ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన 2 తెలుగు మల్టీస్టారర్ సినిమాలు- ఒకటి లక్ష కోట్ల స్కామ్‌పై క్రైమ్ థ్రిల్లర్- మరోటి యాక్షన్ మూవీ!
ఓటీటీలోకి ఇవాళ రెండు తెలుగు క్రేజీ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. అందులోనూ ఆ రెండు సినిమాలు కూడా మల్టీ స్టారర్ సినిమాలు. ఒకటి లక్ష కోట్ల స్కామ్‌పై క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కితే మరోటి రూరల్ యాక్షన్ డ్రామా చిత్రంగా తీశారు. మరి ఆ రెండు సినిమాలు ఏంటీ, వాటి ఓటీటీలు ఏంటో ఇక్కడ చూద్దాం.
ఓటీటీలోకి ఇవాళ తెలుగు నుంచి రెండు క్రేజీ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. ఆ రెండు కూడా తెలుగు ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూసిన సినిమాలు. అంతేకాకుండా ఆ రెండు చిత్రాలు మంచి మల్టీస్టారర్ సినిమాలు కావడం విశేషం. ఆ రెండింటిని దాదాపుగా ఈపాటికి అందరూ గెస్ చేసే ఉంటారు. కానీ, మనం ఒక్కో దాని గురించి చెప్పుకుంటూ పోదాం.
ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన 2 తెలుగు మల్టీస్టారర్ సినిమాలు- ఒకటి లక్ష కోట్ల స్కామ్‌పై క్రైమ్ థ్రిల్లర్- మరోటి యాక్షన్ మూవీ!
క్రైమ్ థ్రిల్లర్ సినిమా
ఓటీటీలోకి ఇవాళ వచ్చిన రెండు తెలుగు సినిమాల్లో ఒకటి కుబేర. క్రైమ్ థ్రిల్లర్ ఎమోషనల్ డ్రామా జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో ఓ బిలీనియర్ లక్ష కోట్ల స్కామ్ చేయడం, దాన్ని వైట్ మనీగా మార్చేందుకు బినామీగా నలుగురు బిచ్చగాలను వాడుకోవడం వంటి స్టోరీతో ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది.
ఫ్యామిలీ అంతా కలిసే చూసే సినిమాలను తెరకెక్కించిన పాపులర్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కుబేర సినిమాకు దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలీవుడ్ కింగ్ నాగార్జున ముగ్గురు ప్రధాన పాత్రలు పోషించారు.
కుబేర ఓటీటీ రిలీజ్
బిగ్ మల్టీ స్టారర్ సినిమాగా తెరకెక్కిన కుబేర జూన్ 20న థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. చాలా వరకు ఫుల్ పాజిటివిటీ సొంతం చేసుకుంది. తెలుగులో సూపర్ హిట్ అయిన కుబేర ఓటీటీలోకి ఇవాళ (జూలై 18) వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్లో నేటి నుంచి కుబేర ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
అది కూడా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం వంటి ఐదు భాషల్లో కుబేర ఓటీటీ రిలీజ్ అయింది. తెలుగు ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూసిన కుబేర మూవీని ప్రైమ్ వీడియో ఓటీటీలో లుక్కేయండి.
యాక్షన్ థ్రిల్లర్‌గా
నేడు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన మరో తెలుగు సినిమా భైరవం. మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ వంటి ముగ్గురు హీరోలు నటించిన మల్టీ స్టారర్ సినిమా భైరవం. నాంది, ఉగ్రం వంటి చిత్రాల దర్శకుడు విజయ్ కనకమేడల భైరవం సినిమాను యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కించారు.
అదితి శంకర్, దివ్య పిల్లై, ఆనంది ముగ్గురు హీరోయిన్స్‌గా జయసుధ, డైరెక్టర్ సందీప్ రాజ్ కీలక పాత్రలో నటించిన భైరవం మే 30న థియేటర్లలో విడుదలై పర్వాలేదనిపించుకుంది. ఆడియెన్స్ నుంచి మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న భైరవంలో ముగ్గురు హీరోల యాక్టింగ్ అదిరిపోయిందని ప్రశంసలు వచ్చాయి.
భైరవం ఓటీటీ స్ట్రీమింగ్
ముగ్గురికి ముగ్గురు నటనలో వైవిధ్యం చూపించారని, స్నేహం, రివేంజ్, యాక్షన్, ప్రేమ వంటి అంశాలతో తెరకెక్కిన భైరవం ఓటీటీలోకి ఇవాళ వచ్చేసింది. జీ5లో భైరవం ఓటీటీ రిలీజ్ అయింది. తెలుగు, హిందీ రెండు భాషల్లో భైరవం ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.