...
...
Next Story

ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన తమిళ సూపర్ హిట్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్- తెలుగులో స్ట్రీమింగ్- 6.7 రేటింగ్- ఇక్కడ చూసేయండి!

ఓటీటీలోకి ఇవాళ తమిళ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ యుగి డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేసింది. ఈ సినిమాను తెలుగులో కార్తిక మిస్సింగ్ కేస్ టైటిల్‌తో ఓటీటీ రిలీజ్ చేశారు. తెలుగు హీరోయిన్ ఆనంది కీలక పాత్ర పోషించిన కార్తిక మిస్సింగ్ కేస్ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Jun 13, 2025, 14:17:30 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

ఓటీటీలో ఎప్పటికప్పుడు వివిధ రకాల జోనర్లలో సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంటాయి. ప్రతి వారం సరికొత్త కంటెంట్‌తో ఓటీటీ మూవీస్ ప్రీమియర్ అవుతుంటాయి. అలా ఈ వారం దాదాపుగా 30కిపైగా సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో ఇవాళ ఒక్కరోజే 20కిపైగా ఓటీటీ సినిమాలు రిలీజ్ అయ్యాయి.

తమిళంలో అలా-మలయాళంలో ఇలా

ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన తమిళ సూపర్ హిట్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్- తెలుగులో స్ట్రీమింగ్- 6.7 రేటింగ్- ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన తమిళ సూపర్ హిట్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్- తెలుగులో స్ట్రీమింగ్- 6.7 రేటింగ్- ఇక్కడ చూసేయండి!

వాటిలో తమిళ, మలయాళ సూపర్ హిట్ మూవీ కూడా ఉంది. తమిళంలో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్గా తెరకెక్కిన సినిమా యుగి. దీన్ని మలయాళంలో అదృశ్యంగా విడుదల చేశారు. తమిళంలో యుగి సినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమాకు జాక్ హరీస్ దర్శకత్వం వహించారు.

యుగి నటీనటులు

ఈ తమిళ సినిమా యుగిలో తెలుగు హీరోయిన్ ఆనంది కీలక పాత్ర పోషించింది. అలాగే, యుగి మూవీలో కాథిర్, షరఫ్ యు దీన్, పవిత్ర లక్ష్మీ ప్రధాన పాత్రలు పోషించగా ఆత్మీయ రజన్, ప్రతాప్ పోతెన్, జాన్ విజయ్, నరైన్, నట్టి సుబ్రమణ్యం, వినోదిని వైద్యనాథన్ ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు.

కార్తిక మిస్సింగ్ కేస్ ఓటీటీ

తమిళంలో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన యుగి సినిమాకు ఐఎమ్డీబీలో పదికి 6.7 రేటింగ్ ఉంది. అలాంటి యుగి తెలుగు వెర్షన్ ఇవాళ (జూన్ 13) ఓటీటీలోకి వచ్చేసింది. యుగి మూవీ తెలుగు వెర్షన్‌ను కార్తిక మిస్సింగ్ కేస్ టైటిల్‌తో రిలీజ్ చేశారు. ఈ సినిమాను భవానీ మీడియా రిలీజ్ చేసింది.

ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్

ఇవాళ్టీ నుంచి ఆహాలో కార్తిక మిస్సింగ్ కేస్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న కార్తిక మిస్సింగ్ కేస్‌ను ఆహా ఓటీటీలో ఎంచక్కా చూసేయొచ్చు. అలాగే, మంచి మర్డర్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఓటీటీ రిలీజ్ అయిన కార్తిక మిస్సింగ్ కేస్ మంచి ఎంపిక అని చెప్పొచ్చు.

కార్తిక అనే అమ్మాయి గురించి

అద్భుతమైన నటన, తీవ్రమైన థ్రిల్, భావోద్వేగాల మేళవింపుతో కార్తిక మిస్సింగ్ కేస్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆకట్టుకునే ఈ అంశాలతో తప్పక చూడాల్సిన మర్డప్ మిస్టరీ థ్రిల్లర్‌గా కార్తిక మిస్సింగ్ కేస్ నిలిచింది. కాబట్టి, యుగి తెలుగు వెర్షన్‌ కార్తిక మిస్సింగ్ కేస్‌ను ఆహా ఓటీటీలో ఎంచక్కా చూసేయండి.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks