Kichcha Sudeep: ఇలాంటి సినిమా తీయాలంటే దమ్ముండాలి.. ఇంత ధైర్యం చేసిన నీకు కంగ్రాట్స్: యశ్ టాక్సిక్ మూవీపై కిచ్చా సుదీప్
Kichcha Sudeep: టాక్సిక్ లాంటి సినిమా తీయాలంటే దమ్ముండాలంటూ కిచ్చా సుదీప్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. యశ్ మూవీపై విమర్శల వేళ సుదీప్ ట్వీట్ సంచలనం రేపుతోంది.
Kichcha Sudeep: 'కేజీఎఫ్' లాంటి గ్లోబల్ హిట్ తర్వాత బాక్సాఫీస్ దగ్గర ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధిస్తున్నప్పటికీ, రాకింగ్ స్టార్ యశ్ నయా మూవీ 'టాక్సిక్' (Toxic) తీవ్రమైన నెగెటివిటీ, సోషల్ మీడియా ట్రోల్స్ ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్ యశ్ కి మద్దతుగా నిలిచి సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ చేశారు. రొటీన్ కమర్షియల్ ఫార్ములా పక్కనపెట్టి రిస్క్ చేసిన యశ్ ధైర్యాన్ని ఆయన మనస్ఫూర్తిగా ప్రశంసించారు.

“ఫార్ములా సినిమాలు చేయకుండా డిఫరెంట్‌గా ప్రయత్నించావ్”
'కేజీఎఫ్' బ్లాక్‌బస్టర్ సక్సెస్ తర్వాత ఏ హీరో అయినా సేఫ్ జోన్‌లో రొటీన్ కమర్షియల్ ఫార్ములా సినిమా చేస్తాడని, కానీ యశ్ మాత్రం దానికి భిన్నంగా ఆలోచించాడని సుదీప్ పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా ఎక్స్ లో సుదీప్ ఒక సుదీర్ఘమైన ఎమోషనల్ మెసేజ్ షేర్ చేశారు.
"పాత కమర్షియల్ రూట్ ఎంచుకోకుండా ఏదో ఒక కొత్త ప్రయోగం చేయాలనే యశ్ ఆలోచన నిజంగా అభినందనీయం. ఆడియన్స్ ఊహించే రెగ్యులర్ కమర్షియల్ మాస్ సినిమా చేయకుండా ఇలాంటి విభిన్నమైన కథను ఎంచుకోవడానికి ఎంతో ధైర్యం, విజన్ ఉండాలి. టాక్సిక్ ఒక డిఫరెంట్ అటెంప్ట్. ఇందులో చర్చించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ప్రయోగాలు చేయడానికి వెనకాడని నీ ధైర్యానికి నా హాట్సాఫ్" అని సుదీప్ యష్‌ను కొనియాడారు.
150 కోట్ల మార్క్ దాటినా ట్రోల్స్.. యూట్యూబర్లకు లీగల్ నోటీసులు
గీతూ మోహన్‌దాస్ డైరెక్షన్‌లో తెరకెక్కిన 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' బాక్సాఫీస్ దగ్గర మూడో రోజుకే రూ. 150 కోట్ల క్లబ్‌లో చేరింది. అయితే ఆడియన్స్ నుంచి వస్తున్న మిశ్రమ స్పందన, మీమ్స్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో బెంగళూరు సిటీ కోర్టును ఆశ్రయించిన మేకర్స్, సినిమాపై తప్పుడు ప్రచారం చేసేవారిపై తాత్కాలిక ఇంజంక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. ఐప్లెక్స్ సాఫ్ట్‌వేర్ ద్వారా సురాజ్ కుమార్, ప్రశాంత్ రంగస్వామి లాంటి పాపులర్ యూట్యూబర్లు తమ రివ్యూల వల్ల కేవీఎన్ ప్రొడక్షన్స్ నుంచి లీగల్ నోటీసులు వచ్చాయని ఆరోపిస్తుండటంతో ఈ వివాదం మరింత వేడెక్కింది.
పోర్చుగీస్ బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ డ్రామా
ఇక ఈ టాక్సిక్ మూవీ స్టోరీ విషయానికి వస్తే.. ఇండియాకు స్వతంత్రం వచ్చినా ఇంకా పోర్చుగీస్ పాలనలోనే ఉన్న గోవా బ్యాక్‌డ్రాప్‌లో ఒక గ్యాంగ్‌స్టర్ ఎదగడం, ఆ తర్వాత పతనం అవ్వడం చుట్టూ ఈ కథ సాగుతుంది. ఈ సినిమాలో యశ్ డ్యుయల్ రోల్లో కనిపిస్తుండగా.. నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ లాంటి పవర్ ఫుల్ హీరోయిన్లు నటించారు.
ఏది ఏమైనా ప్రయోగం వికటించిందంటూ వస్తున్న విమర్శల నడుమ కన్నడ ఇండస్ట్రీకి చెందిన బిగ్ స్టార్ కిచ్చా సుదీప్ ఓపెన్‌గా సపోర్ట్ ఇవ్వడం యశ్ అభిమానులకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. ఇంతకుముందు మరో స్టార్ ఉపేంద్ర కూడా ఈ మూవీకి అండగా నిలిచిన విషయం తెలిసిందే.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


