచన, అనసూయషాకవుతారు. తనతో కార్తీక్‌ను పంపనని ఛాలెంజ్ చేసి దీప మాట మార్చడంతో జ్యోత్స్న కూడా ఆలోచనలో పడుతుంది.
కారులో వెళ్దామని కార్తీక్‌తో అంటుంది జ్యోత్స్న. ఓనర్ కారులో వెళ్లేంత అదృష్టం నాకు లేదని అంటుంది. సైకిల్‌పై వస్తానని అంటాడు. నిజంగానే వస్తావా నేను మళ్లీ రావాలా అని జ్యోత్స్న అంటుంది. నీకు ఆ అవసరం రాదని, నేనే దగ్గరుండి కార్తీక్‌బాబును పంపిస్తానని జ్యోత్స్నతో అంటుంది దీప. ఇంటికొస్తావు కదా...అక్కడ మాట్లాడుకుందామని కార్తీక్‌తో కోపంగా అంటుంది జ్యోత్స్న. బయల్దేరు అని దీప, కార్తీక్ ఒకేసారి జ్యోత్స్నకు బదులిస్తారు.
కొద్ది రోజులు అడగొద్దు...
అసలు ఏమైంది మీకు...జ్యోత్స్న రమ్మంటే రాను అని చెప్పకుండా కార్తీక్‌ను ఎందుకు పంపించావని దీపను నిలదీస్తుంది కాంచన. కార్తీక్ బాబు అగ్రిమెంట్ రాస్తే మనం రాసినట్లే...ఎందుకు ఏమిటని కొద్ది రోజులు అడగొద్దని కాంచనకు బదులిస్తుంది దీప. ఆ ఇంటికి కార్తీక్‌ను పంపుతాను అనడం వెనుక దీప ఉద్దేశం అని ఆలోచనలో పడుతుంది కాంచన.
పారిజాతానికి పనిష్‌మెంట్..
ఆవేశంగా కార్తీక్ దగ్గరకు వెళ్లిన జ్యోత్స్న ఒంటరిగా తిరిగి రావడం చూసి పారిజాతం జోకులు వేస్తుంది. మన గెంతులు మనింట్లోనేనని, నిన్ను మడతపెట్టి దీప తన్ని ఉంటుంది. ఇక్కడికి వచ్చి పడుంటావని పారిజాతంసెటైర్లు వేస్తుంది. పారిజాతం వేలిని వేడి కాఫీలో ముంచుతుంది జ్యోత్స్న. వేలు కాలడంతో గగ్గోలు పెడుతుంది పారిజాతం. నాపై సెటైర్లు వేస్తే ఇలాగే ఉంటుందని బదులిస్తుంది. శాడిస్ట్‌లా తయరయ్యావని మనవరాలితో అంటుంది పారిజాతం.
ట్రీట్‌మెంట్‌కు షేక్ అవ్వాలి...
ఈ రోజు తాను కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు పారిజాతంతో అంటుంది జ్యోత్స్న. కార్తీక్ లైఫ్‌లో తాను ఉండటం వల్లే ఇన్ని కష్టాలు పడుతున్నాడని, తాను లేకపోతే కార్తీక్‌కు ఏ కష్టం ఉండదని దీప అనుకోవాలి. కార్తీక్‌కు మనం ఇచ్చే ట్రీట్‌మెంట్‌కు అక్కడ దీప గుండె షేక్ అవ్వాలి అని పారిజాతం అంటుంది. అవన్నీ జరగాలంటే నీ హీరో రావాలి కదా అని పారిజాతం అంటుంది.
పనివాళ్లు పేర్లు పెట్టి పిలవొద్దు...
అప్పుడే అక్కడికి కార్తీక్ ఎంట్రీ ఇస్తాడు. పారిజాతాన్ని పారు అని పిలుస్తాడు. పనివాళ్లు పేర్లు పెట్టి పిలవొద్దని శివన్నారాయణ కోపంగా అంటాడు. ఇంతకుముందు నువ్వు నా కూతురు కొడుకువి...ఇప్పుడు నువ్వు దీప మొగుడివి అని అంటాడు. మనుషులు నచ్చకపోతే సంబంధాలు తెగిపోతాయి కానీ బంధాలు తెగిపోవని దశరథ్ అంటాడు.
ఎక్కడున్నా కార్తీక్ నీ మనవడేనని శివన్నారాయణతో అంటాడు. ఎక్కడున్నా వాడికి నువ్వు తాతవేనని అంటాడు. పారిజాతం అడ్డుచెప్పబోతుంది. దాసును నాన్న ఇంట్లో నుంచి పంపించేశాడు కానీ నువ్వు మనసులో నుంచి ఎందుకు పంపించలేదని అడుగుతాడు. పరిస్థితులు మారినా రక్త బంధాల్లోని పిలుపులు మాత్రం మారవని అంటాడు. కాంచన ఎప్పటికైనా నా చెల్లెలే...కార్తీక్ ఎప్పటికీ నా మేనల్లుడే. ఇష్టమైతే ఇష్టంగా...కష్టమైతే కష్టంగా ఈ బంధాలు మోయాల్సిందేనని దశరథ్ అంటాడు.
పనిచేయడానికి వచ్చావా...
ప్రేమలు, అభిమానులు ఒంటిపై బట్టలు కాదు..చూడగానే కనబడటానికి...అవి కూడా ఊపిరి లాంటివే...మనం ఉన్నామంటే అవి కూడా ఉన్నట్లేనని కార్తీక్ అంటాడు. కార్తీక్ మాటలు నచ్చని శివన్నారాయణ...నువ్వు పనిచేయడానికి వచ్చావా...మాటలు చెప్పడానికా అని కోపంతో విరుచుకుపడతాడు.
ఇంట్లోనే డ్యూటీ...
ఇక నుంచి కార్తీక్ డ్యూటీ ఇంట్లోనే అని జ్యోత్స్న అంటుంది. ఇంటిపని అయ్యాకే ఆఫీస్ పనులు చూసుకోవాలని జ్యోత్స్న అంటుంది. నీకు నచ్చినప్పుడు వచ్చి...నచ్చనప్పుడు వెళ్లిపోవడానికి ఇదేం నీ అత్తగారి ఇల్లు కాదు కాదని, నా మనవరాలు నీకు చేసిన సాయానికి రుణం తీరింది అనే వరకు మేము చెప్పింది చేయాల్సిందేనని శివన్నారాయణ అంటాడు. నువ్వు చేసిన తప్పులకు ఇలాంటి శిక్ష పడటమే న్యాయం అని అంటాడు.
దీప ఎంట్రీ...
అన్యాయం అని అక్కడికి వచ్చిన దీప అంటుంది. దీపను చూడగానే జ్యోత్స్న షాకవుతుంది. ఇక్కడ న్యాయం జరగడం లేదని దీప అంటుంది. అడగటానికి నువ్వెవరివి అని దీపను నిలదీస్తుంది సుమిత్ర. అడగటానికి నువ్వెవరివి అని కన్న తల్లే అడుగుతుంటే ఏమని సమాధానం చెప్పగలను అని దీప మనసులో అనుకుంటుంది. దీప ఇక్కడికి ఎందుకొచ్చిందని కార్తీక్ మనసులో అనుకుంటాడు.
దీప గడపకు దండం పెట్టి ఇంట్లో అడుగుపెట్టబోతుంటే లోపలికి రావద్దొని సుమిత్ర అంటుంది.
నా భర్తకు అన్యాయం...
ఇక్కడ ఎవరికి అన్యాయం జరిగింది దీపను అడుగుతుంది జ్యోత్స్న. నా భర్తకు అని దీప బదులిస్తుంది. నా భర్త అని దీప బదులివ్వడం చూసి జ్యోత్స్న షాకవుతుంది. దీపను అక్కడి నుంచి వెళ్లిపొమ్మని అంటాడు కార్తీక్. పారిజాతం వల్లే తాను తన సొంత కుటుంబానికి దూరం అయ్యానని, ఆమెను మాత్రం వదిలిపెట్టకూడదని మనసులో అనుకుంటుంది దీప. నన్ను కాపాడుకోవడానికే నా భర్త అగ్రిమెంట్‌పై సంతకం పెట్టాడని, నువ్వు చేసిన సాయానికి నేను రుణం తీర్చుకుంటానని జ్యోత్స్నతో అంటుంది దీప. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ముగిసింది.

E-Paper












