...
...
Next Story

మ్యూజియం చోరీ, ఓ కుక్క హత్య.. గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే.. ఈ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సీజన్ 2 ఓ మస్ట్ వాచ్..

మలయాళం క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2 శుక్రవారం (జూన్ 20) జియోహాట్‌స్టార్ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. రెండేళ్ల కిందట వచ్చిన తొలి సీజన్ మలయాళంలో రూపొందిన తొలి వెబ్ సిరీస్ గా పేరుగాంచగా.. ఈ రెండో సీజన్ మరింత థ్రిల్ పంచుతూ ఓ మస్ట్ వాచ్ గా నిలుస్తోంది.

Published on: Jun 20, 2025, 14:13:18 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

కేరళ క్రైమ్ ఫైల్స్.. మలయాళంలో రూపొందిన తొలి వెబ్ సిరీస్ ఇది. 2023లో తొలి సీజన్ రాగా.. ఇప్పుడు శుక్రవారం (జూన్ 20) నుంచి జియోహాట్‌స్టార్ ఓటీటీలో రెండో సీజన్ స్ట్రీమింగ్ అవుతోంది. అహ్మద్ కబీర్ డైరెక్ట్ చేసిన ఈ రెండో సీజన్ తొలి సీజన్ కంటే కూడా ఉత్కంఠగా సాగింది. ఓ మ్యూజియంలో చోరీ, కుక్క హత్య చుట్టూ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సాగే ఈ సిరీస్ ఓ మస్ట్ వాచ్ అని చెప్పొచ్చు.

కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2 స్టోరీ ఏంటంటే?

మ్యూజియం చోరీ, ఓ కుక్క హత్య.. గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే.. ఈ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సీజన్ 2 ఓ మస్ట్ వాచ్..
మ్యూజియం చోరీ, ఓ కుక్క హత్య.. గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే.. ఈ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సీజన్ 2 ఓ మస్ట్ వాచ్..

కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2 మొదట్లో ఓ సింపుల్ మిస్సింగ్ స్టోరీగా మొదలవుతుంది. మాఫియా, అండర్ వరల్డ్ తో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలతో మొదట్లోనే కొందరు పోలీస్ అధికారులను బదిలీ చేయడం చూపిస్తారు. అందులో సీపీవో అంబిలి రాజు కూడా ఉంటాడు.

ఆ బదిలీ తర్వాత అంబిలి రాజు కనిపించకుండాపోతాడు. అతన్ని వెతకడం కోసం ఓ పోలీస్ టీమ్ రంగంలోకి దిగుతుంది. కానీ దిగిన తర్వాత ఆ కేసు లోతేంటో తెలుస్తుంది. కేసును దర్యాప్తు చేస్తున్న కొద్దీ ఆ లింకులు ఎక్కడెక్కడికో వెళ్తుంటాయి. ఆ చిక్కుముడులను ఒక్కొక్కటిగా విప్పుతూ పోలీస్ ఇన్వెస్టిగేషన్ సాగుతూ ఉంటుంది.

తొలి ఎపిసోడ్ మొదట్లోనే చూపించే మ్యూజియంలో జరిగే చోరీ, ఓ కుక్క హత్య స్టోరీలో అసలు టర్నింగ్ పాయింట్లుగా ఉంటాయి. అసలు ఆ అంబిలి రాజు ఎక్కడికి వెళ్లాడు? అతనికి ఏమైంది? అసలు అతని మిస్సింగ్ కు మ్యూజియం చోరీ, కుక్క హత్యకు ఉన్న సంబంధం ఏంటి? అన్నది కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2లో చూడాలి.

కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2 ఎందుకు చూడాలంటే?

కేరళ క్రైమ్ ఫైల్స్ ఓ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఆ జానర్ కు తగినట్లుగానే డైరెక్టర్ అహ్మద్ కబీర్ ఈ సిరీస్ ను చాలా ఉత్కంఠగా తెరకెక్కించాడు. తొలి సీజన్ మొత్తం ఓ వేశ్య హత్య, ఆ కేసును ఆరు రోజుల్లోనే ఛేదించే పోలీసు ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరగగా.. ఈ రెండో సీజన్ ఓ పోలీసు కనిపించకుండా పోవడం, దాని చుట్టూ దాగి ఉన్న రహస్యాలు, పోలీస్ డిపార్ట్‌మెంట్లో ఉండే లొసుగులు.. వాటికి, మ్యూజియం చోరీ, కుక్క హత్యకు లింకు పెడుతూ సాగుతుంది.

ఇక ఇందులో లీడ్ రోల్స్ నటన కూడా అద్భుతమనే చెప్పాలి. ఈ రెండో సీజన్ లో ఇన్వెస్టిగేషన్ మొత్తం కొత్తగా వచ్చే ఎస్సై నోబుల్ (అర్జున్ రాధాకృష్ణన్) చూసుకుంటాడు. అతనికితోడు తొలి సీజన్లో ఉన్న సీఐ కురియన్ అవరస్ (లాల్), ఎస్సై మనోజ్ శ్రీధరన్ (అజు వర్గీస్) పాత్రలు కూడా రెండో సీజన్లో కొనసాగాయి. అంబిలి రాజు పాత్రలో ఇంద్రన్స్, అయ్యప్పన్ పాత్రలో హరిశ్రీ అశోకన్ జీవించేశారు.

తెలుగులో విజయ్ దేవరకొండ ఖుషీ మూవీకి మ్యూజిక్ అందించిన హేషమ్ అబ్దుల్ వహాబ్ బీజీఎం కూడా ఈ వెబ్ సిరీస్ కు పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మొత్తంగా ఈ కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2 కచ్చితంగా చూడాల్సిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. సాధారణంగా మలయాళం థ్రిల్లర్స్ లో కనిపించే అన్ని ఎలిమెంట్స్ ఇందులోనూ ఉన్నాయి. ఈ వీకెండ్ జియోహాట్‌స్టార్ లో ఉన్న ఈ కొత్త సీజన్ చూడటానికి ప్లాన్ చేసేయండి.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe