ఓటీటీలోకి రూ.150 కోట్ల హిస్టారిక్ కోర్ట్ రూమ్ డ్రామా.. ఐఎండీబీలో 8.2 రేటింగ్.. తెలుగులోనూ స్ట్రీమింగ్?

ఓటీటీలోకి మరో హిట్ కోర్ట్ రూమ్ డ్రామా వచ్చేస్తోంది. సుమారు రెండు నెలల తర్వాత ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. ఐఎండీబీలో 8.2 రేటింగ్ సొంతం చేసుకున్న ఈ సినిమాకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు.

Jun 9, 2025, 20:23:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న హిట్ కోర్ట్ రూమ్ డ్రామా కేసరి ఛాప్టర్ 2 డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. తెలుగులోనూ ఈ మూవీ రిలీజ్ కావడంతో.. హిందీతోపాటు తెలుగులోనూ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

ఓటీటీలోకి రూ.150 కోట్ల హిస్టారిక్ కోర్ట్ రూమ్ డ్రామా.. ఐఎండీబీలో 8.2 రేటింగ్.. తెలుగులోనూ స్ట్రీమింగ్?
ఓటీటీలోకి రూ.150 కోట్ల హిస్టారిక్ కోర్ట్ రూమ్ డ్రామా.. ఐఎండీబీలో 8.2 రేటింగ్.. తెలుగులోనూ స్ట్రీమింగ్?

కేసరి ఛాప్టర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్

అక్షయ్ కుమార్, మాధవన్, అనన్య పాండే నటించిన హిస్టారికల్ కోర్ట్ రూమ్ డ్రామా కేసరి ఛాప్టర్ 2. జలియన్‌వాలా బాగ్ మారణ హోమం గురించి తెలియని స్టోరీని ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఏప్రిల్ 18న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా సుమారు రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది.

జూన్ 13 నుంచి జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. తెలుగులోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.

కేసరి ఛాప్టర్ 2 మూవీ గురించి..

కేసరి ఛాప్టర్ 2 మూవీని సుమారు రూ.150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ లభించలేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇంచుమించు రూ.150 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మూవీకి పాజిటివ్ రివ్యూలు వచ్చినా.. అది కలెక్షన్ల రూపంలో కనిపించలేదు.

అయితే ఓటీటీలో మాత్రం ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, మాధవన్, అనన్య పాండేతోపాటు రెజీనా, సైమన్ పైస్లీ డేలాంటి వాళ్లు కీలక పాత్రలు పోషించారు. ధర్మ ప్రొడక్షన్స్, లియో మీడియా కలెక్టివ్ , కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి. కరణ్ సింగ్ త్యాగి ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు.

ఈ కేసరి ఛాప్టర్ 2 మూవీ 1919లో జరిగిన జలియన్‌వాలా బాగ్ మారణహోమం, దాని వెనుక దాగి ఉన్న కుట్రకోణాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఇందులో శంకరన్ నాయర్ అనే పాత్రలో అక్షయ్ కుమార్ నటించాడు. అతడు వైస్రాయ్ కౌన్సిల్ లో సభ్యుడిగా ఉంటాడు. ఈ హత్యాకాండపై రిపోర్ట్ ఇచ్చే బాధ్యతను అతనికి అప్పగిస్తారు.

రిపోర్ట్ తమకు అనుకూలంగా వస్తుందని బ్రిటీష్ ప్రభుత్వం భావించినా.. అసలు ఈ హత్యాకాండ వెనుక దాగి ఉన్న చీకటి రహస్యాలను తెలుసుకున్న తర్వాత బ్రిటన్ రాణి, జనరల్ డయ్యర్ లపై శంకరన్ నాయర్ కేసు వేస్తాడు. ఇక కోర్టులో బ్రిటీష్ తరపున వాదించడానికి నెవిల్ మెకిన్లీ (మాధవన్) వస్తాడు. ఈ ఇద్దరి మధ్య కోర్టులో జరిగే వాదోపవాదాల చుట్టూనే ఈ సినిమా తిరుగుతుంది. మంచి కోర్ట్ రూమ్ డ్రామా చూడాలనుకుంటే ఈ కేసరి ఛాప్టర్ 2ని మిస్ కావద్దు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More