టైటిల్: కొత్తపల్లిలో ఒకప్పుడు

నటీనటులు : మనోజ్ చంద్ర, రవీంద్ర విజయ్, మోనిక టి, ఉష బోనెలా, బెనర్జీ, ఫణి, బొంగు సత్తి, ప్రేమ్‌సాగర్ తదితరులు
దర్శకత్వం : ప్రవీణ పరుచూరి
సంగీతం : మణి శర్మ, వరుణ్ ఉన్ని
సినిమాటోగ్రఫీ: పెట్రోస్ అంటోని యాడిస్
ఎడిటింగ్: కిరణ్ ఆర్
నిర్మాతలు: గోపాలకృష్ణ పరుచూరి, ప్రవీణ పరుచూరి
విడుదల తేది: జులై 18, 2025
టాలీవుడ్‌లో విలేజ్ క్లాసిక్ హిట్ మూవీగా మంచి ప్రశంసలు పొందిన సినిమా కేరాఫ్ కంచరపాలెం. ఈ సినిమాలోని ప్రతి ఒక్క పాత్ర ఎంతో మెప్పిస్తుంది. దగ్గుబాటి రాణా సమర్పణలో 2018లో వచ్చిన కేరాఫ్ కంచరపాలెం సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు అదే నిర్మాతల నుంచి వచ్చిన మరో రస్టిక్ డ్రామా చిత్రమే కొత్తపల్లిలో ఒకప్పుడు.
కేరాఫ్ కంచరపాలెం సినిమాకు నిర్మాతగా, వేశ్య పాత్రలో నటించిన ప్రణయ పరుచూరి కొత్తపల్లిలో ఒకప్పుడు మూవీకి దర్శకత్వం వహించారు. మొత్తం కొత్త నటీనటులతో ప్రణయ పరుచూరి తెరకెక్కించిన ఈ సినిమాను కూడా దగ్గుబాటి రాణా సమర్పించారు.
రెండు రోజుల ముందుగానే
కంటెంట్‌పై ఉన్న నమ్మకంతో థియేట్రికల్ రిలీజ్ డేట్ కంటే రెండు రోజుల ముందుగానే మీడియా ప్రతినిధులకు కొత్తపల్లిలో ఒకప్పుడు మూవీని ప్రదర్శించారు రానా దగ్గుబాటి. మరి ఇవాళ (జులై 18) థియేటర్లలో విడుదల కానున్న ఈ తెలుగు రస్టిక్ డ్రామా చిత్రం ఎలా ఉందో, కేరాఫ్ కంచరపాలెం సినిమాను తలపించిందా లేదా అనేది నేటి కొత్తపల్లిలో ఒకప్పుడు రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
1997లో కొత్తపల్లి అనే కుగ్రామంలో కథ నడుస్తుంది. కొత్తపల్లిలో అప్పన్న (రవీంద్ర విజయ్) ఊరివాళ్లకు అప్పులిచ్చి టార్చర్ పెడుతుంటాడు. అతని దగ్గర పనిచేసే రామకృష్ణ (మనోజ్ చంద్ర) గ్రామస్థులకు సాయం చేస్తుంటాడు. అలాగే, ఆ ఊరిపెద్ద రెడ్డి (బెనర్జీ) మనవరాలు సావిత్రి (మౌనిక టి)ని ఇష్టపడతాడు.
{{/usCountry}}1997లో కొత్తపల్లి అనే కుగ్రామంలో కథ నడుస్తుంది. కొత్తపల్లిలో అప్పన్న (రవీంద్ర విజయ్) ఊరివాళ్లకు అప్పులిచ్చి టార్చర్ పెడుతుంటాడు. అతని దగ్గర పనిచేసే రామకృష్ణ (మనోజ్ చంద్ర) గ్రామస్థులకు సాయం చేస్తుంటాడు. అలాగే, ఆ ఊరిపెద్ద రెడ్డి (బెనర్జీ) మనవరాలు సావిత్రి (మౌనిక టి)ని ఇష్టపడతాడు.
{{/usCountry}}సావిత్రి ప్రేమ పొందడానికి మరో అమ్మాయి అందం (ఉషా బోనెల) సహాయం అడుగుతాడు. కానీ, కట్ చేస్తే అందంతో రామకృష్ణ పెళ్లి అవుతుంది. ఆ తర్వాత రామకృష్ణ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? అసలు సావిత్రిని ప్రేమించిన రామకృష్ణ సాయం కోరిన అందంతో పెళ్లి ఎలా జరిగింది? రామకృష్ణకు సహాయం చేద్దామనుకున్న అప్పన్నకు ఏమైంది? వంటి విషయాలు తెలియాలంటే కొత్తపల్లిలో ఒకప్పుడు చూడాల్సిందే.
విశ్లేషణ:
కేరాఫ్ కంచరపాలెం నిర్మాతల నుంచి సినిమా అనగానే మంచి అంచనాలు ఉంటాయి. ఆ సినిమా మెచ్చినవారు కచ్చితంగా చూడాలనుకుంటారు. అందులోనూ ఆ సినిమాలో వేశ్యగా మెప్పించిన నటి ప్రణయ డైరెక్టర్ అని తెలియగానే ఇంకాస్తా క్యూరియాసిటీని పెంచింది.
అయితే, మరి కేరాఫ్ కంచరపాలెం సినిమాను తలపించకపోయిన దర్శకురాలిగా ఒకింత సక్సెస్ అయ్యారు ప్రణయ పరుచూరి. ఫస్టాఫ్‌లో పెద్దగా కథ లేకుండా రూరల్ బ్యాక్‌డ్రాప్ సీన్లతో బాగానే నడిపించారు. కొన్నిచోట్ల కామెడీ, డైలాగ్స్‌తో పర్వాలేదనిపించారు.
చిన్ని చిన్ని పొరపాట్లు
అయితే, మరికొన్ని చోట్ల మరి సాగదీత వంటి ఫీలింగ్ కలిగింది. కొన్నిసార్లు సీన్ టు సీన్ జంప్ అయిన భావన వస్తుంది. కానీ, కథ పరంగా బాగుందనే చెప్పుకోవాలి. కొన్ని బిగినర్ మిస్టేక్స్ అన్నట్లుగా చిన్ని చిన్ని పొరపాట్లు ఉన్నప్పటికీ ఓవరాల్‌గా కొత్తపల్లిలో ఒకప్పుడు మెప్పించేలా ఉంది.
సినిమాటోగ్రఫీ రస్టిక్‌గా నేచురల్‌గా ఉంది. విజువల్స్ బాగున్నాయి. ఎడిటింగ్ ఓకే. ఓ పాట అలరిస్తుంది. బీజీఎమ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. ఇక నటీనటుల పర్ఫామెన్స్ బాగుంది. ముఖ్యంగా రవీంద్ర విజయ్ మెప్పించారు. అలాగే, కొత్తవాళ్లలో ఉష బోనెలా, మనోజ్ చంద్ర, మోనిక టి బాగా చేశారు.
మెప్పించే విలేజ్ డ్రామా
మిగతా పాత్రధారులు కూడా తమ పరిధిమేర ఆకట్టుకున్నారు. నటిగా మెప్పించి నిర్మాతగా రాణించిన ప్రణయ పరుచూరి దర్శకురాలిగా పూర్తి స్థాయిలో కాకున్న బాగానే సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్‌గా చెప్పాలంటే చిన్ని పొరపాట్లతో మెప్పించే విలేజ్ రస్టిక్ డ్రామా కొత్తపల్లిలో ఒకప్పుడు.