కుబేర రివ్యూ: బిలినీయర్-బిచ్చగాడు-సీబీఐ ఆఫీసర్ లక్ష కోట్ల స్కామ్ కథ- నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా మూవీ ఎలా ఉందంటే?

నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా కలిసి నటించిన చిత్రం కుబేర. డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన కుబేర మూవీ ఇవాళ (జూన్ 20) పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది, నాగార్జున, ధనుష్, రష్మిక యాక్టింగ్ ఎలా చేశారు వంటి విశేషాలను నేటి కుబేర రివ్యూలో తెలుసుకుందాం.

Published on: Jun 20, 2025, 13:51:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టైటిల్: కుబేర

కుబేర రివ్యూ: బిలినీయర్-బిచ్చగాడు-సీబీఐ ఆఫీసర్ లక్ష కోట్ల స్కామ్ కథ- నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా మూవీ ఎలా ఉందంటే?
కుబేర రివ్యూ: బిలినీయర్-బిచ్చగాడు-సీబీఐ ఆఫీసర్ లక్ష కోట్ల స్కామ్ కథ- నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా మూవీ ఎలా ఉందంటే?

నటీనటులు: ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా, జిమ్ సర్బ్, దలిప్ తాహిల్, షాయాజీ షిండే తదితరులు

కథ: శేఖర్ కమ్ముల, చైతన్య పింగళి

దర్శకత్వం: శేఖర్ కమ్ముల

సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మిరెడ్డి

ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్

నిర్మాతలు: సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, అజయ్ కైకాల

విడుదల తేది జూన్ 20, 2025

టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన తెలుగు, తమిళ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా చిత్రం కుబేర. శేఖర్ కమ్ముల నుంచి ఓ సినిమా వస్తుందంటేనే భారీ అంచనాలు ఉంటాయి. అలాంటి ఆయన సినిమాలో నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా వాంటి స్టార్స్ నటించారంటే ఆ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి.

కుబేర మూవీ రివ్యూ

ఇలా భారీ అంచనాల నడుమ కుబేర మూవీ ఇవాళ (జూన్ 20) పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా మెప్పించిందా?, నాగార్జున, ధనుష్, రష్మిక ఎలా యాక్ట్ చేశారు? వంటి అన్ని అంశాలను నేటి కుబేర రివ్యూలో చర్చిద్దాం.

కథ:

ప్రముఖ వ్యాపారవేత్త నీరజ్ (జిమ్ సర్బ్) బిగ్గెస్ట్ బిలియనీర్. బంగాళఖాతంలో ఏర్పడిన ఆయిల్ నిధిని దక్కించుకునేందుకు పెద్దలతో చేతులు కలుపుతాడు. అయితే వారికి లక్ష కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా రూ. 50 వేల కోట్లను వైట్‌గా, మరో 50 వేల కోట్లను బ్లాక్ మనీగా హావాల చేసి ఇవ్వాల్సి ఉంటుంది.

ఈ పని కోసం జైలులో ఉన్న మాజీ సీబీఐ ఆఫీసర్ దీపక్ (నాగార్జున)ను బయటకు తీసుకొస్తాడు నీరజ్. రూ. లక్ష కోట్ల హవాల ప్లాన్‌ను అమలు చేసేందుకు నలుగురు బిచ్చగాళ్ల అవసరం పడుతుంది. ముగ్గురు బిచ్చగాళ్లు పని పూర్తి చేయగా నాలుగో బిచ్చగాడు అయిన దేవా (ధనుష్) తప్పించుకుంటాడు. దాంతో దేవా వెంట దీపక్ టీమ్ పడుతుంది.

