కుబేర బ్లాక్‌బస్టర్.. మూడో రోజు బాక్సాఫీస్ కలెక్షన్లు.. రూ.80 కోట్ల మార్క్ దాటేసిన నాగార్జున, ధనుష్ మూవీ
నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా నటించిన కుబేర మూవీ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.80 కోట్ల మార్క్ అందుకుంది. తొలి షో నుంచే వచ్చిన పాజిటివ్ టాక్ తో మూడో రోజు ఈ సినిమా వసూళ్లు మరింత పెరిగాయి.
కుబేర మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ ను మరోసారి నిలబెట్టింది. కొన్నాళ్లుగా మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న ఇండస్ట్రీకి ఈ సినిమా కొత్త ఊపిరిలూదింది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా నటించిన ఈ సినిమా మూడు రోజుల్లోనే రూ.80 కోట్ల మార్క్ అందుకుంది.

కుబేర బ్లాక్‌బస్టర్
కుబేరమూవీ బాక్సాఫీస్ దుమ్ముదులుపుతోంది. మూడోరోజైన ఆదివారం (జూన్ 22) ఇండియాలోనే రూ.19 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఇది ఒక రోజు సాధించిన అత్యధిక మొత్తం కావడం విశేషం. మూడో రోజు తెలుగులో రూ.12.4 కోట్లు, తమిళంలో 4.5 కోట్లు వసూలు చేసింది.
దీంతో మూడు రోజులు కలిపి ఇండియా నెట్ వసూళ్లు రూ.49 కోట్లు దాటాయి. సోమవారం (జూన్ 23) రూ.50 కోట్ల నెట్ కలెక్షన్ల మార్క్ కూడా అందుకోబోతోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే గ్రాస్ వసూళ్లు రూ.80 కోట్ల మార్క్ అందుకుంది. ఇండియాలోనే గ్రాస్ వసూళ్లు రూ.55 కోట్లుగా ఉంది.
తెలుగు వెన్షన్ నుంచే ఎక్కువగా..
కుబేర పాన్ ఇండియా రిలీజ్ అయినా.. దీనిని తెలుగు, తమిళంలలో ఒకేసారి షూట్ చేశారు. దీంతో ప్రధానంగా ఈ రెండు వెర్షన్ల నుంచే ఎక్కువ వసూళ్లు వచ్చాయి. తెలుగులోనూ తొలి మూడు రోజులు కలిపి ఇండియా నెట్ వసూళ్లు రూ.34 కోట్లుగా ఉన్నాయి.
ఇక తమిళంలో రూ.13.65 కోట్లు వచ్చాయి. తెలుగు వెర్షన్ నైజాం ఏరియాలో మరింత దూసుకెళ్తోంది. మూడు రోజులు కలిపి నైజాం నుంచే రూ.9.5 కోట్లు రావడం విశేషం. కొన్నాళ్లుగా తెలుగులో పెద్ద హిట్ లేదు. ఇప్పుడా లోటును కుబేర తీర్చింది.
కుబేర మిలియన్ టికెట్ల మార్క్
ఇక కుబేర మూవీ కేవలం మౌత్ పబ్లిసిటీ ద్వారానేబాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. తొలి షో నుంచే అన్ని వైపుల నుంచీ పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ఆ ప్రభావం టికెట్ల అమ్మకాలపై స్పష్టంగా కనిపించింది. రోజురోజుకూ టికెట్ల అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి.
సోమవారం అయినా కూడా తిరుపతిలో ఒక థియేటర్లో హౌస్‌ఫుల్ బోర్డు ఉన్న ఫొటోను కుబేర మూవీ టీమ్ తన ఎక్స్ అకౌంట్ లో షేర్ చేసింది. ఇక బుక్ మై షోలో ఈ సినిమా ఇప్పటికే మిలియన్ టికెట్ల మార్క్ కూడా దాటేసింది. ఈ విషయాన్ని కూడా ఆ మూవీ టీమ్ కన్ఫమ్ చేసింది.
ఆదివారమే (జూన్ 22) కుబేర టీమ్ సక్సెస్ మీట్ కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. సినిమాను ఆకాశానికెత్తాడు. ముఖ్యంగా ధనుష్, నాగార్జున, రష్మిక నటనను ప్రశంసించాడు. ఇలాంటి మంచి కంటెంట్ తో సినిమాలు తీస్తే ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించవచ్చన్న నమ్మకాన్ని కుబేర మూవీ కలిగించిందని చిరు అన్నాడు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper



