Keerthy Suresh LGBTQ:ఇద్దరు మగాళ్ల మధ్య ఇంటిమేట్ సీన్.. కీర్తి సురేష్ మూవీపై దారుణమైన ట్రోలింగ్.. నాశనం చేస్తున్నారంటూ..

Keerthy Suresh LGBTQ: కీర్తి సురేష్ నటించిన లేటెస్ట్ మూవీ డోరతీపై తమిళనాడులో పెద్ద రచ్చే నడుస్తోంది. ఈ మూవీలోని బోల్డ్ ఎల్జీబీటీక్యూ థీమ్, ఇద్దరు మగాళ్ల మధ్య బోల్డ్ సీన్లపై దారుణమైన ట్రోలింగ్ చేస్తున్నారు అక్కడి ప్రేక్షకులు.

Published on: Sep 26, 2026, 09:09:22 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Keerthy Suresh LGBTQ: త‌మిళ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా 'డోరతీ' (Dorothy) సినిమా గొడవే నడుస్తోంది. స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో మహానటి మూవీ ఫేమ్ కీర్తి సురేష్ నటించిన ఈ మూవీ థియేటర్లలోకి వచ్చిందో లేదో.. అప్పుడే సోషల్ మీడియాలో పెద్ద వివాదానికి తెరలేపింది. సినిమాలో ఉన్న బోల్డ్ కంటెంట్, LGBTQ థీమ్స్ తమిళ ఆడియెన్స్‌కి ఏమాత్రం మింగుడు పడటం లేదు.

Keerthy Suresh LGBTQ:ఇద్దరు మగాళ్ల మధ్య ఇంటిమేట్ సీన్.. కీర్తి సురేష్ మూవీపై దారుణమైన ట్రోలింగ్.. నాశనం చేస్తున్నారంటూ..
Keerthy Suresh LGBTQ:ఇద్దరు మగాళ్ల మధ్య ఇంటిమేట్ సీన్.. కీర్తి సురేష్ మూవీపై దారుణమైన ట్రోలింగ్.. నాశనం చేస్తున్నారంటూ..

డోరతీ మూవీ స్టోరీ ఏంటంటే?

1990ల కాలంలో మధురై బ్యాక్‌డ్రాప్‌లో సాగే కుల వివక్ష, హింస, పురుషాధిక్య సమాజం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. కార్తి (రిషికాంత్), సుబ్బు (సనంత్) అనే ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ జీవితాల్లోకి డోరతీ (కీర్తి సురేష్) రావడం వల్ల వాళ్ల లైఫ్ ఎలాంటి అనూహ్య మలుపు తిరిగింది అనేది మెయిన్ పాయింట్.

సినిమా కథ కంటే కూడా ఇందులో ఇద్దరు మగ పాత్రల మధ్య చూపించిన ఇంటీమేట్ సీన్లు, ముద్దు సన్నివేశాలే ఇప్పుడు నెట్‌లో పెను తుఫాను సృష్టిస్తున్నాయి. తమిళ సంస్కృతిని తక్కువ చేసి చూపిస్తున్నారంటూ కార్తీక్ సుబ్బరాజ్‌తో పాటు కీర్తి సురేష్‌పై ఒక వర్గం నెటిజన్లు దారుణంగా విరుచుకుపడుతున్నారు.

టొరంటో ఫెస్టివల్ మెప్పు నుండి సోషల్ మీడియా ట్రోలింగ్ వరకు

ఇటీవలే ప్రతిష్టాత్మక టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF) లో ప్రీమియర్ అయిన ఈ సినిమా అక్కడ స్టాండింగ్ ఓవేషన్ అందుకుంది. కానీ మన దగ్గర థియేటర్లలోకి వచ్చేసరికి పరిణామాలు పూర్తిగా మారిపోయాయి.

మెయిన్‌స్ట్రీమ్ సినిమాలో ఇలాంటి సున్నితమైన, సెన్సేషనల్ లైన్ ఎంచుకోవడంపై డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ధైర్యాన్ని కొందరు అర్బన్ ఆడియెన్స్ మెచ్చుకుంటున్నారు. అయితే మాస్ జనాలు మాత్రం ట్రోల్స్ రూపంలో విమర్శలు గుప్పిస్తూ సినిమాని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మన సంస్కృతి నాశనం చేస్తారా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

నిజానికి 2018లో సుప్రీంకోర్టు స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే ఆర్టికల్ 377ను రద్దు చేసిన తర్వాత ఈ ఎల్టీబీటీక్యూ థీమ్ తో చాలా సినిమాలు, వెబ్ సిరీస్ వచ్చాయి.. వస్తూనే ఉన్నాయి. అయితే తమిళం, తెలుగులాంటి భాషల్లో మాత్రం చాలా తక్కువే. అలాంటి బోల్డ్ కాన్సెప్ట్ ఎంచుకోవడంపైనే ఇప్పుడు తమిళనాడు రగులుతోంది.

డోరతీ మూవీ విశేషాలు

• టైటిల్ రోల్ : కీర్తి సురేష్ (డోరతీ)

• లీడ్ రోల్స్ : సనంత్ (సుబ్బు), రిషికాంత్ (కార్తి), ముత్తుకుమార్

• డైరెక్టర్ : కార్తీక్ సుబ్బరాజ్

• మ్యూజిక్ : ఇళయరాజా

• సినిమాటోగ్రఫీ : ఎస్. తిరునావుక్కరసు

• రిలీజ్ డేట్ : 25 సెప్టెంబర్ 2026 (టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ ప్రీమియర్)

• సర్టిఫికేషన్ : 'A' సర్టిఫికేట్ (146 నిమిషాలు)

ఇళయరాజా మ్యూజిక్, ధనుష్ ప్రశంసలు

ఒకవైపు నెగెటివిటీ కనిపిస్తున్నా, సినీ ప్రముఖులు ఈ సినిమాకి అండగా నిలుస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఈ సినిమాని ఒక 'మాస్టర్ పీస్' అని అభివర్ణించారు.

ఇసైజ్ఞాని ఇళయరాజా ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం పోసిందని, కార్తీక్ మేకింగ్ టాప్ నాచ్ అని ధనుష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే డైరెక్టర్ నెల్సన్, ఏఆర్ మురుగదాస్ లాంటి వాళ్లు కూడా ఈ డోరతీ మూవీ టీమ్‌కి సపోర్ట్ అందించారు.

తెలుగులో రిలీజ్ అవుతుందా?

ఈ గొడవ నడుస్తుండగానే డైరెక్ట్‌గా తెలుగు ఆడియెన్స్‌ని ఒక ప్రశ్న అడిగారు కార్తీక్ సుబ్బరాజ్. ఈ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేయమంటారా అని ఆయన పోస్ట్ చేయగా, ఇక్కడ నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

తమిళనాడులో జరుగుతున్న ఈ రచ్చ చూస్తుంటే తెలుగు వర్షన్ ఎప్పుడు వస్తుంది, ఇక్కడి ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. కీర్తి సురేష్ స్క్రీన్ టైమ్ తక్కువే ఉన్నప్పటికీ, కథలో ఆమె క్యారెక్టర్ ఎంతో కీలకమని టాక్ వినిపిస్తోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More