కుబేర ట్విస్టులు

అసలు దేవా ఎందుకు తప్పించుకున్నాడు? బిచ్చగాళ్లతో హవాలా ఎలా చేశారు? మిగిలిన ముగ్గురు బిచ్చగాళ్లు ఏమయ్యారు? అసలు ఈ హవాల పనికి దీపక్‌నే బిలియనీర్ నీరజ్ ఎందుకు సెలెక్ట్ చేశాడు? సీబీఐ ఆఫీసర్ అయిన దీపక్ జైలులో ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఈ క్రమంలో సమీర (రష్మిక మందన్నా) పాత్ర ఏంటీ? అనే విషయాలు తెలియాలంటే కుబేర మూవీ చూడాల్సిందే.

విశ్లేషణ:

శేఖర్ కమ్ముల సినిమా అంటే ఒక మార్క్ ఉంటుంది. ఆ మార్క్‌ను పర్ఫెక్ట్‌గా రీచ్ అయ్యారు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఇది ఒక లక్ష కోట్ల స్కామ్ కథ. ఈ స్కామ్‌లో ఒక బిలినియర్, ఓ బెగ్గర్, ఒక సీబీఐ ఆఫీసర్ ఎలా వచ్చారన్న ఎంగేజింగ్ సీన్లతో సాగే సినిమానే కుబేర.

సినిమా ప్రారంభం నుంచి థ్రిల్లింగ్‌గా సాగుతుంది. ఫస్టాఫ్ అంతా ఏం జరగుతుందా అన్న ఇంటెన్సితో చూసేలా ఉంది. పాత్రల పరిచయం, బినామీగా బిచ్చగాడిగా మారడం, చావు నుంచి తప్పించుకోవడం వంటి సీన్లతో ఎంతో ఎంగేజింగ్‌‌గా సినిమా సాగుతుంది. ఇక సెకండాఫ్ కూడా మెప్పించేలా ఉంటుంది. అయితే, అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు సాగదీతలా అనిపిస్తాయి. కానీ, అవి కూడా బాగుంటాయి.

యాక్టింగ్ అదుర్స్

కథ పరంగా ఆ సన్నివేశాలను పెట్టినట్లు ఉంటాయి. క్లైమాక్స్ కూడా పర్వాలేదు. చూస్తున్నంతసేపు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది కుబేర. ఇక నటీనటుల విషయానికొస్తే.. ధనుష్ అదరగొట్టాడు. అలాంటి పాత్రలో అంతలా ఒదిగిపోయి చేయడం ధనుష్‌కే సాధ్యం. మరో నేషనల్ అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్ ఇచ్చాడు ధనుష్.

అలాగే, నాగార్జునను ఎన్నడూ చూడని విధంగా చూస్తాం. కొన్ని సన్నివేశాల్లో నాగార్జున అదరగొట్టాడు. ఇక రష్మిక మందన్నా ఫుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ధనుష్, నాగార్జున, రష్మిక ఎవరికి వారు నటనతో మెప్పించారు. విలన్‌గా జిమ్ సర్బ్ యాక్టింగ్ బాగుంది. సినిమాకు మరో హీరో అంటే దేవీ శ్రీ ప్రసాద్.

బీజీఎమ్ సూపర్

బీజీఎమ్, సాంగ్స్ అన్నింట్లో సక్సెస్ అయ్యాడు. బోరింగ్ సన్నివేశాల్లో కూడా తనదైన మార్క్ బీజీఎమ్‌తో అలరించాడు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అంతా పర్ఫెక్ట్‌గా ఉంది. సినిమా రిచ్‌గా ఉంది.

మస్ట్ వాచ్ మూవీ

ఇక డైరెక్టర్‌గా శేఖర్ కమ్ముల మరోసారి సక్సెస్ అయ్యారు. తన స్టైల్ మేకింగ్‌తో క్రైమ్ థ్రిల్లర్‌ను సోషల్ మెసెజ్‌తో ప్రజంట్ చేశారు. ఫైనల్‌గా చెప్పాలంటే థ్రిల్లింగ్‌గా ఎంగేజ్ చేసే మస్ట్ వాచ్ థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ థ్రిల్లర్ డ్రామా కుబేర.

రేటింగ్: 3.5/5

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More