83 ఏళ్ల వయసులో కోట శ్రీనివాస రావు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఈ రోజు ఆయన హైదరాబాద్ లోని తన ఇంట్లో కన్నుమూశారు. సుమారు 750కి పైగా చిత్రాల్లో నటించారు కోట. అయితే ముఖ్యంగా బాబు మోహన్ తో ఆయన కాంబినేషన్ ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయింది. పాత సినిమాల్లో కోట శ్రీనివాస రావు, బాబు మోహన్ కలిసి చేసిన కామెడీ చిరస్థాయిగా మిగిలిపోతుంది. ఎటువంటి డబుల్ మీనింగ్ లు, అసహ్యాలు లేకుండా ప్యూర్ కామెడీ అందించారు ఈ దిగ్గజాలు.
భోరున విలపించిన బాబు మోహన్

తన తోటి నటుడు, తనను సొంత తమ్ముడి కంటే ఎక్కువగా చూసుకున్న కోట శ్రీనివాస రావు ఇక లేరు అని వార్త తెలిసి బాబు మోహన్ కుంగిపోయారు. కోట శ్రీనివాస రావు భౌతిక కాయాన్ని చూసిన తర్వాత కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఆ వీడియో అందరినీ కంటతడిపెట్టిస్తోంది.
‘‘మొన్ననే కాల్ చేశా. ఎప్పుడొస్తావ్ రా అన్నాడు. రేపొస్తా అన్నా అని చెప్పా. కానీ నేను వచ్చేసరికి ఆయన లేడండీ. వెళ్లిపోయారు. ఇంటికొస్తే ఎంతో సంతోషంగా రారా అనేవారు. బోర్ కొడుతోంది అనేవారు. ఇప్పుడేమో హాయిగా పడుకున్నారు. కోటన్నకు ఓ తమ్ముడు ఉన్నా నన్నే అసలు తమ్ముడిగా ఫీలయ్యేవారు. ఒకే ప్లేట్ లో కలిసి ఎన్నోసార్లు తిన్నాం’’ అని మీడియాతో మాట్లాడుతూ బాబు మోహన్ కన్నీరుమున్నీరయ్యారు.
అదిరే కాంబినేషన్
తెలుగు సినిమాల్లో కోట శ్రీనివాస రావు, బాబు మోహన్ ది ఎవరీ గ్రీన్ కాంబినేషన్. వీళ్ల జంటను తెరపై చూస్తేనే నవ్వు వస్తుంది. ఇప్పటికీ యూట్యూబ్ లో వీళ్ల కామెడీ వీడియోస్ మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తూనే ఉన్నాయి. ఈ ఇద్దరు కాంబినేషన్ తొలిసారి ‘బొబ్బిలి రాజా’ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత కలిసి 60కి పైగా సినిమాలు చేశారు. ఇందులో మామగారు, మాయలోడు, పిట్టల దొర, పచ్చని సంసారం, హలో బ్రదర్, వారసుడు, అల్లరి అల్లుడు, పెదరాయుడు, అప్పుల అప్పారావు, జంబ లకిడి పంబ, రాజేంద్రుడు గజేంద్రుడు తదితర సినిమాలున్నాయి.
ఎమ్మెల్యేలుగా
{{/usCountry}}తెలుగు సినిమాల్లో కోట శ్రీనివాస రావు, బాబు మోహన్ ది ఎవరీ గ్రీన్ కాంబినేషన్. వీళ్ల జంటను తెరపై చూస్తేనే నవ్వు వస్తుంది. ఇప్పటికీ యూట్యూబ్ లో వీళ్ల కామెడీ వీడియోస్ మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తూనే ఉన్నాయి. ఈ ఇద్దరు కాంబినేషన్ తొలిసారి ‘బొబ్బిలి రాజా’ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత కలిసి 60కి పైగా సినిమాలు చేశారు. ఇందులో మామగారు, మాయలోడు, పిట్టల దొర, పచ్చని సంసారం, హలో బ్రదర్, వారసుడు, అల్లరి అల్లుడు, పెదరాయుడు, అప్పుల అప్పారావు, జంబ లకిడి పంబ, రాజేంద్రుడు గజేంద్రుడు తదితర సినిమాలున్నాయి.
ఎమ్మెల్యేలుగా
{{/usCountry}}కోట శ్రీనివాస రావు, బాబు మోహన్ పొలిటికల్ గానూ తమ ముద్ర వేశారు. ఎమ్మెల్యేలుగా పని చేశారు. 1999లో బీజేపీ నుంచి కోట శ్రీనివాస రావు ఎమ్మెల్యేగా గెలిచారు. అదే సమయంలో టీటీపీ నుంచి బాబు మోహన్ ఎమ్మెల్యేగా గెలిచారు. చంద్రబాబు క్యాబినేట్లో మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత మరో రెండు సార్లు బాబు మోహన్ ఎమ్మెల్యే అయ్యారు.
ఆ విషాదం
తెరపై అద్భుతమైన కామెడీ పండించిన కోట శ్రీనివాస రావు, బాబు మోహన్ జీవితాల్లో అంతులేని విషాదం ఉంది. ఈ ఇద్దరి కొడుకులు మరణించారు. అది కూడా రోడ్డు ప్రమాదంలోనే కావడం గమనార్హం. బాబు మోహన్ పెద్ద కొడుకు పవన్ కుమార్ 2003 లో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. కోట శ్రీనివాస రావు ఏకైక తనయుడు వెంకట ఆంజనేయ ప్రసాద్ 2010లో రోడ్ యాక్సిడెంట్ లోనే ప్రాణాలు వదిలారు.