ఇక సెలవు.. ముగిసిన కోట శ్రీనివాస రావు అంత్యక్రియలు.. శోకసంద్రంలో సెలబ్రిటీలు, అభిమానులు
నాలుగు దశాబ్దాల సుదీర్ఘ సినీ కెరీర్ ముగిసింది. తెలుగు సినీ చరిత్రలో ఓ సువర్ణాధ్యాయానికి తెరపడింది. వందలాది సినిమాల్లో డిఫరెంట్ గెటప్ లు వేసిన కోట శ్రీనివాస రావు సెలవు తీసుకున్నారు. ఆయన అంత్యక్రియలు ముగిశాయి.
విలన్ గా భయపెట్టి.. కామెడీ ఆర్టిస్ట్ గా నవ్వించి.. ఓ తండ్రిగా దారి చూపి.. ఓ బాధ్యత కలిగిన వ్యక్తిగా మనసు లోతుల్లో నిలిచిపోయిన కోట శ్రీనివాస రావు ఇక లేరు. ఆదివారం (జూలై 13) తెల్లవారుజామున మరణించిన కోట శ్రీనివాస రావు అంత్యక్రియలు తాజాగా ముగిశాయి. 750కి పైగా సినిమాల్లో వైవిధ్యమైన నటనతో అలరించిన లెజెండరీ యాక్టర్ కోట శ్రీనివాస్ రావు మరణ వార్తను సెలబ్రిటీలు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

మనవడి చేతితో
83 ఏళ్ల వయసులో అనారోగ్యంతో కన్నుమూశారు కోట శ్రీనివాస రావు. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు ఫిల్మ్ నగర్ లోని తన నివాసంలో కోట మరణించారు. సాయంత్రం సుమారు 4.30 గంటలకు కోట శ్రీనివాస్ రావు అంత్యక్రియలు ముగిశాయి. ఫిల్మ్ నగర్ నుంచి మహా ప్రస్థానం వరకూ అంతిమ యాత్ర నిర్వహించారు. అనంతరం పెద్ద మనవడు శ్రీనివాస్ చేతుల మీదుగా అంత్యక్రియలు నిర్వహించారు. కోట శ్రీనివాస రావు ఏకైక కుమారుడు కోట ప్రసాద్ 2010లో రోడ్డు ప్రమాదంలో మరణించారు.
మరిచిపోలేని పాత్రలు
విలనిజానికి కొత్త అర్థం చెప్పిన విలక్షణ నటుడు కోట శ్రీనివాస రావు. ఆయన కన్నెర్ర చేస్తే ఆడియన్స్ భయపడేవాళ్లంటే అతిశయోక్తి కానే కాదు. 1942లో కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు కోట శ్రీనివాస రావు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో తెరంగేట్రం చేశారు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో మరపురాని క్యారెక్టర్లు ప్లే చేశారు. 750కి పైగా సినిమాల్లో నటించారు.
9 నంది అవార్డులు
కోట శ్రీనివాస రావు 9 నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. ప్రతిఘటన సినిమాలో యాక్టింగ్ కు తొలిసారి నంది అందుకున్నారు. ఆ తర్వాత గాయం, తీర్పు, లిటిల్ సోల్జర్స్, గణేష్, చిన్న, పెళ్లైన కొత్తలో, ఆ నలుగురు, పృథ్వీ నారాయణ సినిమాల్లో అమేజింగ్ యాక్టింగ్ తో నంది పురస్కారాలను ఖాతాలో వేసుకున్నారు. 2015లో పద్మశ్రీ పురస్కారం దక్కించుకున్నారు.
‘అహ నా పెళ్లంటా’ సినిమాలో పిసినారి గా, ‘గణేష్’ మూవీలో పవర్ ఫుల్ విలన్ గా, ‘సంతోషం’ సినిమాలో నవ్వించే బాస్ గా.. ఇలా విభిన్నమైన పాత్రలు పోషించారు కోట శ్రీనివాస రావు.
మూవీలో చూడొచ్చు
కన్నుమూసిన కోట శ్రీనివాస రావును చివరిసారిగా ఓ మూవీలో చూసే అవకాశం ఉంది. చనిపోవడానికి ముందు పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమాలో చిన్న క్యారెక్టర్ చేశారు కోట. ఈ సినిమా జూలై 31న రిలీజ్ కానుంది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper



