...
...
Next Story

కేజీఎఫ్, సలార్ మేకర్స్ నుంచి మహావతార్ సినిమాటిక్ యూనివర్స్.. 12 ఏళ్లలో 7 భారీ బడ్జెట్ యానిమేటెడ్ సినిమాలు..

కేజీఎఫ్, సలార్ మేకర్స్ అయిన హోంబలే ఫిల్మ్స్ మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో ఓ సరికొత్త సిరీస్ కు తెరతీసింది. ఇందులో భాగంగా వచ్చే 12 ఏళ్లలో మొత్తం 7 భారీ బడ్జెట్ యానిమేటెడ్ సినిమాలను తెరకెక్కించనుంది.

Published on: Jun 25, 2025, 13:40:42 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

హోంబలే ఫిల్మ్స్ తెలుసు కదా. కేజీఎఫ్, సలార్, కాంతారలాంటి సినిమాలతో పాన్ ఇండియా లెవెల్లో పాపులర్ అయిన నిర్మాణ సంస్థ. ఇప్పుడీ హోంబలే ఫిల్మ్స్ మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ పేరుతో రాబోయే 12 ఏళ్లలో 7 భారీ బడ్జెట్ యానిమేటెడ్ సినిమాలను రూపొందించబోతోంది. అందులో ప్రభాస్ కూడా భాగం కానున్నాడన్న వార్తలు వస్తున్నాయి.

మహావతార్ సినిమాటిక్ యూనివర్స్

కేజీఎఫ్, సలార్ మేకర్స్ నుంచి మహావతార్ సినిమాటిక్ యూనివర్స్.. 12 ఏళ్లలో 7 భారీ బడ్జెట్ సినిమాలు.. ప్రభాస్ కూడా ఉంటాడా?
కేజీఎఫ్, సలార్ మేకర్స్ నుంచి మహావతార్ సినిమాటిక్ యూనివర్స్.. 12 ఏళ్లలో 7 భారీ బడ్జెట్ సినిమాలు.. ప్రభాస్ కూడా ఉంటాడా?

హోంబలే ఫిల్స్మ్ 2014లో మొదలైంది. కానీ వాళ్లు 2018లో నిర్మించిన కేజీఎఫ్ మూవీతో వాళ్ల లెవెల్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ తర్వాత కేజీఎఫ్ 2, సలార్, కాంతారలతో ఇక వెనుదిరిగి చూడలేని స్థాయికి చేరింది. ఇప్పుడీ హోంబలే ఫిల్మ్స్ మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ ప్రారంభించింది. ఇందులో భాగంగా 2025 నుంచి 2037 వరకు 12 ఏళ్లలో ఏడు యానిమేషన్ సినిమాలను తీసుకురానున్నట్లు వెల్లడించింది. ఆ సినిమా టైటిల్స్ ను కూడా బుధవారం (జూన్ 25) ఓ వీడియో ద్వారా అనౌన్స్ చేసింది.

హోంబలే ఫిల్మ్స్ మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఈ ఏడాది మొదటగా మహావతార్ నరసింహ రానుంది. ఆ తర్వాత 2027లో మహావతార్ పరశురామ్, 2029లో మహావతార్ రఘునందన్, 2031లో మహావతార్ ద్వారకాదీష్, 2033లో మహావతార్ గోకులనంద, 2035లో మహావతార్ కల్కి పార్ట్ 1, 2037లో మహావతార్ కల్కి పార్ట్ 2 సినిమాలు రానున్నాయి.

ఈ వీడియోను తమ ఎక్స్ అకౌంట్లో షేర్ చేస్తూ.. “అవకాశాలు అనంతం, మా కథలు తెరపై గర్జించడం చూసేందుకు ఉత్సాహంగా ఉన్నాం. భారీ సినిమాటిక్ జర్నీకి సిద్ధం కండి! అద్భుతమైన సినిమా అనుభవం కోసం సిద్ధంగా ఉండండి.” అనే క్యాప్షన్ తో హెంబలే ఫిల్మ్స్ ఈ ట్వీట్ చేసింది.

ప్రభాస్ కూడా ఉంటాడా?

ఒకవేళ ఈ యానిమేటెడ్ యూనివర్స్ లో అతడు ఉంటే.. వీటిలో అతని పాత్ర ఏంటన్న చర్చ మొదలైంది. నరసింహ, పరశురామ, ద్వారకాదీష, గోకులనంద, రఘునందన అంటూ.. విష్ణు మూర్తి అవతారాలపై సినిమాలు చేయడానికి హోంబలే సిద్ధమైంది. అయితే ప్రభాస్ ఇప్పటికే పదో అవతారమైన కల్కిపై మూవీ చేశాడు. రెండో భాగం కూడా రానుంది. ఇప్పుడు హోంబలే యానిమేటెడ్ యూనివర్స్ నుంచి కూడా కల్కిపై మరో రెండు పార్ట్‌లు వస్తుండటం విశేషం.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe