కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: సుమిత్రకు బొట్టు పెట్టిన వంటలక్క..కార్తీక్ ఎంగేజ్మెంట్ ప్లాన్..జ్యోత్స్నతో కాశీని చూసిన దీప

కార్తీక దీపం 2 సీరియల్ జూలై 15వ తేదీ ఎపిసోడ్ లో సుమిత్రకు బొట్టు పెడుతుంది దీప. నిశ్చితార్థానికి వెళ్లనని కార్తీక్ తో అంటుంది కాంచన. జ్యోత్స్న కోసం శివన్నారాయణ ఇంటికి కాశీ రావడం చూసి దీప షాక్ అవుతుంది. జ్యోను రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది దీప. ఇంకా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇక్కడ చూసేయండి. 

Jul 15, 2025, 07:19:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక దీపం 2 సీరియల్ టుడే జూలై 15వ తేదీ ఎపిసోడ్ లో దీపను సుమిత్రకు కుంకుమ పెట్టమని కాంచన చెప్తుంది. వద్దంటే ఈ తాంబూలం తీసుకెళ్లు వదిన అని సుమిత్రతో చెప్తుంది కాంచన. కాంచన ఫోర్స్ చేయడంతో సుమిత్రకు బొట్టు పెడుతుంది వంటలక్క. దీప చేత్తో బొట్టు పెడితే కుంకుమ కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది వదిన అని సుమిత్ర అంటే.. కాదు సౌభాగ్య లక్ష్మీ సంతోషిస్తుంది వదిన అని కాంచన అంటుంది. తనను మన ఇంటి యజమానురాలిలాగే ఉండమని దీపకు చెప్పు అని కార్తీక్ తో అంటుంది కాంచన.

కార్తీక దీపం 2 సీరియల్ టుడే జూలై 15 ఎపిసోడ్ (jiohotstar)
కార్తీక దీపం 2 సీరియల్ టుడే జూలై 15 ఎపిసోడ్ (jiohotstar)

కాశీకి కాల్

కాశీకి జ్యోత్స్న నుంచి కాల్ రావడం చూసి స్వప్న షాక్ అవుతుంది. మా ఆయనకెందుకు ఫోన్ చేశావు? మ్యాటర్ ఏంటో నాకు తెలియాలి అని స్వప్న అంటుంది. కాశీ వచ్చి ఫోన్ లాక్కుని వెళ్లిపోతాడు. అసలేం జరుగుతుంది అని స్వప్నకు డౌట్ వస్తుంది.

బెడ్ రూమ్ లో కార్తీక్, దీప మాట్లాడుకుంటారు. ఇంటికి రాలేరా అన్నావ్, కానీ వచ్చారు కదా అనిదీప అంటుంది. వదిన తన కోడలును తక్కువ చేసే సరికి అమ్మ తట్టుకోలేకపోయింది. జ్యోత్స్న నిశ్చితార్థాన్ని ముందుకు తీసుకొచ్చిందో అందరినీ కలిపేందుకు. జ్యోత్స్న ఎలాంటిదో తనతోనో చెప్పించి మళ్లీ అందరూ కలిసి ఉండేలా చేయాలి. ఆ తర్వాత నువ్వే అసలైన వారసురాలివని చెప్పాలి. వీళ్లకు ఎవరు తెలియకుండా ఇది చేయాలని కార్తీక్ అంటాడు.

అత్తయ్య వస్తుందా?

ఈ మనుషులు ఒకరినొకరు బాగా ఇష్టపడుతున్నారు. అత్తయ్య నిశ్చితార్థానికి వస్తుందా? అని కార్తీక్ ను దీప అడుగుతుంది. అమ్మ ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియదు అని కార్తీక్ అంటాడు. నువ్వే ఒప్పించాలని కార్తీక్ ను హత్తుకుని పడుకుంటుంది దీప. పొద్దున కాంచన, శౌర్య పూజ చేస్తారు. బై చెప్పి శౌర్య స్కూలుకు వెళ్లిపోతుంది.

మేనకోడలు నిశ్చితార్థం అంటే వట్టి చేతులతో ఎలా వెళ్తాం. బట్టలు, నగలు కొనాలి కదా అని కార్తీక్ అంటాడు. జ్యోత్స్న నిశ్చితార్థానికి వెళ్తానని చెప్పానా అని కాంచన తిరిగి ప్రశ్నించేసరికి కార్తీక్, దీప కంగారు పడతారు. మా అన్నయ్య ప్రేమ నాకు తెలుసు కానీ మా వదిన మాత్రం తప్పక వచ్చింది. నన్ను ఒకలా నా కోడలును ఒకలా చూస్తే ఎలా. నా కోడలును గౌరవించాలి. అక్కడికి వెళ్తే అది దొరకదని అర్థమైంది. నాన్న నన్ను కూతురు దగ్గరగా తీసుకుంటాడో లేడో నమ్మకం లేదు. నలుగురిలో ప్రేమలు నటించలేను.

ఆ ఇంట్లో పని చేయడం గురించి మీరు ఆలోచించారా? అడిగితే ఏవేవో చెప్తారు. కానీ మీపై నిందలు పడతాయేమో అని భయంగా ఉంది అని కాంచన అంటుంది. ఎంగేజ్మెంట్ కు ఇంకా టైమ్ ఉంది కదా వస్తావో రావో నిర్ణయించుకో అని కార్తీక్, దీప వెళ్లిపోతారు. నేను ఎక్కడికి వెళ్లను అని అనసూయతో కూడా అంటుంది కాంచన.

జ్యో ప్లాన్

కాశీ ఇంట్లోకి రావడం చూసి దీప షాక్ అవుతుంది. కాశీని జ్యోత్స్న ఇంత ప్రేమగా పిలవడం ఏంటీ అని డౌట్ పడుతుంది. వీళ్లు ఏం మాట్లాడుకుంటున్నారో వినపడటం లేదే అని దీప.. కార్తీక్ కు జ్యో, కాశీని చూపిస్తుంది. కాశీకి చెప్పాల్సిందంతా చెప్పి పంపించేస్తుంది జ్యో. గౌతమ్ గురించే వాళ్లు మాట్లాడుకున్నారు అని కార్తీక్ తో దీప చెప్తుంది. డేటా అని గురించి చెప్తుంది. ఎంగేజ్మెంట్ విషయంలో ఏదో జరుగుతుంది, మన మీదకే ప్రమాదం తీసుకొచ్చేలా జ్యో ఏదో ప్లాన్ చేస్తుంది అని కార్తీక్ అంటాడు.

నిజం చెప్పిన స్వప్న

వెంటనే స్వప్నకు కాల్ చేస్తాడు కార్తీక్. అంతా ఓకేనా అని అడుగుతాడు. సారీ అన్నయ్య నీ దగ్గర ఒక నిజం దాచాను. కాశీ వాళ్ల ఫ్రెండ్ రూ.10 లక్షలు మోసం చేశాడన్నయ్యా. ఆ డబ్బు ఇప్పుడు కట్టమని బెదిరిస్తున్నారు. కానీ ఇప్పుడు కాశీ రెండు రోజుల నుంచి రిలాక్స్ డ్ గా ఉన్నాడు. జ్యో కాల్ చేసి కాశీతో మాట్లాడింది. నన్ను తిట్టినందుకు సారీ చెప్పిందని చెప్పాడు అని కార్తీక్ కు స్వప్న చెప్తుంది. స్వప్న నేను చెప్పిన పని చేయ్ అని కార్తీక్ ఏదో చెప్తాడు.

డేంజర్ తో ఉంది నువ్వే

కాశీకి ఏ ప్రమాదం లేదు కదా అని దీప అంటే.. డేంజర్ లో ఉంది నువ్వు, నువ్వు కూడా ఓ పని చేయాలని కార్తీక్ చెప్తాడు. జ్యో దగ్గరకు వచ్చి కాశీ ఇక్కడకు వచ్చాడు అని కార్తీక్ తో ఫోన్లో మాట్లాడుతున్నట్లు యాక్ట్ చేస్తుంది దీప. ఇంట్లో ఎవరిని కలిసినట్లు లేడు బావ, నేను తెలుసుకుంటాలే అని ఫోన్లో అంటుంది దీప. ఏం పెద్దమ్మ గారు కాశీ రావడం మీరు చూశారా? అని జ్యోను అడుగుతుంది దీప.

కలిస్తే కలవొచ్చు అయినా నీకెందుకు? అని జ్యో అంటుంది. మీతో ఏం పని? అని దీప ప్రశ్నిస్తే.. నాతో పని ఉండాలని నువ్వెందుకు అనుకుంటున్నావో? నీతో కాశీ ఏమైనా చెప్పాడా? అని జ్యో అంటుంది. కాశీ వస్తే నా కోసం రావాలి లేదంటే మా బావ కోసం రావాలి. ఇంకా ఎవరి కోసం వచ్చినట్లో అని దీప అంటుంది. కాశీ అంటే మీకు పడదు కదా అని రెచ్చగొట్టేలా మాట్లుడుతుంది దీప. అవసరాలకు వాడుకుంటారు కదా అని దీప అనగానే జ్యో షాక్ కు గురవుతుంది.

ఇంట్లో నుంచి దాసు బాబాయి వెళ్లిపోయేటప్పుడు గతం గుర్తొచ్చిందంటా అని ఎవరో అంటే విన్నా. బాబాయి వస్తేనే ఆయన్ని ఎవరు కొట్టారో తెలుస్తుంది అని దీప అనడంతో నేటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ముగుస్తుంది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More