...
...
Next Story

కింగ్‍డమ్ సినిమా మరోసారి వాయిదా? కొత్త డేట్ ఇదేనా!

కింగ్‍డమ్ చిత్రం మరోసారి వాయిదా పడనుందని తెలుస్తోంది. మరింత ఆలస్యం కానుందనే రూమర్లు వస్తున్నాయి. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడగా.. మరోసారి పోస్ట్‌పోన్ అవనుందని తెలుస్తోంది.

Published on: Jun 10, 2025, 11:41:31 IST
By
Prefer HTon Google
Advertisement

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్‍డమ్ చిత్రం ఆలస్యమవుతూనే ఉంది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడగా.. ఇప్పుడు మరోసారి అదే బాట పట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ స్పై యాక్షన్ మూవీని జూలై 4న విడుదల చేస్తామని గత నెలలోనే కొత్త తేదీని మూవీ టీమ్ ఖరారు చేసింది. అయితే, ఆ డేట్‍కు కూడా ఈ చిత్రం విడుదల కాదని తాజాగా సమాచారం చక్కర్లు కొడుతోంది. మరో డేట్ ఏదో కూడా బయటికి వచ్చింది. ఆ వివరాలు ఇవే..

మళ్లీ వాయిదా.. కొత్త తేదీ!

కింగ్‍డమ్ సినిమా మరోసారి వాయిదా? కొత్త డేట్ ఇదేనా!
కింగ్‍డమ్ సినిమా మరోసారి వాయిదా? కొత్త డేట్ ఇదేనా!

కింగ్‍డమ్ చిత్రం జూలై 4వ తేదీ నుంచి వాయిదా పడడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. నితిన్ హీరోగా నటించిన తమ్ముడు మూవీ ఆ డేట్‍ను ఖరారు చేసుకోవడంతో ఆ రూమర్లకు మరింత బలం చేకూరింది. కింగ్డమ్సినిమా విడుదలను జూలై 25వ తేదీకి వాయిదా వేయాలని మూవీ టీమ్ డిసైడ్ అయినట్టు టాక్ వస్తోంది. ఈ డేట్‍పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కారణం ఇవేనా!

ఈసారి కింగ్‍డమ్ సినిమా వాయిదాకు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కారణమనే రూమర్లు వస్తున్నాయి. ఈ మూవీకి మ్యూజిక్ పనులు చాలా ఇంకా పెండింగ్‍లో ఉన్నాయని తెలుస్తోంది. రీరికార్డింగ్ ఇంకా ఆలస్యమవుతుందని టాక్. దీంతోనే కింగ్‍డమ్ మూవీని జూలై 25కు వాయిదా వేయాలని టీమ్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే, కొన్ని సీన్లను కూడా రీషూట్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా రూమర్లు ఉన్నాయి. మొత్తంగా కింగ్‍డమ్ జూలై 4 నుంచి పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నట్టు బజ్ నడుస్తోంది. మూవీ టీమ్ ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి.

కింగ్‍డమ్ సినిమాను ముందుగా ఈ ఏడాది మార్చి 28న రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఆ తర్వాత మే 30వ తేదీకి డేట్ మారింది. మళ్లీ జూలై 4వ తేదీకి వాయిదా పడింది. ఇప్పుడు మరింత ఆలస్యమై జూలై 25వ తేదీకి రిలీజ్ పోస్ట్‌పోన్ అవుతుందని రూమర్లు వస్తున్నాయి. ఇలా ఈ చిత్రం ఆలస్యమవుతూనే ఉంది.

రూ.100కోట్లకు పైగా బడ్జెట్‍తో..

కింగ్‍డమ్ సినిమా రూ.100కోట్లకు పైగా బడ్జెట్‍తో రూపొందుతోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ క్రియేషన్స్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూజ్ చేస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలోనూ ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‍గా నటిస్తున్నారు. హీరో సత్యదేవ్ కూడా ఓ కీలకపాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks