బిచ్చగాడి పాత్రలో ధనుష్, గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నాగార్జున కలిసి అదరగొట్టిన సినిమా ‘కుబేర’. ఈ మూవీ థియేటర్లలో సత్తాచాటింది. అంచనాలను మించి వసూళ్లు రాబట్టింది. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన కుబేర మూవీ ఓటీటీ రిలీజ్ పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం త్వరలోనే ఆ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
ఏ ఓటీటీలోకి?

సూపర్ హిట్ మూవీ కుబేర ఓటీటీ రైట్స్ ను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఈ ఓటీటీలోనే కుబేర మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం ప్రైమ్ వీడియో సుమారు రూ.50 కోట్లు ఖర్చు పెట్టిందన్నది ఇండస్ట్రీ వర్గాల మాట. పాజిటివ్ టాక్ తో కలెక్షన్ల దుమ్ము రేపిన కుబేర ఓటీటీ రైట్స్ కోసం డిమాండ్ నెలకొన్నప్పటికీ ప్రైమ్ వీడియో హక్కులు దక్కించుకున్నట్లు తెలిసింది.
ఆ రోజేనా?
కుబేర సినిమా జూన్ 20న థియేటర్లలో రిలీజైంది. సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ మూవీ కలెక్షన్లు ఇప్పటికే రూ.150 కోట్లు దాటేశాయి. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై ఉత్కంఠ నెలకొంది. రెండు తేదీలు వినిపిస్తున్నాయి. జూలై 18 లేదా జూలై 20న ఈ మూవీ ఓటీటీలోకి వస్తుందనే వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో వైరల్ గా మారింది. మరి ఈ రెండింట్లో ఏ డేట్ లాక్ చేస్తారో చూడాలి. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలోనూ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది.
శేఖర్ సత్తా
ఫీల్ గుడ్ సినిమాలు తీస్తారని డైరెక్టర్ శేఖర్ కమ్ములకు పేరుంది. ఆయన కొత్త ప్రయోగంతో రూపొందించిన మూవీ కుబేర. లక్ష కోట్ల స్కామ్ చూట్టూ సాగే కథ ఇది. ఇందులో ధనుష్ బిచ్చగాడిగా, నాగార్జున మాజీ సీబీఐ ఆఫీసర్ గా నటించారు. లక్ష కోట్ల స్కామ్ చేసే విలన్ నీరజ్ మిత్రా (జిమ్ సర్బ్)కు హెల్ప్ చేసే గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నాగార్జున ఇరగదీశారు. చివర్లో తన యాక్టింగ్ లో వైవిధ్యాన్ని చూపించారు.
రష్మిక మందన్న హీరోయిన్ గా యాక్ట్ చేసిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. సినిమా సాంగ్స్, బీజీఎం మరో లెవల్ లో ఉన్నాయి. శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ పై ఈ మూవీని సునీల్ నారంగ్, రామ్ మోహన్ రావు, అజయ్ నిర్మించారు.
{{/usCountry}}రష్మిక మందన్న హీరోయిన్ గా యాక్ట్ చేసిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. సినిమా సాంగ్స్, బీజీఎం మరో లెవల్ లో ఉన్నాయి. శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ పై ఈ మూవీని సునీల్ నారంగ్, రామ్ మోహన్ రావు, అజయ్ నిర్మించారు.
{{/usCountry}}